
📌 Key Points
- ధనుష్, శృతిహాసన్ నటించిన ‘త్రీ’ ఫిబ్రవరి 6న విడుదల
- రామ్ చరణ్ నటించిన ‘ఆరెంజ్’ ఫిబ్రవరి 7న రీ రిలీజ్
- నాగచైతన్య, సాయి పల్లవి నటించిన ‘లవ్ స్టోరీ’ ఫిబ్రవరి 14న విడుదల
- నాగచైతన్య, సమంత నటించిన ‘ఏం మాయ చేసావే’ ఫిబ్రవరి 14న రీ రిలీజ్
తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతోంది. ఫిబ్రవరి నెలలో పలు సూపర్ హిట్ సినిమాలు రీ రిలీజ్ కానున్నాయి. ధనుష్ నటించిన త్రీ, రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ వంటి సినిమాలు విడుదల కాబోతున్నాయి.
ఫిబ్రవరిలో రీ రిలీజ్ అవుతున్న సినిమాలు
Feb 2026 Movies Re-release: తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత కొంతకాలంగా రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో సినిమాలు తిరిగి 4k వెర్షన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ఆదరణను సొంతం చేసుకున్నాయి. ఇక ఫిబ్రవరి నెలలో కూడా భారీగా సినిమాలు రీ రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. మరి ఫిబ్రవరి నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సూపర్ హిట్ సినిమాలు ఏవి? ఎప్పుడు ఏ సినిమాలు విడుదల కాబోతున్నాయి అనే విషయానికి వస్తే…
త్రీ మూవీ: ధనుష్ శృతిహాసన్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘త్రీ ‘ సినిమా ఫిబ్రవరి ఆరవ తేదీ తిరిగి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.
ఆరెంజ్: బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రామ్ చరణ్, జెనీలియా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా 4k వర్షన్ లో ఫిబ్రవరి 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుది. ఇక ఈ సినిమా ఇదివరకే రీ రిలీజ్ అవ్వగా మరోసారి రీ రిలీజ్ కాబోతోంది.
వాలెంటైన్స్ డే స్పెషల్ రీ రిలీజ్
రాఘవ లారెన్స్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హర్రర్ సినిమా 2011 సంవత్సరంలో విడుదలై ప్రేక్షకులను భయభ్రాంతులకు గురిచేసింది. అయితే ఈ సినిమా మరోసారి థియేటర్లలో ప్రేక్షకులను భయపెట్టడానికి సిద్ధమవుతుందని చెప్పాలి. ఈ సినిమా ఫిబ్రవరి 13వ తేదీ తిరిగి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..
లవ్ స్టోరీ: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన కల్ట్ క్లాసికల్ మూవీ లవ్ స్టోరీ. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా తిరిగి ఫిబ్రవరి 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.
వీఎన్ ఆదిత్య దర్శకత్వంలో దివంగత నటుడు ఉదయ్ కిరణ్, రీమాసేన్ ప్రధాన పాత్రలలో నటించిన ప్రేమ కథ చిత్రం మనసంతా నువ్వే. ఈ సినిమా ఇప్పటికీ ఎవర్గ్రీన్ సినిమా అనే చెప్పాలి. 2001లో విడుదలైన ఈ సినిమాని వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీ మరోసారి థియేటర్లలో విడుదల చేయబోతున్నారు.
ప్రేక్షకుల ముందుకు మళ్లీ ‘ఏం మాయ చేసావే’
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగచైతన్య సమంత నటించిన సూపర్ హిట్ చిత్రం ఏం మాయ చేసావే. సమంత హీరోయిన్ గా పరిచయమవుతు నటించిన ఈ సినిమా 2010 వ సంవత్సరంలో విడుదలై ఎంతో మంచి సక్సెస్ అందుకుంది ఇక వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమా మరోసారి విడుదల కాబోతోంది. ఇలా ఫిబ్రవరి నెలలో ఏకంగా ఆరు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి ఇక వాలెంటెన్స్ డే సందర్భంగా ఒకేరోజు మూడు సినిమాలు రీ రిలీజ్ అవుతుండటం విశేషం.
ఫిబ్రవరి నెలలో అనేక సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. వాలెంటైన్స్ డే సందర్భంగా లవ్ స్టోరీ, ఏం మాయ చేసావే వంటి చిత్రాలు విడుదల కానుండటం విశేషం. మీ అభిమాన సినిమాను మళ్లీ చూడడానికి సిద్ధంగా ఉండండి.


