|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దువ్వాడ బయోపిక్‌లో మాధురి సంచలన ప్రకటన! ఆ పాత్రలో నేనే నటించాలి అంటున్న మాధురి!!

Published: 14-02-2026, 6:05 AM
దువ్వాడ బయోపిక్‌లో మాధురి సంచలన ప్రకటన! ఆ పాత్రలో నేనే నటించాలి అంటున్న మాధురి!!
  • దువ్వాడ శ్రీనివాస్ బయోపిక్‌లో నటించడానికి చాలా మంది తనను సంప్రదించారని మాధురి అన్నారు.
  • త్వరలో దువ్వాడ, మాధురి పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపారు.
  • మాధురికి విలన్ పాత్రలలో నటించాలని ఉంది.
  • బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మాధురి కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు.

దువ్వాడ శ్రీనివాస్ బయోపిక్‌లో నటించాలని ఉందని దివ్వెల మాధురి అన్నారు. చాలా మంది తనను సంప్రదించారని ఆమె తెలిపారు. అంతేకాకుండా తనకు విలన్ పాత్రలలో నటించాలని ఉందని తన మనసులోని కోరికను బయటపెట్టారు.

దువ్వాడ బయోపిక్‌పై మాధురి కామెంట్స్

Divvala Madhuri: దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు . రాజకీయ నాయకుడిగా దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas) అందరికీ ఎంతో సుపరిచితమే. అయితే ఈయన తన వ్యక్తిగత కారణాల వల్ల గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్నారు. ఈయన తన భార్యను దూరం పెట్టి దివ్వెల మాధురి(Divvala Madhuri)తో రిలేషన్ లో ఉన్న విషయం తెలిసిందే. ఇక వీరిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాం అంటూ తెలియజేశారు. ఇక ఇటీవల కాలంలో వీరిద్దరూ జంటగా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ జంట సినిమాల గురించి షాకింగ్ విషయాలను బయటపెట్టారు.

ఒక ఇంటర్వ్యూ సందర్భంగా శ్రీనివాస్ గారికి ఏమైనా లవ్ స్టోరీలు ఉన్నాయా అంటూ ప్రశ్నలు ఎదురైనప్పుడు మాధురి సమాధానం చెబుతూ.. శ్రీను గారి కాలేజీ డేస్ నుంచి అన్ని విషయాలను తాను తెలుసుకున్నాను ఆయనకి ఎక్కడ ఎలాంటి లవ్ స్టోరీలు లేవని తెలిపారు. ఇలా తన గురించి పూర్తిగా అన్ని విషయాలను తెలుసుకోవడంతో శ్రీనివాస్ గారి గురించి ఏదైనా బయోపిక్ సినిమా చేస్తారా ఏంటి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు మాధురి సమాధానం చెబుతూ నిజానికి శ్రీను గారి బయోపిక్(Duvvada Srinivas Biopic) సినిమా గురించి ఇప్పటికే చాలామంది మమ్మల్ని కలిశారని తెలియజేశారు.

సినిమాల్లో విలన్‌గా నటించాలన్న మాధురి

ప్రస్తుతం తాము కొత్త బిజినెస్ లను నిర్వహిస్తున్నాము ఈ బిజినెస్ పనులు అలాగే కొన్ని కోర్టు వ్యవహారాలు ఉన్నాయి వీటి కారణంగానే తాము ఈ బయోపిక్ సినిమాపై ఆసక్తి చూపలేదని కానీ ఖచ్చితంగా బయోపిక్ సినిమా చేస్తామంటూ మాధురి ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక మాధురి తన గురించి మాట్లాడుతూ తనకు కూడా యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. తను కనుక సినిమాలలో నటిస్తే ఖచ్చితంగా విలన్ పాత్రలలో నటించాలని కోరుకుంటున్నాను అంటూ తన మనసులో కోరికను కూడా బయటపెట్టారు.

బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ గా మాధురి..

బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ మాధురి

బయోపిక్ సినిమా గురించి మాట్లాడటంతో నిజంగానే ఈ సినిమా రాబోతోందా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఇటీవల మాధురి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈమె ఫైర్ స్ట్రోమ్ ద్వారా హౌస్ లోకి అడుగు పెట్టారు. ఇలా రెండు వారాలపాటు హౌస్ లో కొనసాగిన మాధురి ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా బిగ్ బాస్ ద్వారా కూడా మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈమె సినిమాలలో అవకాశమొస్తే విలన్ గా నటిస్తానంటూ చెప్పటం విశేషం. మరి మాధురికి సినిమాలలో విలన్ గా ఎవరైనా అవకాశం కల్పిస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం ఈమె హైదరాబాదులో వకుల సిల్క్స్ అంటూ చీరల బిజినెస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇలా పలు వ్యాపారాలను చూసుకుంటూ మాధురి ఎంతో బిజీగా ఉన్నారు.

మాధురి తన మనసులోని కోరికను బయటపెట్టడంతో ఈ బయోపిక్ సినిమా వస్తుందా రాదా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఆమె విలన్ పాత్రలో మెప్పిస్తుందో లేదో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.