
📌 Key Points
- దివి వస్త్రధారణపై స్పందిస్తూ అమ్మాయిల దుస్తులపై కామెంట్లు చేయొద్దని అన్నారు.
- ప్రతి అమ్మాయి తన సౌకర్యానికి తగ్గట్టు దుస్తులు ధరిస్తుందని దివి అభిప్రాయపడ్డారు.
- తాను బికినీ ఫోటోలు షేర్ చేస్తే తన తల్లిని చాలా మంది విమర్శించారని దివి తెలిపారు.
- ఎక్కడ ఎలాంటి దుస్తులు వేసుకోవాలో అమ్మాయిలకు తెలుసని దివి అన్నారు.
దివి వాద్య అమ్మాయిల వస్త్రధారణ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆమె మాట్లాడుతూ అమ్మాయిలు తమకు నచ్చిన దుస్తులు వేసుకోవచ్చని, వారి వస్త్రధారణపై ఎవరూ కామెంట్ చేయకూడదని అన్నారు. దీనిపై ఆమె తన వ్యక్తిగత అనుభవాలను కూడా పంచుకున్నారు.
అమ్మాయిల దుస్తులపై దివి తాజా వ్యాఖ్యలు
Divi Vadthya: దివివాద్య పరిచయం అవసరం లేని పేరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతూ ప్రస్తుతం పలు సినిమాలు సిరీస్ లలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈమె తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇక ఈ కార్యక్రమం తర్వాత దివి పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఈమె హని అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తున్న దివి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా అమ్మాయిల డ్రస్సుల గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇటీవల కాలంలో మహిళలు వేసుకునే వస్త్రధారణ గురించి ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దివి సైతం ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. అమ్మాయిల డ్రెస్సులు గురించి కామెంట్లు ఎవరు చేయొద్దని తెలియజేశారు. ప్రతి ఒక్క అమ్మాయి తనకు నచ్చిన విధంగా, తనకు సౌకర్యవంతంగా ఉన్న దుస్తులను మాత్రమే ధరిస్తుందని తెలిపారు. ఇటీవల ఆమె బికినీ ఫోటో షూట్ కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అందరూ వివిధ రకాలుగా స్పందించారని తెలిపారు.
వస్త్రధారణపై కామెంట్స్ ఆపాలని దివి సూచన
ఈ ఫోటోలు పై ఎంతో మంది మా అమ్మ దగ్గర ఏంటి మీ అమ్మాయి అలా డ్రెస్ వేసుకుంది అంటూ కూడా మాట్లాడారని, మా అమ్మ బాధ చూడలేక తాను ఆ ఫోటోలను డిలీట్ చేశానని దివి తెలిపారు. అయితే అమ్మాయిలకు బట్టలు ఎప్పుడు, ఎక్కడ, ఎలా వేసుకోవాలో తెలుసు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూకి నేను బికినీ వేసుకొని రాలేను కదా? అలాగే బీచ్ కు చీర కట్టుకొని వెళ్లలేను కదా? అంటూ ప్రశ్నించారు. ఓసారి తాను విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ అందరూ బికినీలోనే ఉన్నారని నేను మాత్రం షార్ట్ వేసుకోవడంతో అందరూ నన్ను వింతగా చూశారని దివి తెలిపారు.
చీర కట్టుకుంటే లైంగిక దాడులు జరగలేదా?
బికినీ ఫోటోలపై దివి వివరణ
ఇక పై అమ్మాయిలు ఎప్పుడు ఎక్కడికి ఎలాంటి దుస్తులు వేసుకొని వెళ్లాలో అలాంటివి వేసుకొని వెళ్ళి ఎంజాయ్ చేయండి . మహిళల వస్త్రధారణ గురించి మాత్రం కామెంట్లు మాత్రం చేయొద్దు అంటూ ఈ సందర్భంగా తెలిపారు. ఇకపోతే మన ఏజ్ ఉన్న అమ్మాయిలు కూడా బికినీ వేసుకున్న వారిని చూసి వింతగా మాట్లాడుతూ ఉంటారని ఈ సందర్భంగా దివి చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారడంతో పలువురు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా సినిమా ఇండస్ట్రీలో మహిళల వస్త్రధారణ గురించి ఎన్నో రకాల కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. చీర కట్టుకుంటే అమ్మాయిలపై, మహిళలపై లైంగిక దాడులు జరగలేదా అంటూ మరికొందరు ఈ విషయంపై ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా బట్టలు అనేది వారి ఇష్టా ఇష్టాలకు అనుగుణంగా వేసుకుంటారు అంటూ మరికొందరు వారి అభిప్రాయాలను తెలుపుతున్నారు.
దివి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమ్మాయిల వస్త్రధారణపై ఎవరికీ కామెంట్ చేసే హక్కు లేదని ఆమె గట్టిగా చెప్పారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలను తెలియజేయండి.


