|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఎంత బిజీగా ఉన్న ఏడాదికి ఒకసారి ఇలాంటి సినిమా ఇస్తే సంతోషిస్తాం.. నిర్మాత దిల్ రాజు కామెంట్స్

Published: 03-10-2025, 12:50 AM
ఎంత బిజీగా ఉన్న ఏడాదికి ఒకసారి ఇలాంటి సినిమా ఇస్తే సంతోషిస్తాం.. నిర్మాత దిల్ రాజు కామెంట్స్

పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన సందర్భంగా జరిగిన వేడుకలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రశంసలు కురిపించారు. పవన్ కళ్యాణ్ ఏడాదికి ఒకసారి ‘ఓజీ’ లాంటి సినిమా ఇస్తే సంతోషిస్తాం అంటూ దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Key Points

1

'ఓజీ' సినిమా సెప్టెంబర్ 25న విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది.

2

పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రజెన్స్, సుజిత్ దర్శకత్వ ప్రతిభపై దిల్ రాజు ప్రశంసలు కురిపించారు.

4

త్రివిక్రమ్ సపోర్ట్ వల్లే 'ఓజీ' సినిమా నిర్మించానని నిర్మాత డీవీవీ దానయ్య వెల్లడించారు.

‘ఓజీ’ విజయంపై దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీరగా గర్జించిన చిత్రం ‘ ఓజీ ‘. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 25న థియేటర్లలో అడుగుపెట్టింది.

తెలుగు రాష్ట్రాల్లో సెప్టెంబర్ 24 రాత్రి నుంచే ప్రత్యేక షోలు ప్రదర్శించబడ్డాయి. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రజెన్స్, సుజీత్ దర్శకత్వ ప్రతిభ, తమన్ అద్భుతమైన నేపథ్య సంగీతం, రవి కె చంద్రన్, మనోజ్ పరమహంసల కట్టిపడేసే కెమెరా పనితనం కలిసి.. ‘ఓజీ’ని హాలీవుడ్ స్థాయి చిత్రంగా నిలిపాయి.

ఇలా బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతున్న ఓజీ సినిమా విజయోత్సవ వేడుకను ఇటీవల హైదరాబాద్‌లోని ట్రైడెంట్‌ హోటల్‌‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన నిర్మాత దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

పవన్ కళ్యాణ్, సుజిత్, తమన్‌లకు దిల్ రాజు అభినందనలు

ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారు మాట్లాడుతూ.. ” పవన్ కల్యాణ్ గారి అభిమానులు అందరికీ దసరా శుభాకాంక్షలు. ఓజీ సినిమా ప్రకటించినప్పటి నుంచి మంచి అంచనాలు ఏర్పడేలా చేశాడు సుజీత్” అని అన్నారు.

“ముఖ్యంగా పవన్ కల్యాణ్ గారి ఫస్ట్ లుక్ విడుదలైనప్పుడు.. కళ్యాణ్ గారిని మనం ఎలా చూడాలి అనుకుంటున్నామో, అలాంటి లుక్‌లో చూసినప్పటి నుంచి సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని తెలుగు ప్రేక్షకులంతా ఆత్రుతగా ఎదురు చూశారు” అని దిల్ రాజు చెప్పారు.

“సెప్టెంబర్ 24 రాత్రి సుదర్శన్ థియేటర్‌లోనే నేను కూడా సినిమా చూడటం జరిగింది. కళ్యాణ్ గారి క్రేజ్ ఎలా ఉంటుందో నాకు తొలిప్రేమ సినిమా నుంచి తెలుసు. ఐతే ఇలాంటి ఒక సినిమాని రాసి, కళ్యాణ్ గారికి చెప్పి ఒప్పించినందుకు సుజిత్‌కి చాలా థాంక్స్” అని ప్రొడ్యూసర్ దిల్ రాజు తెలిపారు.

నిర్మాత డీవీవీ దానయ్య మాటలు

“అలాగే, ఇలాంటి ఒక బ్లాక్ బస్టర్ ఆల్బమ్ కళ్యాణ్ గారికి ఇచ్చినందుకు తమన్‌కి కూడా చాలా థాంక్స్. చివరిగా ఒక్క మాట.. పవన్ కళ్యాణ్ గారు ఎంత బిజీగా ఉన్నా ఏడాదికి ఒకసారి ఓజీ లాంటి సినిమా ఇస్తే సంతోషిస్తాం” తన తన స్పీచ్ ముగించారు నిర్మాత దిల్ రాజు.

చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య మాట్లాడుతూ.. “నేను ఈ సినిమా చేయడానికి ముఖ్యకారణం దర్శకుడు త్రివిక్రమ్ గారు. ఆయన వల్లే ఈ సినిమా చెయ్యగలిగాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా కోసం చాలా కష్టపడి, అలాగే ఇష్టపడి మరీ ఈ సినిమాని చేశారు. అద్భుతంగా నటించారు” అని అన్నారు.

“సుజిత్ కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. సోదరుడు తమన్ కూడా బాగా కష్టపడి చేశాడు. రవి కె చంద్రన్ గారు, అర్జున్ దాస్ గారు, శ్రియా రెడ్డి గారు, ప్రియాంక మోహన్ గారు, సాంకేతిక నిపుణులు అందరూ కూడా బాగా కష్టపడి చేశారు. ఇంతటి ఘన విజయాన్ని ఇచ్చినందుకు అందరికి నా ధన్యవాదాలు” అని ఓజీ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య తెలిపారు.

పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రం సాధించిన విజయం, దానికి దిల్ రాజు, డీవీవీ దానయ్య వంటి ప్రముఖుల ప్రశంసలు చిత్ర బృందం కృషికి నిదర్శనం. ఈ చిత్రం పవన్ అభిమానులకు ఒక గొప్ప విందు అని చెప్పడంలో సందేహం లేదు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.