
📌 Key Points
- దివ్వెల మాధురి పుట్టినరోజు సందర్భంగా దువ్వాడ శ్రీను ఆమెకు గ్రాండ్ సర్ప్రైజ్ ప్లాన్ చేశారు.
- మీడియా కాల్స్ హడావిడిలో విష్ చేయడం మర్చిపోవడంతో మాధురి అలిగినట్టు తెలుస్తోంది.
- దువ్వాడ శ్రీను లైవ్‌లో మాధురికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి, ఆమె అలకను పోగొట్టారు.
- మాధురికి ఖరీదైన ఫార్చునర్ కారును బహుమతిగా ఇవ్వనున్నట్లు శ్రీను ప్రకటించారు.
దివ్వెల మాధురి పుట్టినరోజున దువ్వాడ శ్రీను విష్ చేయడం మర్చిపోవడంతో ఆమె అలిగింది. మీడియా కాల్స్ హడావిడిలో ఈ విషయం మర్చిపోయినట్లు శ్రీను తెలిపారు. అనంతరం లైవ్‌లో మాధురికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి, ఓ ఖరీదైన కారును బహుమతిగా ప్రకటించారు.
మాధురి పుట్టినరోజు: వార్తలు, వివాదాలు ఖండన
Divvela Madhuri : దువ్వాడ శ్రీనివాస్ మాధురి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇకపోతే నేడు దివ్వెల మాధురి పుట్టినరోజు కావడంతో వీరిద్దరూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. మాధురి పుట్టినరోజు సందర్భంగా దువ్వాడ శ్రీనివాస్ రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్ పరిధిలోని ఓ ఫామ్ హౌస్‌లో అనుమతి లేకుండా పార్టీ నిర్వహించారని ఈ పార్టీలో పెద్ద ఎత్తున విదేశీ మద్యం లభించింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ జంట మరోసారి వార్తల్లో నిలిచారు. ఇలా తమ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలు పూర్తిగా ఆవాస్తవమని ఖండించారు.
నేడు మాధురి పుట్టినరోజు కావడంతో తన పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి సంఘటన జరగడంతో ఈ విషయంపై వివరణ ఇచ్చారు. అదేవిధంగా మాధురి పుట్టినరోజు సందర్భంగా దువ్వాడ శ్రీనివాస్ బిగ్ సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేశారని సాయంత్రం చాలా ఘనంగా పార్టీ ఉండబోతుందని తెలుస్తోంది. ఇలా మాధురి కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేసినప్పటికీ మాధురి పుట్టినరోజు నాడు అలిగారని తెలుస్తోంది. అయితే ఆమె అలకకు కారణాలను కూడా ఈ సందర్భంగా తెలిపారు. మాధురి పుట్టినరోజు సందర్భంగా శ్రీనివాస్ సాయంత్రం గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేశారు .అదేవిధంగా ఆమె కోసం ఫార్చునర్ కారును కూడా గిఫ్ట్ గా ఇవ్వబోతున్నానని తెలియజేశారు.
అలకకు కారణం, శ్రీను ప్లాన్ చేసిన సర్ప్రైజ్‌లు
ఇలా తనకు ఖరీదైన వస్తువులను కానుకగా ఇచ్చినప్పటికీ సరైన సమయంలో తనకు విష్ చేయకపోవడంతో మాధురి అలిగినట్టు తెలుస్తుంది. ఉదయం నుంచి తనకు విష్ చేస్తారని ఎదురు చూసిన శ్రీనివాస్ మాత్రం విష్ చేయలేదట అందుకే మాధురి అలిగినట్టు తెలుస్తుంది. ఈ విషయం గురించి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉదయం లేచినప్పటి నుంచి మీడియాలో మా గురించి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఒకటే ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఈ హడావిడిలో పడి తనకు విష్ చేయడం మర్చిపోయాను అంటూ శ్రీనివాస్ తెలిపారు. ఇక లైవ్ లోనే మాధురికి శ్రీనివాస్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇలా ప్రతి పుట్టినరోజు సందర్భంగా మాధురి కోసం దువ్వాడ శ్రీనివాస్ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తూ ఉంటారు. ఈసారి తనకు ఏకంగా ఖరీదైన కారుని గిఫ్టుగా ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఇక నేడు సాయంత్రం అత్యంత సన్నిహితులు సమక్షంలో మాధురి పుట్టినరోజు వేడుకలు జరుపబోతున్నట్లు వెల్లడించారు. ఇక నేడు మాధురి పుట్టినరోజు కావడంతో ఈమెకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇకపోతే మాధురి ఇటీవల బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొని మరింత ఆదరణ సొంతం చేసుకున్నారు.వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన మాధురి కేవలం రెండు వారాలు పాటు మాత్రమే హౌస్ లో కొనసాగి అనంతరం ఎలిమినేట్ అయ్యారు.
లైవ్‌లో శుభాకాంక్షలు, కారు బహుమతి ప్రకటన
పుట్టినరోజున మాధురి అలక, శ్రీను సర్ప్రైజ్‌లతో ఈ జంట మరోసారి వార్తల్లో నిలిచారు. సాయంత్రం జరగనున్న గ్రాండ్ పార్టీ, కారు బహుమతితో మాధురి పుట్టినరోజు వేడుకలు ఘనంగా ముగియనున్నాయి.

