
📌 Key Points
- చందు మొండేటి దర్శకత్వంలో ‘వాయుపుత్ర’ అనే యానిమేషన్ సినిమా ప్రారంభం కానుంది.
- నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా కోసం కేవలం 15-20 కోట్లు మాత్రమే ఆఫర్ చేసిందట.
- బడ్జెట్ సమస్యల కారణంగా సినిమా ఆగిపోయే అవకాశం ఉందని టాక్.
- నాగవంశీ ఈ ప్రాజెక్టును హోల్డ్‌లో పెట్టడంపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.
నాగవంశీ నిర్మాతగా చందూ మొండేటి దర్శకత్వంలో ‘వాయుపుత్ర’ అనే యానిమేషన్ సినిమా ప్రారంభం కానుంది. అయితే, బడ్జెట్ సమస్యల కారణంగా ఈ సినిమా ఆగిపోయే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్ తక్కువ ఆఫర్ ఇవ్వడంతో నాగవంశీ వెనకడుగు వేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నెట్‌ఫ్లిక్స్ షాక్: బడ్జెట్ ఎంతంటే?
Vayuputra Movie: మహావతార్ నరసింహ..ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ ముహూర్తాన 300 కోట్లు కొల్లగొట్టిందో కాని అప్పటి నుండి యానిమేషన్ సినిమాలపై మేకర్స్ మనసు పారేసుకోవడం మొదలెట్టారు. అలానే నాగ వంశీ నిర్మాతగా ‘కార్తికేయ 2’వంటి పాన్ ఇండియా హిట్ అందుకున్న చందూ మొండేటి ‘ వాయుపుత్ర’అనే యానిమేషన్ సినిమాకి శ్రీకారం చుట్టాడు.అయితే ఈ సినిమా ఇపుడు బడ్జెట్ కష్టాల్లో చిక్కుకొని ఆగిపోతుందన్న టాక్ వినిపిస్తుంది.
షాక్ ఇచ్చిన నెట్ ఫ్లిక్స్
మొదటగా సినిమాని 50 కోట్ల బడ్జెట్ తో ప్లాన్ చేశాడట చందు మొండేటి.ఇక మహావతార్ వంటి యానిమేషన్ సినిమా కాసులు కురిపించడం,‘కార్తికేయ 2’ తీసిన డైరెక్టర్ తో సినిమా తీయడం వెరసి నెట్‌ఫ్లిక్స్ దగ్గరికి వెళ్తే, అక్కడ సీన్ రివర్స్ అయిందట.అవును…మినిమం 50 కోట్లయినా ఆఫర్ చేయకపోతుందా అని ఆశ పడ్డ నాగవంశీకి కేవలం 15 నుంచి 20 కోట్లు మాత్రమే ఆఫర్ చేసి పెద్ద షాకే ఇచ్చిందట నెట్ ఫ్లిక్స్.ఇక మైండ్ బ్లాక్ అయిన ఈ క్రేజీ ప్రొడ్యూసర్ ఇపుడు సినిమానే ఆపేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాడని టాక్ వినిపిస్తుంది.దీంతో “వందల కోట్లు పెట్టి సినిమాలు తీస్తాం” అని స్టేట్‌మెంట్స్ ఇచ్చే నాగవంశీ, కేవలం 30 కోట్ల రిస్క్ చేయలేక ఈ ప్రాజెక్టును ‘హోల్డ్’లో పెట్టడం ఏంటని సోషల్ మీడియాలో చెడుగుడు ఆడేస్తున్నారట నెటిజనులు.
చందూ మొండేటికి అవమానమా?
చందూ మొండేటిని అవమానించడమే
ఇక ప్రస్తుతం థియేట్రికల్ వసూళ్లపై ఆధారపడటం అంటే ఒకరకంగా అది గ్యాంబ్లింగ్ అనే చెప్పాలి.కానీ ఒక గొప్ప కథను, విజువల్ వండర్‌ను ప్రేక్షకులకు అందిస్తామని చెప్పి, ఇప్పుడు కేవలం పెట్టిన డబ్బు రాదు అనే సాకుతో సినిమాని ఆపేయడం అంటే చందూ మొండేటిని అవమానించడమే అని టాక్ వినిపిస్తోంది.మొత్తానికి చందూ మొండేటి ఎంతో ఆశగా పెట్టుకున్న ఈ ‘డ్రీమ్ ప్రాజెక్ట్’ ఇప్పుడు బడ్జెట్ రిస్టిక్షన్స్ తో కనుమరుగయ్యేలానే ఉందన్న మాట.
నోరు విప్పకపోవడం కాస్త ఆశ్చర్యమే
అయితే సినిమా ఆగిపోయిందన్న న్యూస్ సర్క్యులేట్ అవుతున్నా అటు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ గానీ, ఇటు దర్శకుడు గానీ నోరు విప్పకపోవడం కాస్త ఆశ్చర్యమే.ఒకవేళ వచ్చే సినిమాలు హిట్ అయితే, అప్పుడు మార్కెట్ ని బట్టి ఆలోచిద్దామని నాగవంశీ వాయిదా వేస్తున్నాడా లేక ఈ లోపు చందు ని మరో చిన్న సినిమా చేయమని ప్రెజర్ చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. మరో వైపు యానిమేషన్ రామాయణ అంటూ చేయాల్సిన సినిమాని పక్కన పెట్టి మరీ తిరిగేస్తున్నాడు అనిల్ రావి పూడి.మరి ఈ సినిమా అయినా సవ్యంగా టేకాఫ్ అవుతుందా లేక ఇలాగే ఏదైనా షాక్ న్యూస్ చెబుతుందా చూడాలి.
సినిమా ఆగిపోవడానికి కారణమేంటి?
చిన్న బడ్జెట్ లో తీసేసి భారీగా కలెక్షన్స్
ఇక వీటికి బూస్టప్ ఇచ్చిన మహావతార్ నరసింహ విషయానికే వస్తే అశ్విన్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బడ్జెట్ కేవలం 6కోట్లలోపే అవడం ఈ సినిమాకి పెద్ద అడ్వాంటేజ్ అయింది. అంటే నాగ వంశీ కూడా ఇలాగే చిన్న బడ్జెట్ లో తీసేసి భారీగా కలెక్షన్స్ వస్తే బాగుండని ఆశ పడుతున్నాడన్న మాట.అనుకోవడం వరకు బాగానే ఉంది కాని అన్ని సినిమాలు మహావతార్ నరసింహలు అవ్వవు కదా !
మొత్తానికి చందూ మొండేటి ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఈ సినిమా బడ్జెట్ సమస్యలతో ఆగిపోయేలా కనిపిస్తోంది. దీనిపై సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇంకా స్పందించలేదు.


