|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ధనుష్‌ సంచలన నిర్ణయం.. రాజకీయాల్లోకి రానున్నారా..?

Published: 23-07-2025, 10:42 PM
ధనుష్‌ సంచలన నిర్ణయం.. రాజకీయాల్లోకి రానున్నారా..?

సినిమా నటులు రాజకీయాల్లోకి ప్రవేశించడం సర్వసాధారణం. తాజాగా ధనుష్‌ తన అభిమానులను కలుసుకునేందుకు ఒక వినూత్న ప్రణాళికను ప్రారంభించారు. ఇది రాజకీయ ప్రవేశానికి సంకేతమా అనే ప్రశ్న చర్చనీయాంశంగా మారింది.

Key Points

1

ధనుష్ తన అభిమానులను కలుసుకోవడానికి ప్రణాళిక చేస్తున్నారు.

2

ప్రతి ఆదివారం 500 మంది అభిమానులతో భేటీ.

4

రాజకీయ ప్రవేశంపై కోలీవుడ్‌లో చర్చ జరుగుతోంది.

అభిమానులతో భేటీ

ఎవరైనా, ఏ రంగంలోనైనా ఉన్నత స్థాయికి చేరుకున్నారంటే దాని వెనుక వారి శ్రమ, కృషి, అంకితభావం ఉంటుంది. అలా సినీ రంగంలో నిరంతర శ్రమ, పట్టుదలతో శ్రమించి సాధించిన వారు ఎందరో ఉన్నారు. అయితే , అలాంటి వారు తమ రంగంలో సాధించిన తరువాత అక్కడితో ఆగకుండా, ఇతర రంగాలతో పాటు రాజకీయాలపై దృష్టి పెడుతున్నారు. ఆవిధంగా సాధించిన వారూ ఉన్నారు. ఎన్టీఆర్‌, ఎంజీఆర్‌, జయలలిత వంటి వారు సినిమా రంగంలో అశేష ప్రేక్షకుల ఆదరాభిమానాలను అందుకుని ,రాజకీయరంగ ప్రవేశం చేసి ముఖ్యమంత్రులుగానూ ప్రజాదరణ పొందారు. ఆ తరువాత కమలహాసన్‌, విజయకాంత్‌ వంటి వారు రాజకీయ రంగప్రవేశం చేసి ప్రజల్లో ఉన్నారు. ఇక రజనీకాంత్‌ ఆ ప్రయత్నం చేసినా, ఆ తరువాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

25 వారాల ప్రణాళిక

ఇప్పుడు విజయ్‌ రాజకీయాల్లో రాణించడానికి రంగంలోకి దిగారు. ధనుష్ ‌ కూడా అదే దారిలో అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది . రజనీకాంత్‌, విజయ్‌ వంటి నటుల బాటలో ధనుష్ ‌ పయనించనున్నారు. అవును తన అభిమానులను కలిసి వారితో ఫొటోలు దిగి ఉత్సాహపరచడానికి ఆయన సిద్ధమయ్యారు. అందుకు ప్రణాళికను ఇప్పటికే సిద్ధం చేసినట్లు సమాచారం. అందులో భాగంగా గత వారమే ధనుష్‌ తన అభిమానులను కలుసుకోవలసి ఉంది. అందుకు స్థానిక సాలిగ్రామంలో ఒక స్టూడియోను కూడా 25 వారాల పాటు వారానికి ఒక్క రోజు(ఆదివారాల్లో మాత్రమే ) అభిమానులను కలుసుకునే విధంగా బుక్‌ చేసినట్లు తెలిసింది.

రాజకీయ ప్రవేశంపై చర్చ

నిజానికి గత వారమే ధనుష్‌ అభిమానులను కలుసుకోవలసి ఉందనీ, అయితే ఆయన కాలికి దెబ్బ తగలడం వల్ల ఆ వారం వాయిదా పడిందని సమాచారం. కాగా ఈ నెల 27వ తేదీ నుంచి ప్రతివారం 500 మంది అభిమానులను కలిసి మాట్లాడనున్నట్లు తెలిసింది. ఇలా అభిమానులను కలవాలన్న ధనుష్‌ సంచలన నిర్ణయం వెనుక రాజకీయ కోణం ఏదైనా ఉందా అనే చర్చ కోలీవుడ్‌ వర్గాల్లో జరుగుతోంది.

ధనుష్‌ యొక్క ఈ సంచలన నిర్ణయం రాజకీయ ప్రవేశానికి సంకేతమా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అభిమానులతో జరిగే ఈ భేటీలు రాజకీయ ప్రచారానికి దోహదపడతాయా అని చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.