
వైద్య సేవల్లో ఏఐ (కృత్రిమ మేధస్సు) వినియోగాన్ని కూటమి ప్రభుత్వం క్రమంగా పెంచేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే మదుమేహంతో కంటి చూపు సమస్యలు (రెటినోపతి) కలిగిన వారికి తగిన సమయంలో చికిత్స అందించడంలో ఏఐ వినియోగాన్ని ప్రయోగాత్మకంగా గుంటూరు, కర్నూలు, విశాఖలోని ప్రభుత్వాసుపత్రుల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఫండస్ కెమెరాల ద్వారా తీసే ఇమేజ్ ను పరిశీలించి, రెటినోపతి సమస్య ఎంత తీవ్రంగా ఉంది? వైద్యులను సంప్రదించాలా? వద్దా? అన్న దానిపై ఏఐ స్పష్టత ఇస్తుంది.
ప్రస్తుతం వైద్యులు అందుబాటులో ఉన్నచోట మాత్రమే ఫండస్ కెమెరాలు ఉన్నాయి. ఏఐ సేవల రాకతో ఫండస్ కెమెరాలు, అష్టోమెట్రిస్ట్ (టెక్నిషియన్)లను అందుబాటులోనికి తీసుకువస్తే సరిపోతుంది. రెటినోపతి సమస్యలు గుర్తించడంలో వైద్యుల కొరతను అధిగమించేందుకు ఏఐ సాయపడుతుంది. ఇప్పటికే నవజాత శిశువుల ఆరోగ్య ప్రమాణాల గుర్తింపునకు ప్రత్యేకంగా రూపొందించిన య పన్ను ఉపయోగించడంపై ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు ద్వారా పరీక్షలు చేస్తోంది. ఇటీవల మెడ్ టెక్ ఛాలెంజ్ ద్వారా 18 ఆసుపత్రుల్లో 18 అంకుర సంస్థలు వైద్య సేవలు అందించింది. ఇదే క్రమంలో కంటి వైద్యంలోనూ ఏఐ సేవలను వినియోగించేందుకు వీలుగా పైలట్ ప్రాజెక్టు కింద మూడు ఆసుపత్రుల్లో కంటి పరీక్షలు చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ వెల్లడించారు.
ప్రస్తుతం ఫండస్ కెమెరాలు ఉన్నచోట్ల మాత్రమే ఇమేజ్ ఆధారంగా రెటీనా కంటి వైద్యులు సదరు రోగుల కంటి చూపు పరిస్థితిని నిర్ధారించుకుని చికిత్స అందిస్తున్నారు. ఫండ్స్ కెమెరా లేకున్నా… డాక్టర్ లేకున్నా రెటినోపతి ట్రీట్మెంట్ జరగదు. అయితే కంటి వైద్యులు లేకున్నా ఇమేజ్ ఆధారంగా ఏఐ ఇచ్చే రిపోర్టు ఆధారంగా అప్టోమేట్రిస్ట్ (స్క్రీనింగ్ చేసే వారు) తదుపరి చికిత్స అవసరం ఏ స్థాయిలో అవసరమో గుర్తించి, రోగులను అప్రమత్తం చేయడానికి వీలు ఏర్పడుతుంది.
ఇప్పుడు ఈ అవకాశం లేనందున రెటినోపతి సమస్యలు ముదిరిన అనంతరం రోగులు వైద్యుల వద్దకు వెళ్లేసరికి, పరిస్థితులు చెయ్యి దాటిపోతున్నాయి. మదుమేహంతో ఉన్నవారిలో సగటున 20 శాతం మందిలో కంటి చూపు మందగించడం, నరం దెబ్బతినడం, రెటీనా పొర విడిపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
గుంటూరులోని బోధనాసుపత్రికి నెలకు 3వేల మంది వస్తుండగా 15 శాతం నుంచి 20 శాతం మంది రెటినోపతి సమస్యలతో ఉంటున్నారని గుర్తించారు. గుంటూరు జీజీహెచ్ మదుమేహ వ్యాధిగ్రస్తులను ఏఐ ద్వారా పరీక్షించడం ప్రారంభించారు. ఇదేవిధంగా కర్నూలులోని ప్రాంతీయ ఆసుపత్రిలో ఈ నెల 13న, విశాఖలోని ప్రాంతీయ కంటి ఆసుపత్రిలో ఈ నెల 16న రోగులను పరీక్షించనున్నారు.
కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీ ఎయిమ్స్, ఎయిమ్స్-రిషికేశ్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని అనుసరించి వాద్వాని (ఎన్జీఓ సంస్థ) ‘మధునేత్ర’ ఏఐ సొల్యూషన్ రూపొందించింది. ఈ రెండు సంస్థల్లో సుమారు 13వేల మంది రెటినోపతి సమస్యలు కలిగిన వారిని పరీక్షించారు. వీటి ఫలితాలు అనుసరించి ఎయిమ్స్-బీబీనగర్, ఎయిమ్స్ రాయ్‌పూర్ ప్రస్తుతం మదుమేహ వ్యాధిగ్రస్తులను పరీక్షిస్తున్నారు. వీటితోపాటు దేశంలోని రాజస్థాన్, అసోం, చత్తీస్‌ఘడ్, ఢిల్లీ, హర్యానా, మధ్యప్రదేశ్, మేఘాలయ, ఒడిశా, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, బీహార్, ఇతరచోట్ల కలిపి 45 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఏఐ ఆధారిత సేవలను ‘వాద్వాని’ అందిస్తోంది. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో 3 చోట్ల మదుమేహ రోగులకు రెటినోపతి సమస్యలను పరీక్షించాలని నిర్ణయించింది. మూడునెలలపాటు వీటిల్లో పరీక్షలు జరగనున్నాయి.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.
హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More


