|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సీరియస్ మోడ్‌లోకి డైరెక్టర్ అనుదీప్.. ఆ స్టార్ హీరోయిన్‌తో సరికొత్త ప్రయోగం..?

Published: 10-12-2025, 3:48 AM
సీరియస్ మోడ్‌లోకి డైరెక్టర్ అనుదీప్.. ఆ స్టార్ హీరోయిన్‌తో సరికొత్త ప్రయోగం..?
  • దర్శకుడు అనుదీప్ తొలిసారి సీరియస్ ఎమోషనల్ డ్రామా తీయనున్నారు.
  • గతంలో ‘జాతిరత్నాలు’ వంటి హాస్య చిత్రాలతో అనుదీప్‌కు మంచి పేరు వచ్చింది.
  • ఈ కొత్త సీరియస్ ప్రాజెక్ట్‌లో నేషనల్ క్రష్ రష్మిక మందానా లీడ్ రోల్.
  • రష్మిక గ్లామర్ పాత్రలకు అతీతంగా బలమైన ఎమోషనల్ పాత్రలు ఎంచుకుంటున్నారు.

హాస్య దర్శకుడు అనుదీప్ ఇప్పుడు సీరియస్ మోడ్‌లోకి మారారు. తొలిసారిగా ఎమోషనల్ డ్రామా చిత్రాన్ని రూపొందించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో నేషనల్ క్రష్ రష్మిక మందానా లీడ్ రోల్ పోషించనుందని టాక్. ఈ అనూహ్య కాంబినేషన్ పై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

అనుదీప్ కామెడీ ట్రాక్ నుండి సీరియస్ వైపు

టాలీవుడ్‌లో హాస్య డైరెక్టర్‌గా పేరుతెచ్చుకున్న డైరెక్టర్ కె.వి. అనుదీప్(KV Anudeep) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ‘పిట్టగోడ’(Pittagoda), ‘జాతిరత్నాలు’(Jathirathnalu) వంటి సినిమాలతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నారు. అయితే ఆ తర్వాత శివ కార్తికేయన్‌(Shiva Karthikeyan)తో తెరకెక్కించిన ‘ప్రిన్స్’(Prince) అనుకున్నంతగా విజయం సాధించలేకపోయింది. ప్రస్తుతం విశ్వక్ సేన్(Vishwak Sen), కయాదు లోహర్(Kayadu Lohar) జంటగా ‘ఫంకీ’(Funky) అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా విడుదల అవుతుందనే ప్రచారం జరిగినా, సరైన ప్రమోషన్స్ లేకపోవడంతో రిలీజ్ వాయిదా పడినట్లు సమాచారం.

రష్మిక మందానాతో అనుదీప్ సరికొత్త ప్రయోగం

ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు కామెడీ కథలకే పరిమితమైన అనుదీప్, తొలిసారి పూర్తిగా భిన్నమైన మార్గాన్ని ఎంచుకోవాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఆయన చేయబోయే నెక్స్ట్ మూవీను ఒక సీరియస్ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించబోతున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. అయితే ఇది అనుదీప్ ఫిల్మోగ్రఫీలోనే తొలిసారి జరిగే ప్రయోగం కావడంతో ఆసక్తి పెరిగింది. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్‌కు మరింత బజ్ తెచ్చింది నేషనల్ క్రష్ రష్మిక మందానా పేరు.

ఈ క్రేజీ కాంబినేషన్ పై సినీ వర్గాల్లో చర్చ

ఎందుకంటే అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సీరియస్ సినిమాలో రష్మిక(Rashmika Mandanna) లీడ్ రోల్ పోషించనుందనే సమాచారం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ బిజీగా ఉన్న రష్మిక, గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, బలమైన ఎమోషనల్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్‌ను ఎంచుకుంటూ ముందుకెళ్తోంది. ఇప్పుడు కామెడీ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన అనుదీప్, తన తొలి సీరియస్ సినిమా కోసం రష్మిక లాంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్‌ను ఎంచుకోవడం కలిసిరావొచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ఈ న్యూస్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

అనుదీప్-రష్మిక కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ సీరియస్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ వార్తలో నిజమెంత అనేది తెలియాల్సి ఉన్నా, ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.