|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Duvvada Srinivas: బిగ్ బాస్ విన్న‌ర్ మాధురే…ప‌క్కా రాసిపెట్టుకోండి !

Published: 14-10-2025, 9:21 AM
Duvvada Srinivas: బిగ్ బాస్ విన్న‌ర్ మాధురే...ప‌క్కా రాసిపెట్టుకోండి !

దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ సీజన్ 9 విజేత మాధురే అని, ఇందులో ఎలాంటి సందేహం లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మాధురి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో షోకు ప్రేక్షకుల ఆదరణ పెరిగిందని, గెలిస్తే వచ్చే ప్రైజ్ మనీని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామని శ్రీనివాస్ తెలిపారు.

Key Points

1

దివ్వెల మాధురి బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా మారుతుందని దువ్వాడ శ్రీనివాస్ ప్రకటన.

2

ఇతర కంటెస్టెంట్లు మాధురి ముందు జూజుబీ అంటూ దువ్వాడ శ్రీనివాస్ వ్యాఖ్య.

4

గెలిస్తే వచ్చే ప్రైజ్ మనీని వికలాంగులు, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ఉపయోగిస్తామని హామీ.

బిగ్ బాస్ విజేత మాధురే: దువ్వాడ శ్రీనివాస్ ధీమా

దిశ‌, వెబ్ డెస్క్ : దివ్వెల మాధురి కచ్చితంగా బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా మారుతుందని దువ్వాడ శ్రీనివాస్ సంచలన ప్రకటన చేశారు. ఇందులో ఏమాత్రం డౌట్ లేదన్నారు. మాధురి ముందు మిగ‌తా బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌ జూజుబీ అంటూ వ్యాఖ్యానించారు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 లోకి దివ్వెల మాధురి ఇటీవల కాలంలోనే ఎంట్రీ ఇచ్చారు. వైల్డ్ కార్డు ద్వారా ఆమె హౌజ్‌ లోపలికి వెళ్లారు.

వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మాధురి క్రేజ్

ఇక మొన్నటి వరకు బిగ్ బాస్ సీజన్ 9ను పట్టించుకోని జనాలు, దివ్వెల మాధురి రాగానే ఈ సీజన్ తెగ చూస్తున్నారట. తండ్రి వయసులో ఉన్న దువ్వాడ శ్రీనివాస్ తో దివ్వెల మాధురి కలిసి ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ జంట బాగా పాపులర్ అయింది. అలాంటప్పుడు బిగ్ బాస్ లోకి దివ్వెల మాధురి వస్తే జనాలు చూడక ఉంటారా? కచ్చితంగా ఎగబడి చూస్తారు.

బిగ్ బాస్ ప్రైజ్ మనీతో సేవా కార్యక్రమాలు

అయితే దివ్వెల మాధురి బిగ్ బాస్ లోకి వెళ్లడంపై దువ్వాడ శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన మాధురి కచ్చితంగా ఇందులో విజేతగా మారుతుందని ఆయన వెల్లడించారు. ఇక బిగ్ బాస్ గెలిస్తే వచ్చిన ప్రైజ్ మనీని వికలాంగులు, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ఉపయోగిస్తామని హామీ ఇచ్చారు. ఆ డబ్బులో ఒక్క రూపాయి కూడా మేము వాడుకోబోమని తెలిపారు.

దువ్వాడ శ్రీనివాస్ మాధురిపై ఉంచిన విశ్వాసం, ఆమె గెలిస్తే ప్రైజ్ మనీని సేవా కార్యక్రమాలకు అంకితం చేస్తామనడం ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించింది. ఈ ప్రకటన మాధురిని బిగ్ బాస్ టైటిల్‌కు బలమైన పోటీదారుగా నిలబెట్టింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.