
📌 Key Points
- విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి కలిసి నటించిన ‘గాంధీ టాక్స్’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది!
- అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం చూడాలంటే రెంటల్ విధానంలో చూడాల్సిందే!
- మూకీ చిత్రంగా వచ్చిన ‘గాంధీ టాక్స్’ జనవరి 30న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
- ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమాలో అదితి రావు హైదరి హీరోయిన్ గా నటించింది.
విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి నటించిన ‘గాంధీ టాక్స్’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూకీ సినిమా థియేటర్లలో ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కింద ఉన్నాయి.
ఓటీటీలో గాంధీ టాక్స్ మూవీ విడుదల
Gandhi Talks OTT: ఇండియన్ సినీ చరిత్రలో మూకీ సినిమాలు చాలా రావడం చాలా అరుదు. కానీ, మూకీ సినిమా అంటే మాత్రం టక్కున గుర్తుకు వచ్చేది మాత్రం కమల్ హాసన్ పుష్పక విమానం. సింగీతం శృనివాస్ రావు తెరకెక్కించిన ఈ మంచి విజయం సాధించింది. అయితే, రీసెంట్ గా కూడా ఒక మూకీ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చింది. అదే గాంధీ టాక్స్(Gandhi Talks OTT).
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
తమిళ స్టార్స్ విజయ్ సేతుపతి, అరవింద స్వామి కాంబోలో వచ్చిన ఈ సినిమాను దర్శకుడు కిషోర్ పాండురంగ్ బేలేకర్ తెరకెక్కించాడు. ఈ సినిమాలో అదితి రావు హైదరి హీరోయిన్ గా నటించింది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. ఈ సినిమా జనవరి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఆడియన్స్ ను ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.
రెంటల్ విధానంలో సినిమా చూడాల్సిందే!
తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదలపై అధికారిక ప్రకటన చేశారు మేకర్స్. గాంధీ టాక్స్ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేసింది. కానీ, ఈ సినిమా ఓటీటీలో చూడాలంటే కేవలం సబ్‌స్క్రిప్షన్ ఉంటే చాలదు.. రెంటల్ మోడ్ లో ప్రస్తుతం ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. మరి థియేటర్స్ లో ప్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుంది అనేది చూడాలి.
గాంధీ టాక్స్ సినిమా ఓటీటీలో ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో వేచి చూడాలి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


