|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఎమోషనల్‌గా ఆకట్టుకుంటోన్న ‘మరి మరి..’ సాంగ్

Published: 12-11-2025, 8:48 AM
ఎమోషనల్‌గా ఆకట్టుకుంటోన్న ‘మరి మరి..’ సాంగ్

విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన ‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమా నుండి ‘మరి మరి..’ లిరికల్ సాంగ్ విడుదలైంది. ఎమోషనల్‌గా ఆకట్టుకుంటున్న ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో విశేష స్పందన పొందుతూ వైరల్ అవుతోంది.

Key Points

1

‘సంతాన ప్రాప్తిరస్తు’ చిత్రం నుండి ‘మరి మరి..’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేయబడింది.

2

హేషమ్ అబ్దుల్ వహాబ్ ఆలపించిన ఈ పాటను సునీల్ కశ్యప్ కంపోజ్ చేయగా, ఉమా వంగూరి లిరిక్స్ అందించారు.

4

ఎమోషనల్ బీట్‌తో సాగిన ‘మరి మరి..’ పాట సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమా ప్రమోషన్స్ జోరు

విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న సినిమా ‘సంతాన ప్రాప్తిరస్తు’. మధుర ఎంటర్‌టైన్మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీకి సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య ఈ సినిమా ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం మూవీ నుంచి వరుస అప్డేట్స్ ఇస్తూ సందడి చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ‘మరి మరి..’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఉమా వంగూరి లిరిక్స్ అందించిన ఈ పాటను సునీల్ కశ్యప్ కంపోజ్ చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ పాడారు. ‘మరి మరి నిన్ను వెతికేలా.. మరవదు ఓ క్షణమైనా.. మనసంతా నీ తలపులే.. ప్రతి చోటా నీ గురుతులే.. వేచా గడిచిన నిన్నల్లో.. వెతికా నడిచిన దారుల్లో.. వెలుగే విడిచిన నీడల్లో.. వదిలి వెళ్లిన జాడల్లో…’ అంటూ ఎమోషనల్ బీట్‌తో సాగిన ఈ సాంగ్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇందులో.. వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, హర్షవర్థన్, బిందు చంద్రమౌళి, జీవన్ కుమార్, సత్య కృష్ణ, తాగుబోతు రమేష్, అభయ్ బేతిగంటి, కిరీటి, అనిల్ గీల, సద్దామ్, రియాజ్, తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

‘మరి మరి..’ పాట: సంగీతం, సాహిత్యం, గాయకులు

సోషల్ మీడియాలో పాటకి లభిస్తున్న అద్భుత స్పందన

‘మరి మరి..’ పాట శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటూ, ‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఈ పాట విజయం చిత్ర బృందానికి మంచి ఊపునిచ్చింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.