
📌 Key Points
- నటుడు శివాజీ వ్యాఖ్యల వివాదంలో గరికపాటి పేరును దుర్వినియోగం చేశారు.
- గరికపాటి టీం దీనిపై స్పందిస్తూ అధికారిక నోట్ విడుదల చేసింది.
- తమ గురువుగారికి వివాదంతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
- తప్పుగా వాడుకునే యూట్యూబర్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రముఖ నటుడు శివాజీ మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యల వివాదం కొనసాగుతోంది. ఈ వివాదంలో ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు పేరును కొందరు యూట్యూబర్లు దుర్వినియోగం చేశారు. దీనిపై ఆయన టీం తీవ్రంగా స్పందించింది, గురువుగారికి సంబంధం లేదని తేల్చిచెప్పింది.
శివాజీ వివాదంలో గరికపాటి పేరు ఎందుకు?
Garikipati – Sivaji: ప్రముఖ టాలీవుడ్ నటుడు శివాజీ(Sivaji) మహిళల వస్త్రధారణ గురించి చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ వివాదంలోకి ఎంతోమంది నటీనటులు హీరోయిన్లు కూడా ఇన్వాల్వ్ అవ్వడంతో ఇప్పటికీ ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. మహిళల వస్త్రధారణ గురించి శివాజీ చేసిన వ్యాఖ్యలపట్ల పలువురు విమర్శించగా మరి కొంతమంది ఆయన మాటలలో తప్పులేదని తెలిపారు. ఇకపోతే శివాజీ వివాదంలో కొంతమంది యూట్యూబర్స్ తమ వ్యూస్ కోసం ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నరసింహారావును(Garikapati Narasimha Rao) కూడా లాగిన సంగతి తెలిసిందే. ఈయన తన ప్రవచనాలలో భాగంగా గతంలో ఎప్పుడో మహిళల వస్త్ర దారణ గురించి మాట్లాడినటువంటి కొన్ని వీడియోలను వైరల్ చేయడంతో గరికపాటిపై కూడా పలు విమర్శలు వచ్చాయి.
ఇలా తనకు ఏమాత్రం సంబంధం లేనటువంటి ఒక వివాదంలో గరికపాటి పేరును ఉపయోగించడమే కాకుండా సోషల్ మీడియా వేదికగా ఆయన వీడియోలను వైరల్ చేయడంతో ఈ వివాదం పట్ల గరికపాటి టీం స్పందిస్తూ అధికారకంగా ఒక నోట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా గరికపాటి టీం స్పందిస్తూ.. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఒక వివాదానికి గురువుగారు ఎప్పుడో చెప్పిన మాటలను జోడించి, వక్రీకరించి వివిధ యూట్యూబ్ ఛానల్ లేని సమస్యను సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో వ్యూస్ కోసం గురువుగారి మాటలు ఫోటోలను ఇష్టానుసారంగా వాడుకోవడం అలవాటుగా మారిపోయింది. ఇలాంటివి పూర్తిగా అర్థరహితమైనవి కవ్వింపు చర్యలు.
గరికపాటి టీం సంచలన ప్రకటన
గురువుగారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై, ఛానల్ లపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం ఖాయమని హెచ్చరించారు. ఇంతకు ముందు కూడా తాము ఎన్నో ఛానెల్స్, వ్యక్తులపై చర్యలు తీసుకున్నాము కావున అభిమానులు ఏ సమాచారానైనా ఒకటికి రెండుసార్లు సరి చూసుకోవడం మంచిది. గురువుగారు అధికారక మాధ్యమాలలో మాత్రమే వారి ప్రసంగాలు, వ్యాఖ్యలు వెలబడతాయి. మిగతా వాటితో వారికి ఎటువంటి సంబంధం లేదు అభిమానులు ఇటువంటి సందర్భాలలో ఎటువంటి ఆందోళన చెందరాదని తెలియజేస్తున్నాము అంటూ గరికపాటి టీం ఈ వివాదంపై స్పందించి క్లారిటీ ఇచ్చారు.
యూట్యూబర్‌లకు గట్టి హెచ్చరిక
ఇలా తమ స్వలాభం కోసం గురువుగారి పేరును ఉపయోగిస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ఇక గరికపాటి గతంలో చేసిన వ్యాఖ్యలను ఇటీవల ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ ప్రస్తావిస్తూ ఒక వీడియోని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇలా తనకు సంబంధంలేని ఒక వివాదంలో గరికపాటి పేరును ప్రస్తావించిన నేపథ్యంలోనే ఆయన టీం అలర్ట్ అవుతూ అందరిని హెచ్చరించారు. ఇలా శివాజీ విషయంలో స్పందించిన నా అన్వేషణ తీవ్రస్థాయిలో విమర్శలను కూడా ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
గరికపాటి పేరును, ఆయన ప్రవచనాలను వక్రీకరించి వాడుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టీం హెచ్చరించింది. అభిమానులు అధికారిక మాధ్యమాలను మాత్రమే విశ్వసించాలని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కోరింది.


