|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: ‘పుష్ప 2’ రికార్డుల్ని టచ్ చేయని ‘ధురంధర్ 2’ కలెక్షన్స్! ఫ్యాన్స్ నిరాశ!!

Published: 07-04-2026, 1:05 PM
షాకింగ్: 'పుష్ప 2' రికార్డుల్ని టచ్ చేయని 'ధురంధర్ 2' కలెక్షన్స్! ఫ్యాన్స్ నిరాశ!!
  • రణ్‌వీర్ సింగ్, మాధవన్ నటించిన ‘ధురంధర్ 2’ మూవీ కలెక్షన్లపై అభిమానుల్లో నిరాశ
  • 20వ రోజు కేవలం రూ.6.52 కోట్లు మాత్రమే వసూలు చేసిన ‘ధురంధర్ 2’
  • ప్రపంచవ్యాప్తంగా రూ.1625.72 కోట్ల వసూళ్లు సాధించిన ‘ధురంధర్ 2’ మూవీ
  • ‘పుష్ప 2’ రికార్డు కొట్టాలంటే ఇంకా రూ.120 కోట్లకు పైగా వసూలు చేయాలి

‘ధురంధర్ 2’ మూవీ విడుదలైన దగ్గర నుంచి సంచలనం సృష్టిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు కలెక్షన్ల పరంగా చూస్తే ‘పుష్ప 2’ రికార్డును కొట్టడం కష్టమే అనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుందో చూద్దాం!

మొదటి వారం జోరు.. ఆ తర్వాత డీలా!

రణ్‌వీర్‌ సింగ్‌, మాధవన్‌, సారా అర్జున్‌, సంజయ్‌ దత్‌ వంటి వారు నటించిన `ధురంధర్‌ 2` మూవీ విడుదల నుంచి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ మూవీకి ఉన్న క్రేజ్‌, బజ్‌, ఆదరణ చూసి అంతా ఇది ఇండియన్‌ బాక్సాఫీసు రికార్డులను బ్రేక్‌ చేస్తుందనుకున్నారు. కానీ ఇప్పుడు డీలా పడిపోయింది. మొదటి వారంలో ఉన్న జోరు రెండో వారంలో లేదు. మూడో వారంలో బాగా పడిపోయింది.  ఈ సినిమా 20వ రోజు కలెక్షన్ల వివరాలు బయటకు వచ్చాయి. 19వ రోజు (సోమవారం)తో పోలిస్తే, 20వ రోజు (మంగళవారం) వసూళ్లు మరింత తగ్గాయి.

`ధురంధర్‌ 2`  సినిమా మంగళవాారం 20వ రోజు బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.6.52 కోట్లు మాత్రమే వసూలు చేసింది. 19వ రోజున ఈ సినిమా రూ.10 కోట్లు రాబట్టింది. ఇప్పటివరకు ఇండియాలో నెట్ రూ.1030.29 కోట్లు సంపాదించగా, గ్రాస్ కలెక్షన్ రూ.1233.41 కోట్లకు చేరింది.

‘పుష్ప 2’ రికార్డు బ్రేక్ సాధ్యమేనా?

ధురంధర్‌ 2 ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈ సినిమా ఇప్పటివరకు వరల్డ్‌వైడ్‌గా రూ.1625.72 కోట్ల భారీ వసూళ్లు సాధించింది. దీంతో భారతీయ సినిమాలో అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో చిత్రంగా నిలిచింది.  ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ‘పుష్ప 2’ మూడో స్థానంలో ఉంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.1742.10 కోట్లు వసూలు చేసింది.

`ధురంధర్‌ 2′ కలెక్షన్ల పరంగా మరికొంత పుంజుకుంటే ‘పుష్ప 2’ రికార్డును బద్దలు కొట్టగలదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ తర్వాత ‘బాహుబలి 2’ (రూ.1788.06 కోట్లు) రికార్డును బ్రేక్ చేయడమే దీని తర్వాతి లక్ష్యం అవుతుంది. అయితే ఇప్పుడు వస్తోన్న కలెక్షన్లని చూస్తుంటే అది సాధ్యమేనా అనేది డౌట్‌గా మారింది. `పుష్ప 2`ని కొట్టాలంటే ఇంకా రూ.120కోట్లకుపైగా వసూళ్లని రాబట్టాలి. ఈ కలెక్షన్ల పరంగా చూస్తే ఇంకా ఇరవై రోజులకుపైగానే అవుతుంది. అయితే రాను రాను వసూళ్లు పడిపోతాయి తప్ప, పెరగవు. ఇదే జరిగితే `పుష్ప 2`ని `ధురంధర్‌ 2` కొట్టడం సాధ్యం కాదని చెప్పొచ్చు. అయితే ఈ మూవీ అన్ని రికార్డులను బ్రేక్‌ చేస్తుందనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరేలా కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

వరల్డ్ వైడ్ కలెక్షన్ల వివరాలు

`ధురంధర్‌ ది రివెంజ్’ ఒక స్పై యాక్షన్, థ్రిల్లర్ సినిమా. దీనికి ఆదిత్య ధర్  దర్శకత్వం వహించారు. జియో స్టూడియోస్, B62 స్టూడియోస్ బ్యానర్లపై లోకేష్ ధర్, ఆదిత్య ధర్, జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు. ఇది 2025లో వచ్చిన` ధురంధర్‌` సినిమాకు సీక్వెల్. ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్, సారా అర్జున్, రాకేష్ బేడీ, గౌరవ్ గెరా, డానిష్ పండోర్, మానవ్ గోహిల్ కీలక పాత్రల్లో నటించారు.

‘ధురంధర్ 2’ కలెక్షన్ల గురించి లేటెస్ట్ అప్డేట్స్ ఇవి. ఈ సినిమా ‘పుష్ప 2’ రికార్డును బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.