|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఉగ్రవాదులకు బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి హెచ్చరిక

Published: 29-04-2025, 7:16 AM
ఉగ్రవాదులకు బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి హెచ్చరిక

జమ్మూ కశ్మీర్‌లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో అమాయక ప్రజలు మరణించడం దురదృష్టకరం. ఈ దాడిపై బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి తీవ్రంగా స్పందించారు. ఉగ్రవాదులు తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందేనని హెచ్చరించారు.

Key Points

1

జమ్మూ కశ్మీర్‌లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై ఇమ్రాన్ హష్మీ స్పందన.

2

ఉగ్రవాదులు తగిన శిక్ష పొందాలని ఆయన హెచ్చరిక.

4

భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.

పెహల్గాం ఉగ్రదాడి

జమ్మూకశ్మీర్‌(Jammu and Kashmir)లోని పెహల్గాంలో అమాయక టూరిస్టులపై ఉగ్రమూకలు దాడి(Terror Attack)కి పాల్పడిన విషయం తెలిసిందే. తుపాకులతో వచ్చి దాదాపు 28 మంది టూరిస్టులను పిట్టల్ని కాల్చినట్లు కాల్చి చంపారు. ఈ ఘటన కేవలం భారత దేశాన్నే కాకుండా మొత్తం ప్రపంచాన్ని కుదిపేసింది. వివిధ దేశాల ప్రతినిధులు స్పందించి ఉగ్రదాడి(Terror Attack)ని ఖండించారు. ఇండియాలోని రాజకీయ నాయకులు, సినీ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు అలందరూ పార్టీలకు అతీతంగా స్పందించి ఉగ్రదాడిని ఖండించారు. తాజాగా ఉగ్రదాడిపై బాలీవుడ్(Bollywood) నటుడు ఇమ్రాన్ హష్మి(Emraan Hashmi) స్పందించారు. ఉగ్రవాదులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఉగ్రవాదానికి మతం లేదని చెప్పారు. పక్కా ప్లాన్‌తోనే ఈ దాడికి తెగబడ్డారని అన్నారు. మరోవైపు.. టూరిస్టులపై కాల్పులు జరిపిన టెర్రరిస్టుల కోసం భద్రతా బలగాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. ఇప్పటికే ఆ నలుగురి లొకేషన్లను నాలుగుసార్లు ట్రాక్‌ చేయగా.. వారు త్రుటిలో తప్పించుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆర్మీ, సీఆర్పీఎఫ్‌ బలగాలు పహల్గాం చుట్టుపక్కల అడవులను జల్లెడ పడుతున్నాయి.

ఇమ్రాన్ హష్మి స్పందన

భద్రతా దళాల గాలింపు

జమ్మూ కశ్మీర్‌లోని ఉగ్రదాడి తీవ్ర దుఃఖాన్ని కలిగించింది. ఇమ్రాన్ హష్మి హెచ్చరికతో పాటు, భద్రతా దళాల కృషి ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి చాలా ముఖ్యం.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.