
పాన్ ఇండియా స్టార్ రష్మిక నటించిన ‘కుబేర’ చిత్రం జూన్ 20న విడుదలవుతోంది. ఈ సినిమా షూటింగ్‌లో ధనుష్, రష్మిక మధ్య జరిగిన ఆసక్తికర సంఘటనను ధనుష్ వెల్లడించాడు. సినిమాలో ధనుష్ బిచ్చగాడి పాత్రను పోషించాడు.
Key Points
ధనుష్ 'కుబేర' సినిమాలో బిచ్చగాడి పాత్ర పోషించాడు.
షూటింగ్ సమయంలో రష్మిక వాసనను గురించి ఆశ్చర్యకరమైన విషయం చెప్పాడు ధనుష్.
'కుబేర' సినిమా జూన్ 20న విడుదల కానుంది.
‘కుబేర’ షూటింగ్ అనుభవాలు
ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్‌లో దూసుకుపోతున్న హీరోయిన్ రష్మిక. పుష్ప 2, ఛావా లాంటి సినిమాలతో వందల కోట్ల కలెక్షన్స్ అందుకున్న ఈమె.. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఈమె నుంచి రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘కుబేర’. జూన్ 20న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ముంబైలో సాంగ్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో మాట్లాడుతూ ధనుష్.. రష్మిక గురించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పుకొచ్చాడు.
ఈ సినిమాలో తాను బిచ్చగాడు పాత్ర చేశానని, ఓసారి డంప్ యార్డ్‌లో దాదాపు ఆరేడు గంటలు షూటింగ్ చేయాల్సి వచ్చిందని ధనుష్ చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో తామంతా చెత్త నుంచి వచ్చే కంపుతో ఇబ్బంది పడుతుంటే.. రష్మిక మాత్రం నాకేం వాసన రావడం లేదు అని చెప్పేది. దీంతో ఆశ్చర్యపోవడం మా వంతైందని ధనుష్ అన్నాడు. అలానే ‘కుబేర’.. జీవితంలోని మరో కోణాన్ని తనకు పరిచయం చేసిందని, చిన్ననాటి రోజుల్ని గుర్తుచేసిందని చెప్పాడు.
ధనుష్, రష్మిక మధ్య సంభాషణ
ఇదే సినిమాలో కీ రోల్ చేసిన నాగార్జున మాట్లాడుతూ.. రష్మికని ఆకాశానికెత్తేశాడు. టాలెంట్‌లో ఈ అమ్మాయి పవర్ హౌస్ అంటూ పొగిడేశాడు. అలానే హీరోగా ఎందుకు చేయట్లేదంటే తనకు నచ్చే స్టోరీలు రావట్లేదని అన్నాడు. శేఖర్ కమ్ములు ఈ స్క్రిప్ట్‌తో తన దగ్గరకు రాగానే విని ఓకే చేశానని చెప్పుకొచ్చాడు. త్వరలో ‘కూలీ’తో మరోసారి హిందీ ప్రేక్షకుల్ని పలకరించబోతున్నానని కూడా చెప్పాడు.
నాగార్జున అభిప్రాయం
శేఖర్ కమ్ముల తీసిన ‘కుబేర’.. ఆయన గత చిత్రాలతో పోలిస్తే సమ్‌థింగ్ ఉండబోతుంది. కొన్నిరోజుల క్రితం రిలీజైన టీజర్ చూస్తే ఈ విషయం చాలామందికి అర్థమైంది. కాకపోతే ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్లు ఇది యాక్షన్ మూవీ కాదు. డబ్బు, దాని వల్ల వచ్చే అనర్ధాలు తదితర అంశాలతో సినిమాని తీసినట్లు తెలుస్తోంది. చూడాలి మరి ‘కుబేర’.. బిగ్ స్క్రీన్‌పై ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో?
‘కుబేర’ చిత్రం ధనుష్‌కు తన బాల్య జీవితం గుర్తు చేసిందని, రష్మిక ప్రతిభ అందరినీ ఆకట్టుకుందని తెలుస్తోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.


