|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

08.05.2025: ఈ రాశుల విద్యార్థులకు శుభవార్త! శ్రమకు తగ్గ ఫలితాలు, ఆరోగ్యం బాగుంటుంది. సూర్యారాధన మేలు చేస్తుంది!

Published: 07-05-2025, 10:48 PM
08.05.2025: ఈ రాశుల విద్యార్థులకు శుభవార్త! శ్రమకు తగ్గ ఫలితాలు, ఆరోగ్యం బాగుంటుంది. సూర్యారాధన మేలు చేస్తుంది!

08.05.2025 నాటి రాశిఫలాలు ఇక్కడ ఉన్నాయి. మేష, వృషభ, కర్కాటక, సింహ రాశుల విద్యార్థులకు శుభవార్త! శ్రమకు తగిన ఫలితాలు, ఆరోగ్యం బాగుంటుంది. సూర్యారాధన, ఇతర దేవతారాధనలతో మంచి ఫలితాలు పొందవచ్చు.

Key Points

1

మేష, వృషభ, కర్కాటక, సింహ రాశుల విద్యార్థులకు శుభవార్త!

2

విద్యార్థుల శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి.

4

వివిధ రాశులకు ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక అంశాలపై సూచనలు.

వివిధ రాశులకు దినఫలాలు

రాశిఫలాలు (దిన ఫలాలు) : 08.05.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: వైశాఖ, వారం : గురువారం, తిథి : శు. ఏకాదశి, నక్షత్రం : ఉత్తర

మేష రాశి వారు తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. కొన్ని ఖర్చులు ముందుకు వస్తాయి. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. బాధ్యతతో పనులు చేస్తారు. వ్యాపారులకు అదృష్టం కలసి వస్తుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి ఊరట లభిస్తుంది. స్నేహితుల వల్ల ఖర్చులు ఉంటాయి. ఆరోగ్యంగా ఉంటారు. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన మేలుచేస్తుంది.

వృషభ రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అధికారుల మన్ననలు అందుకుంటారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. అన్న దమ్ములతో సఖ్యత నెలకొంటుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. కోర్టు వ్యవహారాల్లో అనుకూల తీర్పులు వెలువడుతాయి. విద్యార్థులకు కలసివస్తుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. దత్తాత్రేయస్వామి స్తోత్రాలు పఠించండి.

విద్యార్థులకు, ఉద్యోగులకు సూచనలు

రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. అయితే కొత్త పనులు వాయిదా వేసుకోవడం మంచిది. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. ఆర్థికంగా హెచ్చుగ్గులు ఉంటాయి. సహోద్యోగులతో మాటపట్టింపులు ఉండవచ్చు. వాదోపవాదాలకు తావు ఇవ్వకండి. భూ లావాదేవీల్లో ఏమరుపాటు తగదు. కోర్టు వ్యవహారాల్లో ఊరట లభిస్తుంది. విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు. రామాలయాన్ని సందర్శించండి.

కర్కాటక రాశి వారు తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు తాత్కాలిక ఊరట లభిస్తుంది. కొత్త పరిచయాలతో జాగ్రత్త అవసరం. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. రుణ బాధలు కొంత వరకు తీరుతాయి. కొత్త ఒప్పందాల విషయంలో అత్యుత్సాహం పనికిరాదు. భాగస్వాములతో మాటపట్టింపులు తలెత్తుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వారాంతంలో ఒక శుభవార్త వింటారు. నిత్యం కాల భైరవాష్టకం పఠించండి.

సింహ రాశి వారు పెద్దల సలహాలు పాటించడం అవసరం. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. రోజువారీ కార్య కలాపాలు నిర్విఘ్నంగా సాగుతాయి. వ్యాపారులకు అదృష్టం కలసివస్తుంది. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. తీర్థ యాత్రలు చేపడతారు. పారిశ్రామికవేత్తలు న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితాలు పొందుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సూర్యారాధన మేలు చేస్తుంది.

కన్య రాశి ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. వ్యాపారులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో కదలిక వస్తుంది. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. భూ లావాదేవీల్లో ఏమరు పాటు తగదు. కోర్టు వ్యవహారాల్లో చికాకులు ఉంటాయి. రాబడిలో హెచ్చుతగ్గులు ఉంటాయి. వారాంతానికి పరిస్థితిలో అనుకూలమైన మార్పు వస్తుంది. వేంకటేశ్వరస్వామి స్తోత్రాలు వినండి.

కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. అందరితో చర్చించి, సమయోచితంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక విషయాల్లో మిశ్రమంగా ఉంది. ఖర్చుల నియంత్రణ అవసరం. విద్యార్థులకు మిశ్రమ వాతావరణం ఉంటుంది. శ్రమ అధికం అవుతుంది. ఉద్యోగులకు అధికారులతో మాటపట్టింపులు తలెత్తవచ్చు. హనుమాన్ చాలీసా పఠించండి.

ఆరోగ్యం, భక్తి పద్ధతులు

వృశ్చిక రాశి వారికి ఆత్మీయుల సహకారం లభిస్తుంది. భూ లావాదేవీల్లో అనుకూల ఫలితాలు పొందుతారు. కోర్టు కేసులలో విజయం చేకూరుతుంది. వ్యాపారులకు అనుకూలమైన వారం. స్థిరాస్తి ద్వారా ఆదాయం సమకూరుతుంది. రుణ బాధలు కొంతవరకు తొలగిపోతాయి. ఉద్యోగులకు మిశ్రమ వాతావరణం. ఆధికారుల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక శుభవార్త వింటారు. ఆరోగ్యంగా ఉంటారు. లక్ష్మీ ధ్యానం శుభప్రదం.

ధనుస్సు రాశి వారికి వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో కదలిక వస్తుంది. పెద్దల సూచనలు పాటించడం చాలా అవసరం. వివాదాలకు తావు ఇవ్వకండి. అర్ధాష్టమ శని కారణంగా కుటుంబంలో కలహ వాతావరణం ఉంటుంది. తల్లితో మాటపట్టింపులు తలెత్తవచ్చు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అధికారుల ఆదరణ పొందుతారు. పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. ఆర్థిక లబ్ది పొందుతారు. శివారాధన మేలు చేస్తుంది.

కొత్త అవకాశాలతో ఆదాయం పెరుగుతుంది. స్థిరమైన ఆలోచనలను ఆచరణలో పెడతారు. కొత్త దుస్తులు కొనుగోలు చేస్తారు. పెద్దల సూచనలు, సలహాలు పాటిస్తారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. బాధ్యతతో విధులు నిర్వర్తించి అధి కారుల మన్ననలు అందుకుంటారు. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం ఆవు తాయి. నరసింహస్వామి స్తోత్రాలు పఠించండి.

కుంభ రాశి వారికి శుభకార్యాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందుతుంది. కుటుంబంలో మిశ్రమ వాతావరణం ఉంటుంది. మాట పట్టింపులకు పోవద్దు. పెద్దల సలహాలు పాటించడం అవసరం. ఆరోగ్యంపై దృష్టిపై ట్టండి. ఎదుటివారి మనసు తెలుసుకొని ప్రవర్తించడం అవసరం. స్నేహితుల సహకారం లభిస్తుంది. రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగిపోతాయి. విద్యార్థులకు శ్రమ అధికమవుతుంది. శివాలయాన్ని సందర్శించండి.

మీన రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. శ్రమ అధికమవుతుంది. గౌరవానికి భంగం వాటిల్లకుండా చూసుకోవాలి. సమయపాలన పాటించడం అవసరం. విద్యార్థులకు మంచి సమయం. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగులు ఒత్తిడికి గురవుతారు. సహోద్యోగులతో చికాకులు తలెత్తుతాయి. భూ లావాదేవీల్లో ఏమరుపాటు తగదు. అన్నదమ్ములతో సఖ్యత చెడకుండా చూసుకోండి. ఆరోగ్యంపై దృష్టి సారించాలి. హనుమాన్ చాలీసా పఠించండి.

ఈ రోజు అన్ని రాశుల వారు తమ కార్యక్రమాలను జాగ్రత్తగా నిర్వహించాలి. దేవతారాధన, సూర్యారాధన చేయడం మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.