
డైరెక్టర్ వశిష్ట తన తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. రజినీకాంత్‌కు బాషా సినిమాకు సీక్వెల్ గా కథ చెప్పి ఒప్పించినా, ప్రస్తుతం విశ్వంభర సినిమాపై దృష్టి పెట్టారు. రజినీకాంత్ తో సినిమా ఎప్పుడు అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
Key Points
డైరెక్టర్ వశిష్ట రజినీకాంత్‌కు బాషా సీక్వెల్‌కు సంబంధించిన కథ చెప్పారు.
రజినీకాంత్ కథకు ఓకే చెప్పినా, తర్వాత వాయిదా వేశారు.
ప్రస్తుతం వశిష్ట చిరంజీవితో 'విశ్వంభర' సినిమా చేస్తున్నారు.
విశ్వంభర తర్వాత రజినీకాంత్ తో సినిమా ఉంటుందో లేదో చూడాలి.
రజినీకాంత్‌తో బాషా సీక్వెల్ ప్లాన్
Director Vassishta : డైరెక్టర్ వశిష్ట బింబిసార తర్వాత ఏకంగా మెగాస్టార్ తో ఛాన్స్ కొట్టేసి విశ్వంభర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. VFX కారణంగా విశ్వంభర సినిమా ఆలస్యం అవుతుంది. తాజాగా వశిష్ట ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా పలు ఆసక్తికర అంశాలు తెలిపాడు.
ఈ క్రమంలో వశిష్ట రజినీకాంత్ కి కూడా కథ చెప్పానని, ఆయన ఒప్పుకున్నారని తెలిపాడు.
కథ చెప్పి ఒప్పించిన వశిష్ట
డైరెక్టర్ వశిష్ట మాట్లాడుతూ.. దిల్ రాజు గారి ద్వారా బింబిసార అయ్యాక రజినీకాంత్ గారి దగ్గరికి వెళ్లి కథ చెప్పాను. ఆయన ఓకే అన్నారు. రజినీకాంత్ గారు బింబిసార సినిమా చూసి కాల్ చేసి అభినందించారు. నా స్టోరీలో కొన్ని ఛేంజెస్ చెప్పారు. అది బాషా కి సీక్వెల్ లాంటి సినిమా. కానీ నాకే సెకండ్ హాఫ్ కొంచెం సరిగ్గా లేదనిపించింది. రాజు గారికి అదే చెప్పాను. కథ పర్ఫెక్ట్ గా లేకుండా రజినీకాంత్ తో ముందుకు వెళ్ళకూడదు అన్నాను. తర్వాత రజినీకాంత్ గారిని కలిస్తే వరుసగా సినిమాలు ఉన్నాయి మనం తర్వాత చూద్దాం అన్నారు. దాంతో ఆ కథ అక్కడితో ఆగిపోయింది. తర్వాత నిర్మాత విక్కీ ద్వారా చిరంజీవి గారి దగ్గరకు వెళ్లి విశ్వంభర కథ చెప్పి ఓకే చేసుకున్నాను అని తెలిపాడు.
విశ్వంభర ప్రాజెక్ట్‌పై ఫోకస్
అయితే రజినీకాంత్ వాయిదా వేశాడు కానీ సినిమా వద్దనలేదు, వశిష్ట కూడా కథలో కొంత ఛేంజెస్ చేద్దాం అనుకున్నాడు కాబట్టి విశ్వంభర తర్వాత రజినీకాంత్ తో సినిమా ఉంటుందేమో చూడాలి.
చివరగా, రజినీకాంత్ తో సినిమా వాయిదా పడినప్పటికీ, భవిష్యత్తులో అవకాశం ఉందని వశిష్ట ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి విశ్వంభర సినిమాపై దృష్టి పెట్టారు.


