|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’: రైతుల గుండెల్లో సినిమా సందడి! అగ్రి ఎగ్జిబిషన్లో సరికొత్త ప్రమోషన్స్!

Published: 11-03-2026, 1:35 PM
‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’: రైతుల గుండెల్లో సినిమా సందడి! అగ్రి ఎగ్జిబిషన్లో సరికొత్త ప్రమోషన్స్!
  • ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ సినిమా రైతు సమస్యల చుట్టూ తిరుగుతుంది.
  • ఈ సినిమా ప్రమోషన్లను రైతుల మధ్య నుంచే ప్రారంభించారు.
  • అగ్రి ఎగ్జిబిషన్‌లో సినిమా స్టాల్ ఏర్పాటు చేయడం ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
  • వ్యవసాయం, సాంకేతికత మధ్య అంతరాన్ని తగ్గించడమే సినిమా లక్ష్యం.

‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ అనే సినిమా రైతు సమస్యల ఇతివృత్తంతో రూపొందింది. ఈ సినిమా ప్రమోషన్లను చిత్ర బృందం వినూత్నంగా చేపట్టింది. వ్యవసాయ ప్రదర్శనలలో ప్రత్యేక స్టాల్స్‌ను ఏర్పాటు చేసి సినిమా గురించి రైతులకు వివరిస్తున్నారు.

రైతు సమస్యలపై ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’

Mr Work From Home Movie : సినిమా తీయడం ఒక ఎత్తైతే, దాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లడం మరో పెద్ద సవాలు. పెద్ద బడ్జెట్ సినిమాలు భారీ ప్రమోషన్లతో దుమ్మురేపుతాయి. కానీ సోషల్ మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో వచ్చే చిన్న సినిమాల పరిస్థితి మాత్రం వేరేలా ఉంటుంది. అయితే ఇప్పుడు ఒక లో బడ్జెట్ సినిమా తన ప్రమోషన్ స్టైల్‌తోనే అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. రైతు సమస్యలను ప్రధాన అంశంగా తీసుకున్న ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

ఈ సోషల్ డ్రామా సినిమా పేరు ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’. లోటస్ క్రియేటివ్ వర్క్స్ పై అరవింద్ మండ్యం దీనిని నిర్మించారు. ఈ సినిమాకు మధుదీప్ చెలికాని దర్శకత్వం వహించారు. సినిమాటోగ్రఫీ రవికుమార్, ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వరరావు. సంగీతం అరుణ్ చిల్వేరు అందించారు. సెన్సార్ పూర్తి చేసుకుని వేసవి సెలవుల్లో థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది ఈ సినిమా. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ సినిమా చూసి రైతులు, యువత ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి!

వ్యవసాయ ప్రదర్శనలో సినిమా ప్రమోషన్స్

ఈ సినిమా రైతులకు, వ్యవసాయానికి ఉపయోగపడే అంశాలను చూపిస్తుంది. అందుకే ప్రమోషన్ కూడా రైతుల మధ్య నుంచే మొదలుపెట్టారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన రాజేందర్ రెడ్డి రైతుబడి అగ్రి షోలో చిత్రబృందం ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేసింది. అక్కడికి వచ్చిన వందలాది మంది రైతులకు సినిమా కాన్సెప్ట్‌ను వివరించారు. సాధారణంగా అగ్రి ఎగ్జిబిషన్లలో విత్తనాలు, ఎరువులు, యంత్రాల స్టాళ్లు మాత్రమే ఉంటాయి. కానీ ఒక సినిమాకు స్టాల్ పెట్టడం అరుదైన విషయం.ఇక మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన మెగా రైతు మేళాలో కూడా చిత్రబృందం స్టాల్ ఏర్పాటు చేసింది. మంత్రులు, అధికారులు, స్కాలర్లు, మహిళా యాక్టివిస్టులు, రైతులు స్టాల్‌ను సందర్శించి చిత్రబృందాన్ని అభినందించారు. రైతుల కోసం చేస్తున్న ప్రయత్నాన్ని అందరూ ప్రశంసించారు.

సాంకేతికత, వ్యవసాయం మధ్య వారధి

వ్యవసాయం, సాంకేతికత మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ సినిమా ఉండబోతోంది. అలాగే ఇప్పటి సమాజంలో పెరుగుతున్న విడాకుల సమస్యను కూడా ఈ సినిమా చూపిస్తుంది. మునుపటి తరాల జంటలకు, కుటుంబ విభేదాలను వచ్చినప్పుడు, కటుంబం ఎలా వాటిని సున్నితంగా పరిష్కరించేవాల్లో, సాంప్రదాయ కుటుంబ విలువలతో ఈ సమస్యని ఎలా తగ్గించాలో కూడ ఈ సినిమా చూపించబోతోంది. ఇక 10 మంది కమెడియన్స్‌తో నవ్వులు పూయించే ఈ సినిమా పూర్తిగా వినోదాత్మకంగా తెరకెక్కింది. ఈ సినిమా యువత, ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఉంటుందని దర్శకనిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో పాయల్ రాధాకృష్ణ, అనీష్ కురువిల్లా, శివాజీ రాజా,హర్ష వర్ధన్, సత్య కృష్ణన్, హర్ష చెముడు, నెల్లూరు సుధర్షన్, సీవీఎల్ నరసింహరావు, గుండు సుధర్షన్, వేణు యెల్దండి, సప్తగిరి, గిరిధర్, సరయు, సత్తిపండు వంటి కమెడియన్స్ నటించారు.

‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ సినిమా విడుదల కోసం రైతులు, సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం వ్యవసాయ రంగానికి ఒక కొత్త వెలుగునిస్తుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.