|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దురంధర్ 2 విధ్వంసం! 1622 కోట్లు కొల్లగొట్టిన రణ్‌వీర్ సింగ్ మూవీ! ఇండియాలో వెయ్యి కోట్లు దాటి రికార్డు!

Published: 07-04-2026, 2:35 AM
దురంధర్ 2 విధ్వంసం! 1622 కోట్లు కొల్లగొట్టిన రణ్‌వీర్ సింగ్ మూవీ! ఇండియాలో వెయ్యి కోట్లు దాటి రికార్డు!
  • దురంధర్ 2: ప్రపంచవ్యాప్తంగా రూ. 1622.72 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రం!
  • భారతదేశంలో దురంధర్ 2: రూ. 1000 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించిన మొదటి హిందీ సినిమాగా చరిత్ర సృష్టించింది.
  • రెండో వారంలో దురంధర్ 2 వసూళ్లు: రూ. 263.65 కోట్లు (నెట్)
  • మూడో వారం వసూళ్లు: రూ. 75.95 కోట్లు రాబట్టిన దురంధర్ 2 మూవీ.

రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. సినిమా విడుదలైన నాటి నుండి కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతుంది. ఈ చిత్రం అనేక రికార్డులను బద్దలు కొడుతూ టాలీవుడ్ టాక్ అఫ్ ది టౌన్ గా మారింది.

దురంధర్ 2 కలెక్షన్ల సునామీ: రోజు వారి వసూళ్లు!

Dhurandhar 2 Worldwide Collection: ఆదిత్య ధర్ తెరకెక్కించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. 19వ రోజున కూడా నిలకడగా వసూళ్లు రాబడుతూ, ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 1600 కోట్ల మైలురాయిని అధిగమించి రికార్డుల వేటను కొనసాగిస్తోంది.

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో దర్శకుడు ఆదిత్య ధర్ రూపొందించిన ‘ధురంధర్ 2: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద తన జైత్రయాత్రను నిరాటంకంగా కొనసాగిస్తోంది. భారతదేశంలో ధురంధర్ 2 రూ. 1000 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించిన మొట్టమొదటి హిందీ చిత్రంగా చరిత్ర సృష్టించింది. అలాగే, ఈ సినిమా మూడో వారాంతం తర్వాత కూడా గట్టి పోటీనిస్తోంది.

రెండో వారం: రూ. 263.65 కోట్లు (నెట్)

వెయ్యి కోట్లు కొల్లగొట్టిన మొదటి హిందీ సినిమాగా రికార్డు

మూడో వారం (శుక్ర-ఆది): రూ. 75.95 కోట్లు (వరుసగా రూ. 21.55 కోట్లు, రూ. 25.65 కోట్లు, రూ. 28.75 కోట్లు)

సోమవారం (ఏప్రిల్ 6) నాడు కలెక్షన్స్‌లో సహజమైన తగ్గుదల కనిపించినప్పటికీ ధురంధర్ 2 సినిమా తన పట్టును కోల్పోలేదు. కేవలం 18 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 1600 కోట్ల గ్రాస్ వసూళ్ల మార్కును ఈ చిత్రం దాటేసింది. అలాగే, 19 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ధురంధర్ 2 చిత్రం సుమారుగా రూ. 1622.72 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం.

సాంకేతిక నిపుణులకి సారా అర్జున్ ఎమోషనల్ పోస్ట్!

ముఖ్యంగా తెర వెనుక కష్టపడే సాంకేతిక నిపుణుల గురించి ప్రస్తావిస్తూ.. “మేము పోస్టర్లపై కనిపించే ముఖాలం మాత్రమే, కానీ మీరు ఈ సినిమాకు వెన్నెముక వంటి వారు. వెలుగులో ఉన్న తారలకు ఎంత చప్పట్లు కొడతారో, తెర వెనుక చెమట చిందించిన అజ్ఞాత వీరులకు కూడా అంతే గౌరవం దక్కాలి” అని సారా అర్జున్ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

గల్ఫ్ దేశాలు, పాకిస్థాన్‌లో ధురంధర్ 2 సినిమాపై నిషేధం విధించినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా మిగిలిన ప్రాంతాల్లో భారీ వసూళ్లను రాబడుతోంది. కొన్ని వర్గాల నుంచి ‘ప్రొపగాండా’ అనే విమర్శలు వచ్చినప్పటికీ, సామాన్య ప్రేక్షకులు మాత్రం ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు.

దురంధర్ 2 సినిమా కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.