
ప్రభాస్‌తో ‘రాధేశ్యామ్’ సినిమా తీసిన దర్శకుడు రాధాకృష్ణ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి రమణి (60) ఇటీవల కన్నుమూశారు. ఈ విషయాన్ని రాధాకృష్ణ సోషల్ మీడియాలో ఎమోషనల్‌గా వెల్లడించారు. “నీతో జీవితమే ఓ సెలబ్రేషన్ అమ్మ” అంటూ ఆయన పంచుకున్న పోస్ట్ పలువురిని కలచివేస్తోంది.
Key Points
దర్శకుడు రాధాకృష్ణ తల్లి రమణి (60) కన్నుమూశారు.
సోషల్ మీడియాలో 'నీతో జీవితమే ఓ సెలబ్రేషన్ అమ్మ' అంటూ భావోద్వేగ పోస్ట్ పెట్టారు.
రాధాకృష్ణ 'జిల్', ప్రభాస్‌తో 'రాధేశ్యామ్' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.
ఆయన తదుపరి ప్రాజెక్ట్‌పై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు.
రాధాకృష్ణ ఇంట్లో విషాదం
ప్రభాస్‌తో ‘రాధేశ్యామ్’ సినిమా తీసిన దర్శకుడు రాధాకృష్ణ ఇంట్లో విషాదం నెలకొంది. ఇతడి తల్లి రమణి (60) కన్నుమూశారు. ఈనెల 15వ తేదీనే చనిపోయారు. కానీ రాధాకృష్ణ తన సోషల్ మీడియాలో ఇప్పుడు వెల్లడించాడు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
తల్లికి భావోద్వేగ లేఖ
‘ప్రపంచంలో నాకంటూ ఓ స్థానం ఇచ్చావ్. నా మనసులో శూన్యత మిగిల్చి వెళ్లిపోయావ్. నీతో ఇన్నాళ్లు బతికిన జీవితమే ఓ సెలబ్రేషన్ అమ్మ. నేను నిన్ను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటా మై ఫస్ట్ లవ్’ అని దర్శకుడు రాధాకృష్ణ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు.
రాధాకృష్ణ విషయానికొస్తే దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దగ్గర సహాయకుడిగా కొన్నాళ్ల పాటు పనిచేశాడు. ఈ క్రమంలోనే అనుకోకుండా ఒకరోజు, ప్రయాణం, సాహసం, ఒక్కడున్నాడు తదితర సినిమాలకు పనిచేశాడు. ఇక గోపీచంద్ హీరోగా చేసిన ‘జిల్’ మూవీతో డైరెక్టర్ అయ్యాడు. రెండో చిత్రానికే ఏకంగా ప్రభాస్‌తో మూవీ చేసే అవకాశం దక్కించుకున్నాడు. అదే ‘రాధేశ్యామ్’. 2022లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైంది. దీని తర్వాత పలువురు హీరోలతో రాధాకృష్ణ పనిచేస్తాడనే టాక్ వినిపించింది. కానీ ఇప్పటివరకు కొత్త ప్రాజెక్ట్ ఏం ఫైనల్ కాలేదు.
రాధాకృష్ణ కెరీర్ విశేషాలు
రాధాకృష్ణ తల్లి మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఈ విషాద సమయంలో ఆయనకు ధైర్యం చేకూరాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. త్వరలోనే ఆయన కొత్త ప్రాజెక్ట్‌తో ముందుకు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.


