
📌 Key Points
- ‘ధురంధర్’ చిత్రం మూడు వారాల్లోనే రూ.1,041 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది.
- ప్రపంచవ్యాప్తంగా రూ.1,622 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి గ్లోబల్ హిట్‌గా నిలిచింది.
- నార్త్ అమెరికాలో 25 మిలియన్ డాలర్లు దాటిన తొలి ఇండియన్ సినిమాగా రికార్డు సృష్టించింది.
- ఓవర్సీస్‌లో రూ.394 కోట్లు వసూలు చేసి ఇండియన్ సినిమా సత్తా చాటింది.
రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. విడుదలైన మూడు వారాల్లోనే రూ.1,041 కోట్ల నెట్ వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. ఈ సినిమా అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకుంది.
‘ధురంధర్’ వసూళ్ల సునామీ
Dhurandhar Boxoffice: సరైన సినిమా పడితే బాక్సాఫీస్ ఎలా షేక్ అవుతుందో మరోసారి ప్రూవ్ చేశాడు డైరెక్టర్ ఆదిత్య ధర్.యస్ ..ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘ధురంధర్: ది రివెంజ్’ ఊచకోత చూస్తుంటే వెయ్యి కోట్లు కూడా చిన్నబోతున్నాయి మరి. రణవీర్ సింగ్ నటించిన ఈ యాక్షన్ ఎపిక్, కేవలం మూడు వారాల్లోనే ఇండియన్ సినీ హిస్టరీలో ఎవరూ రాయని ఓ సరికొత్త చాప్టర్ ని లిఖించింది.
భారత్‌లో రూ.1,041 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన తొలి చిత్రం
ముఖ్యంగా సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ప్రతి రోజు ఒక కొత్త రికార్డు సెట్ అయిపోతున్నాయ్. థియేటర్లలో రన్ మొదలై 18 రోజులు గడుస్తున్నా ఆడియన్స్ డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఒకవైపు కొత్త సినిమాలు పోటీగా వస్తున్నా, ‘ధురంధర్’ తన పట్టును నిలబెట్టుకుంటూ ఇప్పటికే వేయి కోట్ల నెట్ వసూళ్ల మార్కును దాటేసింది. మొదటి వారం 8 రోజుల్లో రూ.690 కోట్లు, రెండో వారం రూ.271 కోట్లు రాబట్టిన ఈ చిత్రం, మూడవ వీకెండ్‌లో (శుక్ర-ఆది) ఏకంగా రూ.80 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టిందంటే ధురంధర్ విధ్వంసం ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుంది. ఇక భారత్‌లో రూ.1,041 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా చరిత్ర సృష్టించి,మూడు వారాలు ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా రూ.1,622 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి గ్లోబల్ హిట్‌గా నిలవడమే కాకుండా,ఓవర్సీస్ మార్కెట్‌లోరూ.394 కోట్లు కొల్లగొట్టి ఇండియన్ బాక్సాఫీస్ సత్తాను ప్రపంచానికి చాటిచెప్పింది.
రికార్డులు బద్దలు కొట్టిన రణవీర్ చిత్రం
నార్త్ అమెరికాలో 25 మిలియన్ డాలర్లు దాటిన తొలి ఇండియన్ సినిమా
అయితే హిందీలో తెరకెక్కిన ఈ సినిమా హవా కేవలం నార్త్ ఇండియాకే పరిమితం కాలేదండోయ్ ..సౌత్ మార్కెట్ లో కూడా పక్కా లోకల్ సినిమా రేంజ్ లో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో ఈ సినిమా సృష్టించిన ఇంపాక్ట్ మామూలుగా లేదు. నార్త్ అమెరికాలో 25 మిలియన్ డాలర్లు, జర్మనీలో 1 మిలియన్ యూరోలు దాటిన తొలి ఇండియన్ సినిమాగా నిలిపి రణవీర్ సింగ్ తన గ్లోబల్ పవర్ ఏంటో చాటి చెప్పాడు.
హిందీలో బిగ్గెస్ట్ ఓపెనర్& అత్యధిక పెయిడ్ ప్రివ్యూలు సాధించిన చిత్రం
ఇక జియో స్టూడియోస్ మరియు B62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం,కేవలం 10 రోజుల్లోనే ‘ధురంధర్ పార్ట్ 1’ లైఫ్ టైమ్ ఓవర్సీస్ వసూళ్లను క్రాస్ చేయడంతో పాటు హిందీలో బిగ్గెస్ట్ ఓపెనర్ మరియు అత్యధిక పెయిడ్ ప్రివ్యూలు సాధించిన చిత్రంగా నిలవడం విశేషం.అంతే కాదు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఓపెనింగ్ వీకెండ్ సాధించిన భారతీయ సినిమాగా ‘ధురంధర్’ చరిత్ర సృష్టించింది.
ఓవర్సీస్‌లో దుమ్మురేపిన ‘ధురంధర్’
ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తున్న ఇంటెన్సిటీ
మొత్తానికి హాలీవుడ్ యాక్షన్ సినిమాలే తలవంచాల్సిన రేంజ్ లో సినిమాలోని విజువల్స్,యాక్షన్ సీక్వెన్స్ లు తీర్చిదిద్దడమే సినిమా వసూళ్ళకి ప్రధాన కారణం అని తేల్చేస్తున్నారు ట్రేడ్ పండిట్స్. ముఖ్యంగా యాక్షన్ బ్లాక్స్ లో రణవీర్ బాడీ లాంగ్వేజ్, ఆ ఇంటెన్సిటీ సినిమాకు ప్రాణం పోశాయని, భారీ పేలుళ్లు,హై-స్పీడ్ ఛేజింగ్ సీన్లు ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తున్నాయని కురుస్తున్న కనక వర్షమే చెబుతుంది. ఏది ఏమైనా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఒక ఎత్తు అయితే, వాటిని ఎవరికీ అందనంత ఎత్తులో సెట్ చేయడం మరో ఎత్తు. ప్రస్తుతం ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్: ది రివెంజ్’ సరిగ్గా ఇదే చేస్తోందన్న మాట.
‘ధురంధర్’ చిత్రం భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లింది. రణవీర్ సింగ్ నట విశ్వరూపానికి బాక్సాఫీస్ షేక్ అయింది. ఈ సినిమా మరిన్ని రికార్డులు సృష్టించాలని ఆశిద్దాం.


