
📌 Key Points
- కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉంది.
- పెట్రోల్‌పై లీటరుకు రూ.13 నుంచి రూ.3కు, డీజిల్‌పై రూ.10 ఎక్సైజ్ సుంకం తగ్గింపు.
- ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నష్టాలను భరిస్తూ ధరలు పెంచకుండా ఉన్నాయి.
- ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో ఆయిల్ కంపెనీలు నష్టాలను పూడ్చుకునే అవకాశం.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా లేదా అనే సందేహాలు ప్రజల్లో నెలకొన్నాయి. దీని గురించి నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.
ఎక్సైజ్ సుంకం తగ్గింపు వివరాలు
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ (Petrol), డీజిల్ (Diesel)పై విధిస్తున్న ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించింది. పెట్రోల్‌పై లీటరుకు ఎక్సైజ్ సుంకాన్ని రూ.13 నుంచి రూ.3కు, డీజిల్‌పై లీటరుకు ఉన్న రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా తొలగించారు. ఈ క్రమంలో వినియోగదారుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని అన్న సందేహాలు మొదలయ్యాయి. అయితే, ఎక్సైజ్ సుంకం (Excise Duty) తగ్గించినప్పటికీ, పెట్రోల్ బంకుల్లో ధరలు వెంటనే భారీగా తగ్గే అవకాశం తక్కువని నిపుణులు భావిస్తున్నారు.
కొన్ని వారాలుగా అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగినా.. దేశీయంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (IOCL, BPCL, HPCL) ఆ భారాన్ని వినియోగదారులపై వేయకుండా అవే భరించాయి. ప్రస్తుతం లీటర్ పెట్రోల్‌పై రూ.24, డీజిల్‌పై రూ.30 వరకు ఈ కంపెనీలు నష్టపోతున్నట్లుగా సమాచారం. ప్రభుత్వం తగ్గించిన ఈ ఎక్సైజ్ సుంకాన్ని ఆయిల్ కంపెనీలు తమ పాత నష్టాలను పూడ్చుకోవడానికి, ధరలు మరింత పెరగకుండా అడ్డుకోవడానికి (Buffer) ఉపయోగించుకునే అవకాశం ఉంది. దీంతో రీటెయిల్ అవుట్‌లెట్ల (Retail Outlets)లో వినియోగదారులు కొనుగోలు చేసే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం అంతమాత్రమేనని మార్కెట్ నిపుణులు చెబతున్నారు.
ధరల తగ్గింపుపై నిపుణుల అభిప్రాయం
ఆయిల్ కంపెనీల భారం ఎంత?
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం సామాన్యులకు కొంత ఊరటనిచ్చే అంశమే అయినప్పటికీ, పూర్తిస్థాయిలో ప్రయోజనం చేకూరాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


