|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గ్యాస్ సిలిండర్ల కోసం ఇక క్యూలు లేవ్! దేశంలోనే తొలి గ్యాస్ ఏటీఎం ప్రారంభం!!

Published: 18-03-2026, 7:35 AM
గ్యాస్ సిలిండర్ల కోసం ఇక క్యూలు లేవ్! దేశంలోనే తొలి గ్యాస్ ఏటీఎం ప్రారంభం!!
  • హర్యానాలోని గురుగ్రామ్‌లో దేశంలోనే మొట్టమొదటి ఎల్పీజీ గ్యాస్ ఏటీఎం ప్రారంభం
  • సిలిండర్ కోసం రోజుల తరబడి ఎదురుచూసే అవసరం లేదు, ఏటీఎం ద్వారా సులభంగా పొందవచ్చు
  • ఈ ఏటీఎం 24 గంటలూ పనిచేస్తుంది, నిండు సిలిండర్‌ను 2-3 నిమిషాల్లో పొందవచ్చు
  • ప్రస్తుతం కాంపోజిట్ సిలిండర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి, ఇవి తక్కువ బరువు కలిగి ఉంటాయి

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వినియోగదారులకు ఒక శుభవార్తను అందించింది. ఇకపై ఏటీఎం ద్వారా డబ్బులు తీసుకున్నంత సులభంగా గ్యాస్ సిలిండర్లను పొందవచ్చు. దేశంలోనే మొదటి ఎల్పీజీ గ్యాస్ ఏటీఎంను హర్యానాలోని గురుగ్రామ్‌లో ప్రారంభించారు.

దేశంలోనే తొలి ఎల్పీజీ గ్యాస్ ఏటీఎం ప్రారంభం

గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ తీపికబురు చెప్పింది. సిలిండర్ బుక్ చేసి రోజుల తరబడి వేచి చూసే అవసరమే లేకుండా, ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసినంత సులభంగా ఇకపై గ్యాస్ సిలిండర్లను పొందే సదుపాయాన్ని కల్పంచారు. ఈ మేరక నార్త్ ఇండియాలో మొదటి ‘ఎల్పీజీ గ్యాస్ ఏటీఎం’ (LPG Gas ATM) హర్యానాలోని గురుగ్రామ్‌లో ప్రారంభమైంది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా గురుగ్రామ్‌లో సోహ్నా, సెక్టార్ 33లోని ‘సెంట్రల్ పార్క్ ఫ్లవర్ వ్యాలీ’లో ఈ స్మార్ట్ వెండింగ్ మిషన్‌ను ఏర్పాటు చేసింది.

గ్యాస్ సిలిండర్ పొందడం ఇప్పుడు మరింత సులభం

అయితే, ఈ ‘ఎల్పీజీ గ్యాస్ ఏటీఎం’ మిషన్ రోజులో 24 గంటలూ పనిచేస్తుంది. డెలివరీ బాయ్ ఎప్పుడు వస్తాడా అని వేచి చూడాల్సిన అవసరం లేదు. కేవలం రెండు నుంచి మూడు నిమిషాల వ్యవధిలోనే ఖాళీ సిలిండర్ ఇచ్చి నిండు సిలిండర్‌ను పొందవచ్చు ఈ ఏటీఎం ద్వారా ‘కాంపోజిట్ సిలిండర్లను’ (Composite Cylinders) అందిస్తున్నారు. ఇవి సాధారణ ఇనుప సిలిండర్ల 31 కేజీలు కంటే అందులో సగం బరువు అంటే సుమారు 15 కేజీలు మాత్రమే ఉంటాయి. ఈ సిలిండర్లు పారదర్శకంగా ఉండటం వల్ల లోపల గ్యాస్ ఎంత ఉందో వినియోగదారులు నేరుగా చూసుకోవచ్చు.

కాంపోజిట్ సిలిండర్ల ప్రత్యేకతలు

ముందుగా ‘ఎల్పీజీ గ్యాస్ ఏటీఎం’ మిషన్ వద్ద వినియోగదారులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. అనంతరం మొబైల్‌కు వచ్చే OTPని ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. ఖాళీ సిలిండర్‌పై ఉన్న QR కోడ్‌ను స్కాన్ చేయాల్సి ఉంటుంది. యూపీఐ (UPI) లేదా డెబిట్ కార్డ్ ద్వారా డిజిటల్ పేమెంట్ పూర్తి చేయాలి. పేమెంట్ పూర్తయిన వెంటనే మిషన్ నుంచి నిండు సిలిండర్ బయటకు వస్తుంది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న గ్యాస్ కొరత దృష్ట్యా వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా ఈ వినూత్న ప్రయోగాన్ని చేపట్టారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే త్వరలోనే దేశవ్యాప్తంగా మరిన్ని నగరాల్లో ఈ ఏటీఎంలను ఏర్పాటు చేయనున్నారు.

దేశంలో గ్యాస్ కొరతను అధిగమించడానికి ఈ ప్రయత్నం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే, దేశవ్యాప్తంగా మరిన్ని ఏటీఎంలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.