
రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ అందింది. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమా టైటిల్‌ను ‘ఫౌజీ’గా ప్రకటించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్ కూడా విడుదలై అదుర్స్ అనిపించింది.
Key Points
ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్‌లో కొత్త చిత్రం.
ప్రభాస్ పుట్టినరోజున 'ఫౌజీ' టైటిల్, ఫస్ట్‌లుక్ విడుదల.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇమాన్వి కథానాయిక.
'ఫౌజీ' కథ ఓ ధైర్యవంతుడైన సైనికుడి నేపథ్యం.
ప్రభాస్-హను మూవీ టైటిల్, ఫస్ట్‌లుక్
Fauzi : హను రాఘవపూడి దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ ఓ చిత్రంలో నటిస్తున్నారు. కొత్త అమ్మాయి ఇమాన్వి కథానాయికగా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి లు కీలక పాత్రలను పోషిస్తున్నారు.
Prabhas Rare Photos : ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. ప్రభాస్ పాత ఫొటోలు.. రెబల్ స్టార్ రేర్ ఫొటోలు చూశారా..?
సినిమాలోని కీలక పాత్రలు, బృందం
కాగా.. నేడు ప్రభాస్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ చిత్ర టైటిల్‌ను రివీల్ చేశారు. ఈ చిత్రానికి ఫౌజీ (Fauzi) అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ, ఈ చిత్రంలో ప్రభాస్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.
‘పద్మవ్యూహాన్ని ఛేదించిన అర్జునుడు.. పాండవుల పక్షాన ఉన్న కర్ణుడు.. గురువు లేని ఏకలవ్యుడు.. పుట్టకతోనే అతడు ఓ యోధుడు.. మన చరిత్రలో దాగిన అధ్యాయాల్లోని అత్యంత ధైర్యవంతుడైన సైనికుడి కథ ఇది. అతడే ఫౌజీ.’ అంటూ ప్రభాస్ గొప్ప దనాన్నిచెప్పుకొచ్చింది.
ఫౌజీ: ఒక యోధుడి కథా నేపథ్యం
ఇందులో ప్రభాస్ చాలా సీరియస్‌గా చూస్తున్నట్లుగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రభాస్ పుట్టినరోజున విడుదలైన ‘ఫౌజీ’ టైటిల్, ఫస్ట్‌లుక్ అభిమానులలో భారీ అంచనాలను పెంచింది. యోధుడి కథా నేపథ్యంతో రాబోతున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


