
📌 Key Points
- రాజమౌళి మెచ్చుకున్న ‘ధురంధర్ 2’ – ఇది మాస్టర్ పీస్ అని కొనియాడిన జక్కన్న!
- దర్శకుడు ఆదిత్య ధర్ ప్రతిభకు జేజేలు – 4 గంటల సినిమాను ప్రేక్షకులను కట్టిపడేసేలా తీశారంటూ ప్రశంసలు!
- రణ్‌వీర్ నటన అద్భుతం – చెల్లితో వచ్చే సీన్ ఒక మాస్టర్ క్లాస్ అంటూ రాజమౌళి కామెంట్!
- మాధవన్ నటనలో దేశం యొక్క నిస్సహాయత అద్భుతంగా ఉంది – స్క్రీన్‌పై ఆయన విజయం మా విజయం!
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి ‘దురంధర్ 2’ సినిమాపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. సినిమా చూసిన తర్వాత ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఆ వివరాలు ఏంటో చూద్దాం!
రాజమౌళి రివ్యూ: ‘దురంధర్ 2’ ఒక సంచలనం!
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి తాజాగా విడుదలైన ‘ధురంధర్: ద రివెంజ్’ చిత్రంపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. సినిమా చూసిన అనంతరం ఆయన చిత్ర బృందాన్ని అభినందించారు.
రణ్‌వీర్ నటనకు ఫిదా అయిన జక్కన్న!
“నాకు ధురంధర్-1 అంటే చాలా ఇష్టం, కానీ ‘ద రివెంజ్’ మాత్రం స్కేల్ పరంగానూ, సోల్ పరంగానూ మొదటి భాగాన్ని మించిపోయింది” అని రాజమౌళి పేర్కొన్నారు. సినిమాలోని రచన, నటీనటుల ఎంపిక, సాంకేతిక పనితీరు, సంగీతం, దర్శకత్వం అన్నీ అత్యున్నత ప్రమాణాలతో ఉన్నాయని ఆయన ప్రశంసించారు. దర్శకుడు ఆదిత్య ధర్ గురించి చెబుతూ.. “ఏకంగా 4 గంటల నిడివి ఉన్న సినిమాను తీసి విడుదల చేయాలంటే చాలా గుండె ధైర్యం ఉండాలి. కానీ ప్రేక్షకులు చివరి ఫ్రేమ్ వరకు సీటుకే అతుక్కుపోయేలా చేయడంలో మీరు సఫలమయ్యారు. ఆదిత్య ధర్.. మీరు ఈ సినిమాతో సిక్సర్ కొట్టారు” అని అభినందించారు.
మాధవన్ గురించి రాజమౌళి సంచలన వ్యాఖ్యలు!
ఇక నటీనటుల నటన గురించి రాజమౌళి ప్రత్యేకంగా ప్రస్తావించారు. “రణవీర్.. ఏమా పర్ఫార్మెన్స్ అది! ఆ షెడ్‌లో చెల్లెలితో వచ్చే సీన్ నటనకు ఒక మాస్టర్ క్లాస్. హంజా, జస్కీరత్ పాత్రల్లో మమ్మల్ని మంత్రముగ్ధులను చేశారు” అని పేర్కొన్నారు. “ఒక దేశం ఎదుర్కొంటున్న నిస్సహాయతను, అసహనాన్ని మాధవన్ తన నటనలో అద్భుతంగా పండించారు. స్క్రీన్‌పై ఆయన విజయాన్ని మా సొంత విజయంగా భావించాం.” అని జక్కన్న తెలిపారు. సినిమాలోని ఎమోషనల్ పాయింట్స్, అదిరిపోయే ప్లాట్ ట్విస్ట్‌లు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని రాజమౌళి తన పోస్టులో చెప్పుకొచ్చారు.
రాజమౌళి ‘దురంధర్ 2’ గురించి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


