|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గద్దర్ ఫిలిం అవార్డ్స్ గడువు పొడిగింపు: సినిమా తారలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్!

Published: 01-02-2026, 3:35 AM
గద్దర్ ఫిలిం అవార్డ్స్ గడువు పొడిగింపు: సినిమా తారలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్!
  • 2025 గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కోసం దరఖాస్తు గడువును ఫిబ్రవరి 5 వరకు పొడిగించారు.
  • 17 విభాగాల్లో ఉత్తమ నటీనటులకు గద్దర్ అవార్డులను ప్రదానం చేయనున్నారు.
  • డాక్టర్ సి.నారాయణరెడ్డి పేరుతో ప్రత్యేక అవార్డును కూడా ఇవ్వనున్నారు.
  • తెలంగాణ ముఖ్యమంత్రి చేతుల మీదుగా గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 దరఖాస్తు గడువును పొడిగించింది. ఫిబ్రవరి 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సినిమా నటీనటులను ప్రోత్సహించడమే ఈ అవార్డుల ముఖ్య ఉద్దేశం.

గద్దర్ అవార్డుల దరఖాస్తు గడువు పెంపు

Gaddar film Awards 2025: సినిమా ఇండస్ట్రీలో కొనసాగే నటీనటులను ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకమైన అవార్డులను ప్రకటిస్తూ ఉంటారు. గతంలో తెలుగు చిత్ర పరిశ్రమలో కొనసాగే సెలబ్రిటీలకు రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డులను ప్రకటించేది. ప్రతి ఏడాది నంది అవార్డులతో సెలబ్రిటీలను సత్కరించేవారు అయితే రాష్ట్రాలు విడిపోయిన తర్వాత నంది అవార్డుల ప్రకటన కూడా ఆగిపోయింది. అయితే గత ఏడాది తెలంగాణ ప్రభుత్వం మాత్రం నంది అవార్డుల పేరును మారుస్తూ గద్దర్ అవార్డుల(Gaddar Awards)ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలా తెలంగాణ ఉద్యమకారుడు గద్దర్ పేరుతో ఈ అవార్డులను ప్రకటించి గత ఏడాది పెద్ద ఎత్తున అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇకపోతే 2025 సంవత్సరానికి సంబంధించిన చలనచిత్రాలకు గద్దర్ అవార్డులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.

2025 జనవరి ఒకటో తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు విడుదలైన సినిమాలు ఈ గద్దర్ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది అయితే ఈ దరఖాస్తుల గడువు ఆఖరి తేదీ ఫిబ్రవరి మూడో తేదీ వరకు తెలంగాణ ఎఫ్డీసీ అధికారికంగా వెల్లడించింది. వరుసగా రెండు రోజులు బ్యాంకులకు సెలవులు వచ్చిన నేపథ్యంలోనే ఈ దరఖాస్తు గడువును రెండు రోజులు పెంచుతూ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఫిబ్రవరి 5వ తేదీ మధ్యాహ్నం రెండు గంటల వరకు అప్లికేషన్స్ దరఖాస్తు గడువు ఉంటుంది . అలాగే ఆరోజు సాయంత్రం 4 గంటలలోపు సబ్ మిట్ చేసే వెసులుబాటును కల్పించింది.

17 విభాగాల్లో గద్దర్ అవార్డుల ప్రదానం

ఇక 2025లో సినిమాలు విడుదలైన వారందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు ఇక ఈ ఏడాది గద్దర్ అవార్డులలో భాగంగా 17 విభాగాల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఇక ఈ ఏడాది ప్రకటించబోయే గద్దర్ అవార్డులలో భాగంగా డాక్టర్ సి.నారాయణరెడ్డి పేరుతో ప్రత్యేకమైన అవార్డులను కూడా ఇవ్వబోతున్నారు.. ప్రతి ఏడాది ఈ గద్దర్ అవార్డులను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించబోతున్నట్లు తెలియజేశారు అయితే ఈ ఏడాది మరి కాస్త ముందుగానే ఈ వేడుకను నిర్వహించాలనే ఆలోచనలోనే టిఎఫ్డిసి దరఖాస్తులకు ఆహ్వానం పలికింది.

ముఖ్యమంత్రి చేతుల మీదుగా..

ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డుల ప్రదానోత్సవం

ఇక ఈ ఏడాది అతి త్వరలోనే ఈ గద్దర్ అవార్డు వేడుకను నిర్వహించబోతున్నారని త్వరలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాలను అధికారికంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం చేతుల మీదుగా ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే.ఈ ఏడాది ఈ అవార్డు ఏ ఏ సినిమాలకు వరిస్తుందో తెలియాల్సి ఉంది.

గద్దర్ అవార్డులు తెలంగాణ రాష్ట్రంలో సినీ పరిశ్రమకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయి. ఈ వేడుక త్వరలో జరగనుండగా, సినీ ప్రముఖులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.