బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ రొటీన్‌గా సాగుతున్నా, హౌస్‌లో ప్రేమ పక్షుల సందడి మాత్రం ఆకట్టుకుంటోంది. ఇమ్మాన్యుయేల్-తనూజ, పవన్-రీతు వంటి జంటల మధ్య రొమాన్స్, గొడవలు ప్రేక్షకులను ఉత్సాహపరుస్తున్నాయి.
Key Points
బిగ్ బాస్ తెలుగు 9లో తనూజతో ఇమ్మాన్యుయేల్, రీతుతో పవన్ ప్రేమ ట్రాక్‌లు హైలైట్ అవుతున్నాయి.
పవన్, రీతు టాస్కుల్లో గెలిచినప్పుడల్లా ఒకరినొకరు గట్టిగా హగ్ చేసుకుంటూ కనిపించారు.
ఓడిపోయినప్పుడు తనూజ ఇరిటేషన్ను ప్రదర్శించగా, పవన్ ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించాడు.
దమ్మ శ్రీజ హౌస్‌లో రామురాథోడ్, దివ్యలతో సహా పలువురితో గొడవలకు దిగుతోంది.
బిగ్ బాస్ లో ప్రేమ పక్షుల సందడి
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రొటీన్ గానే కొనసాగుతోంది. కొత్తదనం కనిపిస్తుంది అనుకుంటే పాత ఫార్ములాకే కొత్త రంగులువేసి కలర్ ఫుల్ గా చూపిస్తున్నారు. బిగ్ బాస్ ఇల్లుతో పాటు, కంటెస్టెంట్లు మాత్రమే మారుతున్నారు.. కానీ టాస్క్ లు విషయంలో పెద్దగా మార్పులేమి కనిపించడంలేదు. అంతే కాదు ప్రతీసీజన్ లో ప్రేమపక్షులు మాత్రం పక్కాగా కనిపిస్తున్నారు. ఈసీజన్ లో కూడా రెండు మూడు జంటలు సందడి చేస్తున్నాయి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో రెండు మూడు జంటలు కనిపిస్తున్నాయి. తనూజకు ఇమ్మాన్యుయేల్ పులిహోర కలుపుతుంటే, రీతుతో పవన్ తెగ హడావిడి చేస్తున్నాడు, అటు కళ్యాణ్ కూడా రీతుతో మాట కలుపుతున్నాడు. ఇలా ఈసారి బిగ్ బాస్ హౌస్ లో ప్రేమ జంటలు ఎక్కువైపోయారు.
తgజా ఎపిసోడ్ లో బిగ్ బాస్ పెట్టిన టాస్క్ వల్ల ప్రేమ పక్షులకు కాస్త టైమ్ దొరికినట్టు అయ్యింది. మరీ ముక్యంగా పవన్, రీతు ఇద్దరు ఒకే టీమ్ లో ఉండటంతో ఈ రోజు జరిగిన టాస్క్ లలో ఆ ఇద్దరు గెలిచినప్పుడు ఈ ఇద్దరు ఓవర్ యాక్షన్ ను మిగతా కంటెస్టెంట్లు కూడా చూడలేకపోతున్నారు. ఈ ఎపిసోడ్ లో బిగ్ బాస్ పెట్టిన రెండు టాస్క్ లలో ఈ జంట విజయ్ సాధించింది. సక్సెస్ వచ్చినప్పుడల్లా.. పవన్ ను గట్టిగా హాగ్ చేసుకుంటుంది రీతు. ఇక వీరిని చూసిన సంజన వెంటనే ఆ.. ఛాన్స్ దొరికిందిగా ఇక అంటూ సెటైరికల్ గా మాట్లాడటం కనిపించింది.
పవన్, రీతు రొమాంటిక్ క్షణాలు
తనూజ పక్కన ఎప్పడు ఇమ్మాన్యుయేల్ కనిపిస్తుంటాడు. కానీ తాజా ఎపిసోడ్ లో మాత్రం తనూజ వెంట పవన్ కళ్యాణ్ కనిపించాడు. ప్రతీ టాస్క్ లో వీరు ఓడిపోతూ వస్తున్నారు. దాంతో తనూజలో ఇరిటేషన్ పెరిగిపోయింది. ఓడిపోయినప్పుడల్లా ఎదుటివారిపై కోపం చూపిస్తోంది. ఆమె జట్టులో ఉన్న పవన్ కళ్యాణ్ ఒదార్చడానికి వచ్చినా.. అతనిపై కూడా గట్టిగానే ఫైర్ అయ్యింది తనూజ. ఆమె అన్ని మాటలు అన్నా కూల్ గా సమాధానం చెపుతూ ఓదార్చాడు పవన్. ఇక ఈమధ్యలో దమ్మ శ్రీజ వరుసగా అందరిత గొడవలు పడుతోంది. మొదట రామురాథోడ్ తో వాదించిన శ్రీజ.. ఆతరువాత హౌస్ లో దివ్యతో గొడవకు దిగింది. ఆమను అనవసరంగా వెక్కిరిస్తూ, కనిపించింది.

హౌస్ లో కంటెస్టెంట్ ల మధ్య గొడవలు
సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటకే ఐదో వారంలోకి చేరుకుంది. మొత్తం 15 మంది హౌస్ లోకి అడుగు పెడితే నలుగురు ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం 12 మంది కంటెస్టెంట్స్ మాత్రమే హౌస్ లో ఉన్నారు. ఇందులో దివ్యా నికితా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ వీకెండ్ ఎపిసోడ్ లోనే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల ఎంట్రీల ఉండనున్నాయని తెలుస్తోంది.
బిగ్ బాస్ హౌస్‌లో ప్రేమ, గొడవలు, డ్రామా కలగలిసి ప్రేక్షకులకు పూర్తి వినోదాన్ని అందిస్తున్నాయి. కంటెస్టెంట్ల మధ్య ఈ సంబంధాలు, సంఘర్షణలు సీజన్‌కు మరింత మసాలాను జోడిస్తున్నాయి.