|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మారుతి సంచలన నిర్ణయం! ప్రభాస్ ఫ్లాప్ నుండి పుంజుకుని, కొత్త సినిమా ప్రకటన!

Published: 27-03-2026, 11:35 AM
మారుతి సంచలన నిర్ణయం! ప్రభాస్ ఫ్లాప్ నుండి పుంజుకుని, కొత్త సినిమా ప్రకటన!
  • ప్రభాస్‌తో మారుతి తీసిన ‘ది రాజా సాబ్’ చిత్రంపై ట్రోల్స్ వెల్లువెత్తాయి.
  • సినిమా విడుదలకు ముందు మారుతి ఇచ్చిన కాన్ఫిడెన్స్ బెడిసి కొట్టింది.
  • శ్రీరామనవమి సందర్భంగా తన తదుపరి ప్రాజెక్ట్‌పై మారుతి అప్‌డేట్ ఇచ్చారు.
  • ప్రతి ప్రయాణం ఒక అభ్యాసమేనని మారుతి అన్నారు.

డైరెక్టర్ మారుతి ప్రభాస్‌తో ‘ది రాజా సాబ్’ చిత్రం తర్వాత ట్రోల్స్ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే, శ్రీరామనవమి సందర్భంగా ఆయన తన తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను తెలియజేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

‘ది రాజా సాబ్’పై ట్రోల్స్ ప్రభావం

Director Maruthi: డైరెక్టర్ మారుతి.. ఈ పేరు ఈ మధ్యకాలంలో ఎలా వైరల్ అయిందో తెలియంది కాదు. రెబల్ స్టార్ ప్రభాస్‌ (Rebel Star Prabhas)తో ఆయన తెరకెక్కించిన ‘ది రాజా సాబ్’ (The Raja Saab) చిత్రంలో భారీగా ట్రోల్స్ బారిన పడ్డారు. ఆ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుంటే, బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని చవిచూసింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆయనపై ఆగ్రహంతో ఉన్నారు. అందుకే, సినిమా రిలీజ్ తర్వాత ఓ రేంజ్‌లో మారుతి(Director Maruthi) పై వారు ఫైర్ అయ్యారు. సినిమా విడుదలకు ముందు మారుతి ఇచ్చిన కాన్ఫిడెన్స్, ప్రీ రిలీజ్ వేడుకలో చేసిన షో.. మొత్తం రివర్స్ కొట్టాయి. ఇలాంటి సినిమా తీయడానికి ఇన్ని సంవత్సరాల టైమ్ తీసుకుంటావా? అంటూ డైరెక్ట్‌గానే పంచ్‌లు పేల్చారు. పైగా, సినిమాలో ఒక సెకను నచ్చకపోయినా, మా ఇంటికి వచ్చి అడగవచ్చు అంటూ, ఇంటి అడ్రస్ ఇవ్వడం.. ఇవన్నీ అతికి పరాకాష్టగా మారాయి. అందుకే, లైఫ్‌లో ఎప్పుడూ లేని విధంగా మారుతి ట్రోల్స్ బారిన పడ్డారు.

‘ది రాజా సాబ్’ తర్వాత అసలు మారుతి సినిమాలు చేస్తాడా? అనేలా పరిస్థితి మారిందంటే, ఫ్యాన్స్ ట్రోలింగ్ ఏ స్థాయిలో నడిచిందో అర్థం చేసుకోవచ్చు. అందులోనూ ఆయన ‘రాజా సాబ్’ విడుదలకు ముందు, హాజరైన కొన్ని చిత్రాల ఈవెంట్స్‌లో దర్శకులకు క్లాస్ ఇవ్వడం కూడా, ఆయన గోతిని ఆయనే తవ్వుకున్నట్లయింది. ఏది ఏమైతేనేం.. ప్రభాస్ ఫ్యాన్స్‌ దృష్టిలో మాత్రం మారుతి చాలా డౌన్ అయ్యాడనే చెప్పుకోవాలి. ‘స్టార్ హీరోలతో నీకెందుకు.. స్మాల్, మిడ్ రేంజ్ హీరోలతో చేసుకోక’ అనే స్థాయికి ఫ్యాన్స్‌ని తీసుకొచ్చేశాడు మారుతి. అయితే ఈ గాయం నుంచి మారుతి త్వరగానే కోలుకున్నాడు. అదెలా అనుకుంటున్నారా? శ్రీరామనవమి (Sri Rama Navami) పర్వదినాన్ని పురస్కరించుకుని, తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్డేట్‌ని మారుతి.. ‘ఎక్స్’ వేదికగా తెలియజేశారు. అందులో..

మారుతి నెక్స్ట్ ప్రాజెక్ట్ అప్‌డేట్

‘‘ప్రతి ప్రయాణం ఒక అభ్యాసమే. ఈ పవిత్రమైన శ్రీరామనవమి పర్వదినాన, ఆ దేవుడి ఆశీస్సులతో నా తదుపరి కథ తుది మెరుగులు దిద్దుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తూ, మీ విలువైన అభిప్రాయాలను పంచుకుంటున్న ప్రేక్షకులందరికీ, శ్రేయోభిలాషులకు, మీడియా మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి పట్ల నాకు ఎంతో గౌరవం ఉంది. మీ మెప్పును, అభిమానాన్ని పొందేందుకు నా వంతు శాయశక్తులా కృషి చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు’’ అని పండుగ స్పెషల్‌గా పూజా చేస్తున్నట్లుగా ఉన్న ఫొటోను ఆయన షేర్ చేశారు. ఈ పోస్ట్‌కు ‘‘రాములోరికి ‘మారుతి’ కంటే ఆప్తుడు ఎవరు అన్నా’’ అంటూ కొందరు పాజిటివ్‌గా స్పందిస్తుంటే, మరికొందరు మాత్రం దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. చూద్దాం.. మరి మారుతి కమ్ బ్యాక్ ఎలా ఉంటుందో?

Every journey is a learning experience. On this auspicious occasion of #SriRamaNavami , I’m grateful to be giving final touches to my next script with His blessings 🙏

ప్రతి ప్రయాణం ఒక అభ్యాసమేనన్న మారుతి

A heartfelt thank you to all my audience, well-wishers and the media for constantly supporting me and sharing… pic.twitter.com/TXGf0rpGSk

— Director Maruthi (@DirectorMaruthi) March 27, 2026

మొత్తానికి మారుతి తన తదుపరి సినిమాతో ఎలా రాణిస్తారో చూడాలి. ‘ది రాజా సాబ్’ ఫలితం ఆయనపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సిందే.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.