
📌 Key Points
- దేశవ్యాప్తంగా LPG కొరత ఏర్పడింది, దీనివల్ల రెస్టారెంట్లు మూతపడుతున్నాయి.
- ముంబైలో 20% హోటల్స్ మూతపడ్డాయి, ఇతర నగరాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.
- LPG కొరత కారణంగా ఫుడ్ డెలివరీ బాయ్స్ ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది.
- కేంద్ర ప్రభుత్వం LPG ఉత్పత్తిని 10% పెంచాలని నిర్ణయించింది.
భారతదేశంలో LPG కొరత తీవ్రరూపం దాల్చింది. దీని కారణంగా అనేక రెస్టారెంట్లు మూతపడే పరిస్థితికి చేరుకున్నాయి. ముఖ్యంగా స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ సంస్థలపై ఆధారపడిన డెలివరీ బాయ్స్ ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది.
దేశంలో LPG కొరత
భారతదేశ వ్యాప్తంగా LPG కొరత స్పష్టంగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. మిడిల్ ఈస్ట్ లో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో LPG కొరత ఇండియాలో కనిపిస్తోంది. అయితే ఈ ఎల్పీజీ కొరత కారణంగా ఇండియాలోని చాలా రెస్టారెంట్లు ఇబ్బంది పడుతున్నాయి. ముంబైలోని దాదాపు 20 శాతం హోటల్స్, రెస్టారెంట్స్ ఇప్పటికే మూతపడ్డట్లు నివేదికలు చెబుతున్నాయి. బెంగళూరు, పూణే లాంటి నగరాలలో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నట్లు చెబుతున్నారు. ఇంకా హైదరాబాద్ దాకా ఆ పరిస్థితి రాలేదు కానీ, మరికొన్ని రోజుల్లోనే వచ్చే ప్రమాదం కూడా ఉంది.
రెస్టారెంట్లపై తీవ్ర ప్రభావం
ఇండియాలో LPG కొరత ఉన్న నేపథ్యంలో స్విగ్గీ, జొమాటోలో పనిచేసే ఫుడ్ డెలివరీ బాయ్స్ ఉపాధి కూడా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. హోటల్స్, రెస్టారెంట్స్ మూతపడితే ఆటోమేటిక్ గా స్విగ్గీ, జొమాటో ఆర్డర్లు కూడా తగ్గిపోతాయి. దాని ద్వారా ఉపాధి పొందుతున్న డెలివరీ బాయ్స్ కు షాక్ తగిలే ప్రమాదం ఉంది. వాళ్ళ ఆదాయం అమాంతం తగ్గే ఛాన్స్ ఉంటుంది. అటు స్విగ్గీతో పాటు జొమాటో కు కూడా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అయితే ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 10% ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని నిర్ణయం తీసుకుంది.
ఫుడ్ డెలివరీ బాయ్స్ భవితవ్యం ప్రశ్నార్థకం
A post shared by DNA India (@dna_india)
LPG కొరత కొనసాగితే ఫుడ్ డెలివరీ రంగం మరింత నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ఉత్పత్తిని పెంచే చర్యలు తీసుకుంటే కొంతవరకు ఉపశమనం లభిస్తుంది.


