|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

లైంగిక వేధింపుల ఆరోపణలు: ప్రముఖ దర్శకుడు అరెస్ట్.. మాలీవుడ్‌లో కలకలం!

Published: 24-12-2025, 6:15 AM
లైంగిక వేధింపుల ఆరోపణలు: ప్రముఖ దర్శకుడు అరెస్ట్.. మాలీవుడ్‌లో కలకలం!
  • మలయాళ దర్శకుడు, మాజీ ఎమ్మెల్యే పీటీ కుంజు ముహమ్మద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
  • ఓ మహిళ ఫిర్యాదు మేరకు ఆయనపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు.
  • కేరళ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ సమయంలో ఈ ఘటన జరిగినట్లు బాధితురాలు పేర్కొంది.
  • అరెస్ట్ అయిన కాసేపటికే దర్శకుడు బెయిల్ పై విడుదలయ్యారు.

మలయాళ చిత్ర పరిశ్రమలో కలకలం రేగింది. ప్రముఖ దర్శకుడు, మాజీ ఎమ్మెల్యే పీటీ కుంజు ముహమ్మద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఈ చర్య తీసుకున్నారు. అయితే, ఆయన బెయిల్‌పై విడుదలైనట్టు వార్తలు వస్తున్నాయి.

ఎవరు ఈ పీటీ కుంజు ముహమ్మద్?

Director Arrested in Women Assault Case: మలయాళ దర్శకుడు , మాజీ ఎమ్మెల్యే పీటీ కుంజు ముహమ్మద్‌ని పోలీసులు అరెస్ట్ ‌ చేశారు . లైంగిక వేధింపుల కేసులో బుధవారం ఆయనను పోలీసులు అరెస్టు చేశారు . అయితే కాసేపటి క్రితమే ఆయన బెయిల్ ‌ పై బయటకు వచ్చినట్టు మాలీవుడ్ ‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి . పీటీ కుంజు తనని లైంగికంగా వేధించాడంటూ ఇటీవల ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది . ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కేరళ పోలీసులు .. పీటీ కుంజుని ఈ రోజు అదుపులోకి తీసుకున్నారు .

కాగా ఇటీవల కేరళ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం కోసం మలయాళ చిత్రాలను ఎంపిక చేసే ప్రక్రియ కోసం పీటీ కుంజు ఓ హోటల్లో బస చేశారు . ఆ సమయంలో ఆయన తనని శారీరకంగా వేధించినట్టు ఈ నెల ప్రారంభంలో ఫిర్యాదు చేసింది . ఆమె ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు . ఈ కేసు విచారణలో భాగంగా దర్శకుడు కుంజు మహమ్మద్ ‌ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు . ఆ సమయంలో దర్శకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు . అప్పటికే కోర్టు నుంచి ముద్దస్తు బెయిల్ ‌ తెచ్చుకున్న ఆయనను పోలీసులు విడుదల చేశారు . ప్రస్తుతం ఈ వ్యవహరం మాలీవుడ్ ‌ లో హాట్ ‌ టాపిక్ ‌ అయ్యింది .

లైంగిక వేధింపుల కేసు వివరాలు

బెయిల్ పై విడుదల.. మాలీవుడ్‌లో చర్చ

ప్రముఖ దర్శకుడు పీటీ కుంజు ముహమ్మద్ అరెస్ట్, బెయిల్ వ్యవహారం మాలీవుడ్‌లో తీవ్ర చర్చకు దారితీసింది. కేసు విచారణ కొనసాగుతోంది. ఈ ఘటన చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతూనే ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.