|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అవసరం కొద్దీ మనుషులకు దగ్గర అవుతుంది, తనూజ అంటే నాకు చిరాకు.. భరణికి దివ్య క్లాస్

Published: 29-11-2025, 10:06 PM
అవసరం కొద్దీ మనుషులకు దగ్గర అవుతుంది, తనూజ అంటే నాకు చిరాకు.. భరణికి దివ్య క్లాస్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఫ్యామిలీ వీక్ సందర్భంగా అనూహ్య సంఘటనలు చోటు చేసుకున్నాయి. భరణి, తనూజ మధ్య సాన్నిహిత్యంపై దివ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తనూజ అవసరం కొద్దీ మనుషులకు దగ్గరవుతుందని, ఆమె అంటే తనకు చిరాకు అని దివ్య కుండబద్దలు కొట్టింది. ఈ ఘటన ఇంటి సభ్యులందరినీ ఆశ్చర్యపరిచింది.

Key Points

1

బిగ్ బాస్ 9 ఫ్యామిలీ వీక్‌లో కళ్యాణ్ తల్లి, రీతూ తల్లి, భరణి కూతురు సందడి చేశారు.

2

తనూజ కాలుకి మసాజ్ చేయడంతో భరణిపై దివ్య ఆగ్రహం వ్యక్తం చేసింది.

4

తండ్రిని కమాండ్ చేయొద్దని దివ్యకు, సాఫ్ట్‌గా ఉండొద్దని భరణికి హారతి సూచించింది.

దివ్య – తనూజ మధ్య మాటల యుద్ధం

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ నడుస్తోంది. వరుసగా కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. 74వ రోజు మరికొందరు కుటుంబ సభ్యులు హౌస్ లో సందడి చేశారు. ముందుగా కళ్యాణ్ తల్లి లక్ష్మి వచ్చారు. కొడుకుతో సరదాగా కాసేపు ఆమె మాట్లాడారు. ఆ తర్వాత ఇంటి సభ్యులతో కూడా ముచ్చటించారు.  తనూజ ఆమెకి చీరని గిఫ్ట్ గా ఇచ్చారు. తన తల్లి హౌస్ ని వీడి వెళ్లిన తర్వాత కళ్యాణ్ తనూజని ప్రశ్నించాడు. మా అమ్మకి చీర ఎందుకు ఇచ్చావు అని అడిగాడు.

తనూజ సమాధానం ఇస్తూ ఒక ఫ్యామిలీ మెంబర్ లా భావించి ఇచ్చినట్లు తనూజ పేర్కొంది. అందులో మరో ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చింది. ఆ తర్వాత భరణి, తనూజ, దివ్య మధ్య పెద్ద హైడ్రామా సాగింది. భరణి.. తనూజ లెగ్ కి మసాజ్ చేశాడు. అది చూసి దివ్య భరించలేకపోయింది. మీరు ఎందుకు తనూజ కాలుకి మసాజ్ చేశారు అని దివ్య భరణిపై ఫైర్ అయింది. తనూజ నీకు నచ్చడం లేదా అని భరణి అడిగారు. తనూజ కూడా దివ్య అలా బిహేవ్ చేస్తోంది ఏంటి ? అని ఆశ్చర్యపోయింది.

భరణికి దివ్య క్లాస్: అసలు కారణం ఇదే

ఆ తర్వాత దివ్య భరణితో మాట్లాడుతూ.. మీకు బుర్రలేదు. మీ గురించి మీరు ఆలోచించుకోరా అని ప్రశ్నించింది. తనూజ తన కన్వీనియన్స్ ప్రకారం, అవసరం కొద్దీ మనుషులకు దగ్గర అవుతుంది. అలాంటి వాళ్ళంటే నాకు చిరాకు అని దివ్య సమాధానం ఇచ్చింది. ఇంతలో రీతూ తల్లి కూడా హౌస్ లోకి వచ్చారు. ఇంటి సభ్యులని పలకరించిన ఆమె.. ఇక నాలుగు వారాలే ఉంది.. గట్టిగా ఆడాలి అని కూతుర్ని మోటివేట్ చేసింది.

ఆ తర్వాత అందరినీ సర్ప్రైజ్ చేస్తూ భరణి చిన్న కూతురు హారతి హౌస్ లోకి వచ్చారు. స్టోర్ రూమ్ ద్వారా ఆమె హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. రాగానే తండ్రిని గట్టిగా కౌగలించుకుని ఎమోషనల్ అయింది. హౌస్ లో అందరినీ పరిచయం చేసుకుంది.

భరణి కూతురు హారతి సూచనలు

తనూజ గురించి ప్రత్యేకంగా చెప్పింది. హౌస్ లో నాన్నతో మీ బాండింగ్ మాకు ఫేవరిట్ అని పేర్కొంది. దివ్యని మాత్రం ప్రత్యేకంగా పిలిచి ఒక మాట చెప్పింది. మీరు నాన్నకి హెల్త్ బాగా లేనప్పుడు బాగా చూసుకున్నారు. మీరంటే మాకు ఇష్టం. కానీ నాన్నతో అలా కమాండింగ్ గా బిహేవ్ చేయొద్దు ప్లీజ్ అని రిక్వస్ట్ చేసింది. ఇకపై అలా బిహేవ్ చేయను అని దివ్య భరణి కూతురుకి మాట ఇచ్చింది. హారతి హౌస్ నుంచి వెళుతూ.. నిన్ను కమాండ్ చేసే వాళ్ళ పట్ల సాఫ్ట్ గా ఉండొద్దని ఫైర్ చూపించండి అని తండ్రితో చెప్పింది.

బిగ్ బాస్ ఇంట్లో దివ్య, తనూజ, భరణి మధ్య నెలకొన్న ఈ హైడ్రామా ఫ్యామిలీ వీక్‌కి మరింత రక్తి కట్టించింది. భరణి కూతురు హారతి రాకతో ఈ వివాదం మరింత ఆసక్తికరంగా మారింది. రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.