|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దురంధర్ 2 సినిమాకి కొత్త తలనొప్పి! ‘ఓయే ఓయే’ పాట కేసుతో షాక్!

Published: 08-04-2026, 11:35 PM
దురంధర్ 2 సినిమాకి కొత్త తలనొప్పి! ‘ఓయే ఓయే’ పాట కేసుతో షాక్!
  • ‘ధురంధర్ 2’లోని ‘ఓయే ఓయే’ పాటపై త్రిమూర్తి ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ కోర్టులో దావా వేసింది.
  • 1989లో విడుదలైన ‘త్రిదేవ్’ సినిమాలోని పాట హక్కులను ఉల్లంఘించారని ఆరోపణ.
  • పాటను తొలగించాలని, నష్టపరిహారం చెల్లించాలని త్రిమూర్తి ఫిల్మ్స్ డిమాండ్ చేసింది.
  • రణవీర్ సింగ్ సినిమా రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరిన సమయంలో వివాదం రాజుకుంది.

రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ 2’ చిత్రం ‘ఓయే ఓయే’ పాట వివాదంలో చిక్కుకుంది. ‘త్రిమూర్తి ఫిల్మ్స్’ నిర్మాణ సంస్థ ఈ పాట తమ అనుమతి లేకుండా వాడుకున్నారని ఆరోపిస్తూ కోర్టులో దావా వేసింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

‘ధురంధర్ 2’పై కాపీరైట్ ఆరోపణలు

Song Controversy: బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లతో దూసుకుపోతున్న రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ 2: ద రివెంజ్’ (Dhurandhar 2: The Revenge) చిత్రం చట్టపరమైన చిక్కుల్లో చిక్కుకుంది. చిత్రంలోని ఒక ప్రసిద్ధ పాటను అనుమతి లేకుండా వాడారంటూ ‘త్రిమూర్తి ఫిల్మ్స్’ నిర్మాణ సంస్థ న్యాయపోరాటానికి దిగింది.

Read also- Brahmamudi Serial Today Episode April 9th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందును అక్కా అంటూ పిలిచిన నందు

1989లో విడుదలైన బ్లాక్‌బస్టర్ సినిమా ‘త్రిదేవ్’ లోని అత్యంత ప్రజాదరణ పొందిన “రంగ్ దే లాల్” (ఓయే ఓయే) పాట హక్కులే ఇప్పుడు ఈ వివాదానికి కేంద్రబిందువు. ఈ పాట ఒరిజినల్ వెర్షన్‌ను కానీ, లేదా దానికి సమానంగా ఉండే వెర్షన్‌ను కానీ తమ అనుమతి లేకుండా ‘ధురంధర్ 2’ మేకర్స్ వాడారని త్రిమూర్తి ఫిల్మ్స్ ఆరోపించింది.

త్రిమూర్తి ఫిల్మ్స్ ఫిర్యాదు

దర్శకుడు ఆదిత్య ధర్ నేతృత్వంలోని ‘B62 స్టూడియోస్’ పై త్రిమూర్తి ఫిల్మ్స్ కోర్టులో దావా వేసింది. పాట మ్యూజికల్ వర్క్, సౌండ్ రికార్డింగ్ హక్కులు తమ వద్దే ఉన్నాయని, సినిమా మేకర్స్ నిబంధనలను అతిక్రమించారని పేర్కొన్నారు. థియేటర్లలో, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ప్రచార చిత్రాలలో ఈ పాటను వాడకుండా తక్షణమే నిలిపివేయాలని కోరారు. అనుమతి లేకుండా పాటను వాణిజ్యపరంగా వాడుకున్నందుకు భారీ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఆదిత్య ధర్ దర్శకత్వంలో జియో స్టూడియోస్, B62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్, ప్రస్తుతం భారత బాక్సాఫీస్ వద్ద రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరి సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమాలో రణవీర్ సింగ్‌తో పాటు సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి భారీ తారాగణం ఉంది. సినిమా ఇంతటి ఘనవిజయం సాధించిన సమయంలో ఈ లీగల్ నోటీసులు రావడం బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

వివాదం వెనుక అసలు కథ

Read also- పవన్ కళ్యాణ్ ను కలిసిన డైరెక్టర్ బాబీ.. మరో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతున్నారా?

‘ఓయే ఓయే’ పాటను కళ్యాణ్ జీ – ఆనంద్ జీ విజు షా స్వరపరచగా, ఆనంద్ బక్షి సాహిత్యం అందించారు. అమిత్ కుమార్, సప్నా ముఖర్జీ పాడిన ఈ పాట అప్పట్లో ఒక ఊపు ఊపింది. ఇప్పుడు అదే పాట ‘ధురంధర్ 2’ చిత్రంలో కీలక సందర్భంలో వినిపిస్తుంది. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది. చిత్ర యూనిట్ దీనిపై ఎలా స్పందిస్తుందో సినిమా ప్రదర్శనపై దీని ప్రభావం ఎంతవరకు ఉంటుందో వేచి చూడాలి.

దురంధర్ 2 చిత్రంపై వచ్చిన ఈ ఆరోపణలు బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారాయి. కోర్టు తీర్పు ఎలా ఉండబోతుందో, చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.