|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

డైరెక్షన్ నా ఇష్టం! వేలు పెడితే అంతే సంగతులు: డైరెక్టర్ వశిష్ట వార్నింగ్!🔥

Published: 13-04-2026, 7:45 AM
డైరెక్షన్ నా ఇష్టం! వేలు పెడితే అంతే సంగతులు: డైరెక్టర్ వశిష్ట వార్నింగ్!🔥
  • వశిష్ట దర్శకత్వంలో ఎవరైనా వేలు పెడితే అస్సలు నచ్చదు: షాకింగ్ కామెంట్స్!
  • చిరంజీవితో ‘విశ్వంభర’ సినిమాను తెరకెక్కిస్తున్న వశిష్ట.. భారీ అంచనాలు!
  • ‘బింబిసార’తో డైరెక్టర్‌గా టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన వశిష్ట.
  • పేపర్‌పై ఏం రాశానో అదే స్క్రీన్‌పై చూపించాలి: వశిష్ట ఫైర్!

యంగ్ డైరెక్టర్ వశిష్ట సంచలన కామెంట్స్ చేశారు. బింబిసార వంటి బ్లాక్ బస్టర్ తర్వాత, మెగాస్టార్ చిరంజీవితో ‘విశ్వంభర’ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

డైరెక్షన్‌పై వశిష్ట సంచలన వ్యాఖ్యలు!

‘బింబిసార’ చిత్రంతో డైరెక్టర్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన యంగ్ డైరెక్టర్ వశిష్ట.. మొదటి చిత్రంతోనే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాడు. ప్రముఖ నిర్మాత మల్లిడి సత్యనారాయణ రెడ్డి కుమారుడిగా మొదట నటుడిగా ఎంట్రీ ఇచ్చిన వశిష్ట.. నటుడుగా విఫలమైనప్పటికీ దర్శకుడిగా మాత్రం తన మార్క్‌ను నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో భారీ సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా సంబంధించిన షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతుండగా.. ఈ ప్రాజెక్టుపై ప్రేక్షకుల్లో భారీ అంచనాల నెలకొన్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా డైరెక్షన్‌పై వశిష్ట చేసిన కామెంట్స్ ప్రజెంట్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

‘నేను డైరెక్షన్ చేసేటప్పుడు ఎవరో వచ్చి నా పనిలో వేలు పెడితే నాకు కోపం వస్తుంది.. నా పని నేను చెయ్యాలి అతను పని అతను చెయ్యాలి.. పేపర్‌పై నేను ఏం రాశానో అదే స్క్రీన్‌పై చూపించాలి.. మధ్యలో వంద మంది వచ్చి వంద మార్పులు చెప్తే అది కిచిడి అయిపోతుంది.. దేవుడు అనుగ్రహంతో బింబిసార, విశ్వంభర లో నేను పేపర్‌పై ఏం రాశానో ఎగ్జాట్‌గా అదే తీశాను’ అని చెప్పుకొచ్చాడు. అయితే.. సాధారణంగా కొంతమంది హీరోలు డైరెక్టర్ రాసిన స్క్రిప్ట్‌కు కొన్ని కొన్ని మార్పులు చేస్తుంటారు. దీంతో దర్శకులు పైకి చెప్పలేక వాళ్లు అనుకన్నది తియ్యలేక ఇబ్బంది పడతారు. అలాంటిది ఇప్పుడు డైరెక్టర్ వశిష్ట ఇలాంటి కామెంట్స్ చెయ్యడంతో అవి వైరల్‌గా మారాయి.

చిరంజీవితో వశిష్ట ‘విశ్వంభర’ మూవీ!

‘బింబిసార’తో వశిష్ట టాలీవుడ్‌లో సెన్సేషన్!

వశిష్ట కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విశ్వంభర సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.