|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఈషా మూవీ రిలీజ్ డేట్ వాయిదా.. భయపడడానికి ఇంకొంచెం టైం ఉంది అంటూ నిర్మాత పోస్ట్..

Published: 10-12-2025, 4:48 AM
ఈషా మూవీ రిలీజ్ డేట్ వాయిదా.. భయపడడానికి ఇంకొంచెం టైం ఉంది అంటూ నిర్మాత పోస్ట్..
  • అఖిల్‌రాజ్‌, త్రిగుణ్‌ హీరోలుగా, హెబ్బా పటేల్ హీరోయిన్‌గా ‘ఈషా’ చిత్రం.
  • శ్రీనివాస్‌ మన్నె దర్శకత్వంలో వంశీ నందిపాటి, బన్నీ వాస్ నిర్మాణం.
  • ఈషా మూవీ రిలీజ్ డేట్ డిసెంబర్ 12 నుంచి డిసెంబర్ 25కు వాయిదా.
  • నిర్మాత బన్నీ వాస్ క్రిస్మస్‌కు భయం గ్యారెంటీ అంటూ పోస్ట్.

ఈషా సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడింది. డిసెంబర్ 12న విడుదల కావాల్సిన ఈ చిత్రం ఇప్పుడు డిసెంబర్ 25న థియేటర్లలోకి రానుంది. ఈ విషయాన్ని నిర్మాత బన్నీ వాస్ తన ఎక్స్ ఖాతా ద్వారా ప్రకటించారు. క్రిస్మస్ నాడు భయం గ్యారెంటీ అంటూ ఆయన పోస్ట్ చేశారు.

ఈషా సినిమా వివరాలు, నటీనటులు

ఇటీవల ‘రాజు వెడ్స్‌ రాంబాయి’(Raju Weds Rambayi) చిత్రంతో సూపర్‌హిట్‌ కొట్టిన అఖిల్‌రాజ్‌(Akhil Raj)తో పాటు త్రిగుణ్‌(Trigun) హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘ఈషా’(Eesha). శ్రీనివాస్‌ మన్నె(Srinivas Manne) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో హెబ్బా పటేల్(Hebah Patel) హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే ఇందులో సిరి హనుమంత్(Siri Hanmanth), పృథ్వీ రాజ్(Prithviraj) వంటి తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమాను వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్‌ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు.

వాయిదా పడిన రిలీజ్ డేట్

ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌(Title Annoncement), గ్లింప్స్‌(Glimps), ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో భయపెట్టాయి. అయితే ఈ చిత్రం డిసెంబర్ 12న థియేట్రికల్ రిలీజ్ కానుండగా ఇప్పుడు ఈ మూవీ వాయిదా పడినట్లు నిర్మాత బన్నీ వాసు ఎక్స్ వేదికగా వెల్లడించాడు.

నిర్మాత బన్నీ వాస్ పోస్ట్

ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. ‘ఈషా ఇప్పుడు డిసెంబర్ 25న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది.. ఈ క్రిస్మస్‌కి కచ్చితంగా మీకు భయం గ్యారెంటీ’ అని రాసుకొచ్చారు. ఇక పోస్టర్ మీద ‘భయపడడానికి ఇంకొంచెం టైం ఉంది.. కానీ భయం మాత్రం గ్యారెంటీ’ అని రాసి ఉంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

ఈషా మూవీ వాయిదా నిర్ణయం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచింది. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా రానున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి భయాన్ని పంచుతుందో చూడాలి. నిర్మాత ఇచ్చిన హామీ నిజమవుతుందో లేదో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.