|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దుష్యంత్ పెళ్లి వార్త: టాలీవుడ్‌లో మరో శుభలేఖ! ఫిబ్రవరి 26న వివాహం!

Published: 16-02-2026, 12:35 PM
దుష్యంత్ పెళ్లి వార్త: టాలీవుడ్‌లో మరో శుభలేఖ! ఫిబ్రవరి 26న వివాహం!
  • కన్నడ నటుడు దుష్యంత్ మాజీ ఎంపీ ఎస్పీ మద్దే హనుమాన్ గౌడ కుమార్తె రచనతో నిశ్చితార్థం.
  • కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.
  • ఫిబ్రవరి 26న దుష్యంత్, రచనల వివాహం జరగనుంది. మార్చి 1న రిసెప్షన్ ఏర్పాటు.
  • వివాహ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.

టాలీవుడ్ నటుడు దుష్యంత్ త్వరలో వివాహం చేసుకోబోతున్నారు. ఆయన మాజీ ఎంపీ ఎస్పీ మద్దే హనుమాన్ గౌడ కుమార్తె రచనతో నిశ్చితార్థం చేసుకున్నారు. ఫిబ్రవరి 26న వీరి వివాహం జరగనుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దుష్యంత్ నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది

Dushyanth: ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు ఒక్కొక్కరు వారికి సంబంధించిన శుభవార్తను అభిమానులతో పంచుకుంటున్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఎంతోమంది సెలబ్రిటీలో పెళ్లి బంధంతో ఒకటయ్యారు. అలాగే కొంతమంది నిశ్చితార్థం కూడా జరుపుకొని ఈ ఏడాది పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 26వ తేదీ నటుడు విజయ్ దేవరకొండ ,రష్మికల పెళ్లి ఎంతో ఘనంగా జరగబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరి పెళ్లికి సంబంధించిన హడావిడి మొదలైంది. రష్మిక విజయ్ దేవరకొండతో పాటు మరొక హీరో అల్లు శిరీష్ కూడా పెళ్లికి సిద్ధమయ్యారు.

అల్లు శిరీష్ వివాహం మార్చి ఆరో తేదీ ఘనంగా జరగబోతున్న నేపథ్యంలో ఇప్పటికే పెళ్లి పనులు కూడా ప్రారంభించారు. అయితే త్వరలోనే మరో హీరో కూడా పెళ్లికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. గత వైభవం(Gatha Vaibhavam) అటు తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోగా పరిచయమయ్యారు కన్నడ నటుడు దుష్యంత్(Dushyanth). గత వైభవం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న ఈయన ప్రస్తుతం పలు సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా దుష్యం సోషల్ మీడియా వేదికగా తన నిశ్చితార్థానికి(Engagment) సంబంధించిన ఫోటోలను షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి.

మాజీ ఎంపీ కుమార్తెతో వివాహం..

మాజీ ఎంపీ కుమార్తెతో దుష్యంత్ వివాహం

దుష్యంత్ మాజీ ఎంపీ ఎస్పీ మద్దే హనుమాన్ గౌడ కుమార్తె రచన(Rachana)తో నిశ్చితార్థం జరుపుకున్నట్లు తెలుస్తోంది .ఇలా కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ నిశ్చితార్థపు వేడుక ఎంతో అంగరంగ వైభవంగా జరిగిందని తెలుస్తుంది. ఈ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను ఈయన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానులు కాబోయే దంపతులకు ముందుగానే అభినందనలు తెలియజేస్తున్నారు. అయితే వీరి పెళ్లికి సంబంధించిన వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఫిబ్రవరి 26న దుష్యంత్, రచనల వివాహం

ఈ జంట నిశ్చితార్థానికి పెళ్లికి పెద్దగా గ్యాప్ తీసుకోలేదని చెప్పాలి. వీరి నిశ్చితార్థం తాజాగా జరగగా వీరి వివాహం ఫిబ్రవరి 26వ తేదీ జరగబోతోంది. ఫిబ్రవరి 26వ తేదీ పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్న ఈ జంట మార్చి ఒకటో తేదీ ఎంతో ఘనంగా వివాహ రిసెప్షన్ వేడుకను నిర్వహించబోతున్నారు ఇక ఈ పెళ్లి వేడుకలో భాగంగా ప్రముఖ సినీ రాజకీయ నాయకులు హాజరు కాబోతుండడం విశేషం. ఇక వీరి వివాహం కూడా రష్మిక విజయ్ దేవరకొండ పెళ్లిరోజు కావటం విశేషం. విజయ్ దేవరకొండ రష్మిక వివాహం ఉదయపూర్ ప్యాలెస్ లో ఎంతో ఘనంగా జరగబోతుంది. అయితే ఈ వివాహపు వేడుకకు కేవలం కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కాబోతున్నారు. ఇలా ఫిబ్రవరి 26వ తేదీ పెళ్లి చేసుకోబోయే ఈ జంట మార్చి 4వ తేదీ హైదరాబాదులో ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు.

మొత్తానికి దుష్యంత్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుండటం ఆయన అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది. ఫిబ్రవరి 26న వీరి వివాహం జరగనుండగా, సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరవుతారని సమాచారం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.