|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Elio Movie Review: వీడికి ఏలియన్స్ కావాలి!

Published: 22-09-2025, 2:06 AM
Elio Movie Review: వీడికి ఏలియన్స్ కావాలి!

చిన్నారి ఎలియోకు ఏలియన్స్ అంటే ఎంతో ఇష్టం. రోజూ బీచ్‌కు వెళ్లి వాటి కోసం ఎదురుచూస్తాడు. అతని ఆశ తీరడానికి ఎంత సమయం పడుతుందో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది.

Key Points

1

ఎలియోకు ఏలియన్స్ అంటే పిచ్చి.

2

రోజూ బీచ్‌కి వెళ్లి ఏలియన్స్ కోసం ఎదురు చూస్తాడు.

4

గ్లోర్డన్ అనే ఏలియన్ ఎలియోకు మంచి స్నేహితురాలు అవుతుంది.

ఎలియో యొక్క ఏలియన్ ప్రేమ

హేయ్ కిడ్స్…మీకెవరికైనా ఏలియన్స్ ని చూడాలనుందా లేదా వాళ్ళ దగ్గరకి వెళ్ళాలనుందా. అమ్మో అస్సలు లేదు అనుకుంటున్నారా..కాని ఎలియోకి మాత్రం తనను ఎవరైనా ఏలియన్స్ తీసుకువెళితే బావుండు అని అనుకుంటున్నాడు, అది కూడా ఎంతలా అంటే రోజూ బీచ్ కి వెళ్ళి అలా ఒంటరిగా ఉండిపోయి పడుకుండి పోతాడు.

ఏలియన్లతో సాహసం

ఎప్పుడైనా ఓ ఏలియన్ తనను చూసి ఎత్తుకెళ్ళకుండా ఉంటదా అన్న చిన్న ఆశ ఎలియోకి. తన పేరెంట్స్ ని పోగొట్టుకోని ఎయిర్ ఫోర్స్ మేజర్ అయిన తన పిన్ని దగ్గర ఉంటున్న ఎలియోకి చిన్నప్పటి నుండి ఈ ఏలియన్స్ అంటే పిచ్చి, అందుకే తనను ఎత్తుకుపొమ్మని కనిపించిన సిగ్నల్స్ కి మెసేజ్ పెడుతుంటాడు ఎలియో.

హాట్‌స్టార్‌లో ఎలియో

ఆ రోజు రానే వస్తుంది. ఎలియోని ఓ ఏలియన్ గ్రూప్ ఎత్తుకువెళుతుంది. ఏలియన్స్ గ్రూప్ లో గ్లోర్డన్ ఎలియోకి మంచి ఫ్రెండ్ అవుతుంది. ఇక అక్కడ నుండి వీళ్ళు చేసే అల్లరి, ఫాంటసీ అడ్వెంచర్స్ మాత్రం హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న యానిమేటెడ్ ఫాంటసీ మూవీ ఎలియోని చూడాల్సిందే. కిడ్స్ ఎలియో ఈజ్ ఎ సూపర్ మూవీ. ఇంకెందుకాలస్యం గ్రాబ్ యువర్ రిమోట్ టు జాయిన్ ఎలియో ఎలాంగ్ విత్ ఏలియన్స్. – హరికృష్ణ ఇంటూరు

ఎలియో చిన్నారులకు, ఏలియన్స్ ప్రేమికులకు నచ్చే అద్భుతమైన యానిమేటెడ్ సినిమా. హాట్‌స్టార్‌లో వెంటనే చూడండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.