|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దర్శకుడి కల నెరవేరినట్టయింది.. అల్లు అర్జున్ మూవీలో దీపికా పదుకొణెపై డైరెక్టర్ అట్లీ కామెంట్స్

Published: 07-06-2025, 4:12 AM
దర్శకుడి కల నెరవేరినట్టయింది.. అల్లు అర్జున్ మూవీలో దీపికా పదుకొణెపై డైరెక్టర్ అట్లీ కామెంట్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు బాలీవుడ్ నటి దీపికా పదుకొణె కలిసి నటిస్తున్న AA22 చిత్రంపై దర్శకుడు అట్లీ తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దీపికా పదుకొణె నటనను అట్లీ ప్రశంసించారు. ఈ చిత్రం అతని కల నెరవేరటం లాంటిదని ఆయన పేర్కొన్నారు.

Key Points

1

అల్లు అర్జున్, దీపికా పదుకొణె, అట్లీ కాంబినేషన్‌లో భారీ సినిమా

2

దీపికా పదుకొణె ఫస్ట్ గ్లింప్స్ వీడియో రిలీజ్

4

అట్లీ కుమార్ కు దీపికా పదుకొణె తో సినిమా చేయడం కల నెరవేరటం లాంటిది

అల్లు అర్జున్ – దీపికా పదుకొణె కాంబినేషన్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా ఏఏ22ఏ6. ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో దిగ్గజ సంస్థ కళానిధి మారన్‌కు చెందిన సన్ పిక్చర్స్ ఈ పాన్ ఇండియా సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందిస్తోంది. అనౌన్స్‌మెంట్ నుంచే సినిమాపై ఆకాశాన్నంటేలా అంచనాలు ఏర్పడ్డాయి.

దీన్ని నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లేలా బాలీవుడ్ గ్లామరస్ క్వీన్ దీపికా పదుకొణె కూడా ఈ టీమ్‌తో జాయిన్ కావటం విశేషంగా మారింది. పాన్ ఇండియా లెవల్‌లో బిగ్గెస్ట్ బడ్జెట్ విజువల్ వండర్ మూవీగా తెరకెక్కబోతున్న ఈ చిత్రం అద్భుతమైన తారాగణంతో ప్రభంజనం సృష్టించబోతోంది.

ఈ భారీ కాంబోను తెలియజేసేలా విడుదల చేసిన దీపికా పదుకొణె ఫస్ట్ గ్లింప్స్ వీడియో అభిమానులను, ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. డైరెక్టర్ అట్లీతో దీపికా పదుకొణె మాట్లాడే సన్నివేశాలతో ప్రారంభమైన ఈ వీడియో ఆమె శక్తివంతమైన పాత్రలోకి మారుతున్న విధానాన్ని చూపించిన తీరు అందరిలో ఉత్కంఠతను రేపుతోంది.

దీపికా పదుకొణె ఫస్ట్ గ్లింప్స్

హెడ్‌ గేర్‌ను ధరించి దీపికా పదుకొణె ఫుల్ కాస్ట్యూమ్స్‌తో సెట్లోకి అడుగు పెడుతూ యుద్ధానికి సిద్ధమైంది. ఈ సినిమా నుంచి దీపికా పదుకొణె ఫస్ట్ గ్లింప్స్ వీడియో రిలీజ్ సందర్భంగా హీరోయిన్‌పై డైరెక్టర్ అట్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అల్లు అర్జున్ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా చేయడంపై ఇలా రియాక్ట్ అయ్యాడు.

“జవాన్ సినిమాలో దీపిక మేడమ్‌తో కలిసి పని చేశాను. అదొక అద్భుతమైన అనుభవం. ఆమె నటనకు సంబంధించిన పరిధి, శక్తి, ప్రతి ఫ్రేమ్‌లో ఆమె అందరినీ తనవైపు తిప్పుకునేలా చేసిన గ్రేస్ గొప్పగా ఉంటాయి” అని దర్శకుడు అట్లీ తెలిపాడు.

డైరెక్టర్ అట్లీ కామెంట్స్

” షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమాలో దీపికా పదుకొణె పాత్ర ఎంత కీలకంగా ఉండి ముందుకు నడిపించిందో మనకు తెలుసు. ఇప్పుడు అల్లు అర్జున్ గారితో పాటు దీపికా పదుకొణె గారు కలిసి సినిమా చేయటం అనేది దర్శకుడి (అట్లీ కుమార్) కల నేరవేరినట్లయింది. మరచిపోలేని ఓ గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ ఇందులో సృష్టించబోతున్నాం” అని డైరెక్టర్ అట్లీ చెప్పుకొచ్చాడు.

ఇదిలా ఉంటే, అల్లు అర్జున్‌తో దీపికా పదుకొణె జోడీ కడుతుండటం, అట్లీ డైరెక్షన్, సన్ పిక్చర్స్ గ్రాండ్ విజన్‌తో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే ఉన్న హద్దులను చెరిపేసి, సిల్వర్ స్క్రీన్‌పై మరచిపోలేని సరికొత్త శక్తితో, అందరి హృదయాల్లో నిలిచిపోయే లెగసీని క్రియేట్ చేస్తుందని అభిమానులు, మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

అల్లు అర్జున్, దీపికా పదుకొణె, అట్లీ కాంబినేషన్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ అంచనాలను నింపుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. అద్భుతమైన విజువల్స్‌తో ఈ చిత్రం ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుందని భావిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.