|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఫహద్ ఫాసిల్ ‘మారీసన్’ సినిమా ట్రైలర్ అప్డేట్ ఇచ్చిన మూవీ మేకర్స్.. క్యూరియాసిటీ పెంచుతున్న పోస్టర్

Published: 13-07-2025, 11:44 AM
ఫహద్ ఫాసిల్ ‘మారీసన్’ సినిమా ట్రైలర్ అప్డేట్ ఇచ్చిన మూవీ మేకర్స్.. క్యూరియాసిటీ పెంచుతున్న పోస్టర్

మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ నటించిన ‘మారీసన్’ సినిమా ట్రైలర్ విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది. జూలై 14న ట్రైలర్ విడుదల కానుంది. వడివేలు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.

Key Points

మారీసన్ ట్రైలర్ విడుదల తేదీ ప్రకటన

మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్(Fahad Fazil) వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. తెలుగులో ఆయన ‘పుష్ప-2’ మూవీలో విలన్‌గా నటించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఫహాద్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మారీసన్’(Mareesan). సుధీష్ శంకర్(Sudhish Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆర్బీ చౌదరీ(RB Chowdhury) నిర్మిస్తున్నారు. ఇందులో ఫహాద్ ఫాజిల్, వడివేలు(Vadivelu) ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. వివేక్ ప్రసన్న, రేణుక, సితార కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. 2025 జూలైలో విడుదల కాబోతున్నట్లు సమాచారం. తాజాగా, ఫహాద్ ఫాజిల్ ‘మారీసన్’ సినిమాకు సంబంధించిన అప్డేట్ రాబోతున్నట్లు ట్విట్టర్ ద్వారా ఓ పోస్ట్ పెట్టారు. ఈ మూవీ ట్రైలర్ జూలై 14న సాయంత్రం 5:04 గంటలకు రాబోతున్నట్లు వెల్లడించారు. అలాగే బైక్‌పై ఓ బ్యాక్ వేసుకుని వడివేలుతో జాలీగా వెలుతున్న పోస్టర్‌ను షేర్ చేశారు. ఇక ఈ పోస్ట్‌కు ‘‘వేచి ఉండటం ముగుస్తుంది, మాయాజాలం ప్రారంభమవుతుంది’’ అనే ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం ఫహాద్ షేర్ చేసిన పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది.

నటీనటుల వివరాలు మరియు సినిమా విడుదల తేదీ

పోస్టర్ ప్రేక్షకుల ఆసక్తిని రేకెత్తిస్తోంది

ఫహద్ ఫాజిల్ మరియు వడివేలు కలిసి నటించిన ‘మారీసన్’ సినిమా ట్రైలర్ త్వరలోనే విడుదల కానుండటంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2025 జూలైలో విడుదల అవుతుంది.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.