
📌 Key Points
- నాగ వంశీ నిర్మాతగా ‘మ్యాడ్ జూనియర్’ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తి.
- ఈ చిత్రం హర్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కనుంది.
- సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 37గా రానుంది.
- నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది.
నాగ వంశీ నిర్మాతగా కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన మ్యాడ్ సినిమాకు సీక్వెల్ గా ‘మ్యాడ్ జూనియర్’ రాబోతోంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ చిత్రం హర్రర్ కామెడీ నేపథ్యంలో ఉండనుంది.
‘మ్యాడ్ జూనియర్’ పూజా కార్యక్రమాలతో ప్రారంభం
MAD Junior: ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున సినిమాలు ఫ్రాంచైజీలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఒక సినిమా సక్సెస్ అయ్యిందిఅంటే ఆ సినిమాకు వరుసగా ఫ్రాంచైజీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నాగ వంశీ నిర్మాతగా కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమాలలో మ్యాడ్ సినిమా(Mad) ఒకటి. రామ్ నితిన్, నార్నే నితిన్, సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ గా మ్యాడ్ స్క్వేర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాకు మూడో భాగం కూడా ఉండబోతుందని ఇటీవల చిత్ర బృందం తెలియచేశారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి పూజ కార్యక్రమాలను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకు మ్యాడ్ జూనియర్(Mad Junior) అనే టైటిల్ పెట్టబోతున్నట్లు తెలియజేశారు. ఇక ఈ సినిమా హర్రర్ కామెడీ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలియజేశారు. ఈ సినిమా పూజ కార్యక్రమాలు పూర్తి కావడంతో రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా త్వరలోనే ప్రారంభం కానున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను అధికారికంగా వెల్లడించనున్నారు.
హర్రర్ కామెడీగా రానున్న చిత్రం
ఇక ఈ సినిమా సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో ప్రొడక్షన్ నెంబర్ 37 సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ కైవసం చేసుకున్నట్టు ఇటీవల నెట్ ఫ్లిక్స్ కూడా ఈ విషయాన్ని వెల్లడించింది. ఇక గత ఏడాది పలు సినిమాల ద్వారా నాగ వంశీ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ప్రేక్షకుల నుంచి నిరాశ ఎదుర్కొన్నారు. ఇక ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా నాగ వంశీ నిర్మాణంలో తెరకెక్కిన అనగనగా ఒక రాజు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాతో హిట్ కొట్టిన నాగ వంశీ తదుపరి సినిమాని కూడా ప్రారంభించారు.
హర్రర్ కామెడీ నేపథ్యంలో..
నెట్ ఫ్లిక్స్ చేతికి డిజిటల్ హక్కులు
ఇక మ్యాడ్ జూనియర్ సినిమా కూడా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులను ప్రారంభించుకోతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా ఈసారి హర్రర్ కామెడీ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుండడం విశేషం. అయితే ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున సినిమాలు హర్రర్ కామెడీ నేపథ్యంలోనే విడుదలవుతున్నాయి. ఇక ఈ సినిమా కూడా హర్రర్ కామెడీ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో నాగవంశీ సాహసం చేస్తున్నారా? లేదా ఇదివరకు సినిమాలు మాదిరిగా మ్యాడ్ జూనియర్ తో హిట్ కొట్టబోతున్నారా అనేది తెలియాల్సి ఉంది.
మ్యాడ్ జూనియర్ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమా హర్రర్ కామెడీ నేపథ్యంలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.


