
బిగ్ బాస్ షోలో గౌతమ్ కృష్ణ ‘అశ్వత్థామ’గా పేరు పొందారు. అతనికి ఆ పేరుతోనే ప్రశంసలు, విమర్శలు అందుకున్నారు. ఇప్పుడు తన కొత్త సినిమా ‘సోలో బాయ్’ ప్రమోషన్‌లో ఆ పేరును ఉపయోగించడం వివాదాస్పదం అవుతోంది.
Key Points
బిగ్ బాస్ షోలో గౌతమ్ కృష్ణ 'అశ్వత్థామ'గా పేరు తెచ్చుకున్నారు.
అశ్వత్థామ పేరుతోనే అతనికి విమర్శలు, ప్రశంసలు అందుకున్నారు.
తాజా చిత్రం 'సోలో బాయ్' ట్రైలర్‌లో 'అశ్వత్థామ' ట్యాగ్‌ను ఉపయోగించారు.
నెటిజన్లు గౌతమ్ కృష్ణ నిర్ణయంపై విభిన్నంగా స్పందిస్తున్నారు.
బిగ్ బాస్‌లో గౌతమ్ కృష్ణ యొక్క ప్రయాణం
ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెతుక్కోవాలంటారు. గౌతమ్ కృష్ణ ( Gautham Krishna ) అదే చేశాడు. బిగ్‌బాస్ షో వల్ల అవమానాలు పడ్డాడు, ఆదరణ పొందాడు. అదెలాగంటే.. తెలుగు బిగ్‌బాస్ ఏడో సీజన్‌లో పాల్గొన్న ఇతడు శివాజీకి కరెక్ట్ మొగుడిలా తయారయ్యాడు. నేను పట్టుకున్న మంచానికి మూడే కాళ్లు అన్నట్లు శివాజీ డిక్టేటర్‌గా వ్యవహరిస్తుంటే అది తప్పని ఎదిరించి నిలబడ్డాడు గౌతమ్ కృష్ణ. శివాజీని ప్రశ్నించేందుకు హౌస్‌మేట్స్ వెనకడుగు వేస్తుంటే గౌతమ్ మాత్రం అతడి పెద్దరికాన్ని గౌరవిస్తూనే మాటలు, చేతలతోనే ధీటుగా సమాధానం చెప్పేవాడు.
అశ్వత్థామ అంటూ నవ్వులపాలు! కానీ షో మధ్యలోనే ఎలిమినేట్ అయ్యాడు. అయితే అతడిని వైల్డ్ కార్డ్‌గా హౌస్‌లోకి పంపించినప్పుడు అశ్వత్థామ 2.0 అంటూ వేసిన డైలాగ్ అప్పట్లో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేసింది. ఆ డైలాగ్‌కు ఓవర్ కాన్ఫిడెన్స్ తోడవడంతో గౌతమ్‌పై ట్రోలింగ్ జరిగింది. చివరకు ఫినాలేకు అడుగు దూరంలో ఉండగా ఎలిమినేట్ అయ్యాడు.
‘అశ్వత్థామ’ ట్యాగ్: ప్రశంసలు మరియు విమర్శలు
అశ్వత్థామకు చావు లేదు బిగ్‌బాస్ 8వ సీజన్‌లో మరోసారి వైల్డ్‌కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఎక్కడైతే మాటలు పడ్డాడో అక్కడే తన మాటతో, ఆటతో ప్రశంసలు దక్కించుకున్నాడు. రన్నరప్‌గా నిలిచాడు. మరోసారి చెప్తున్నా.. అశ్వత్థామ ఈజ్ బ్యాక్.. ఈ అశ్వత్థామకు చావు లేదు అంటూ షోలో డైలాగ్స్ వేశాడు. ఇప్పుడదే డైలాగ్‌ను తన పేరు ముందు చేర్చేసుకున్నాడు.
పేరు ముందు అదే ట్యాగ్ గౌతమ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సోలో బాయ్ ( Solo Boy Movie ). బుధవారం ఈ మూవీ ట్రైలర్ రిలీజైంది. ఇందులో గౌతమ్ తన పేరు ముందు అశ్వత్థామ అన్న ట్యాగ్ యాడ్ చేసుకున్నాడు. విమర్శలు, ప్రశంసలు అందించిన అశ్వత్థామ ట్యాగ్‌ను గౌతమ్ వాడుకోవడం చూసి నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. అప్పుడే ఈ ట్యాగ్‌లు అవసరమా? అని కొందరు బుగ్గలు నొక్కుకుంటున్నారు. అయితే సినిమా కోసం నలుగురు మాట్లాడాలంటే ఇలాంటి ప్రయత్నాలు చేయడం మంచిదే, అందులోనూ అతడు పడి నిలబడ్డాడు అని మరికొందరు పాజిటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు .
‘సోలో బాయ్’ ట్రైలర్‌లో ‘అశ్వత్థామ’ ప్రభావం
గౌతమ్ కృష్ణ తన ‘అశ్వత్థామ’ ఇమేజ్‌ను ఉపయోగించుకోవడం చర్చనీయాంశమైంది. సినిమా ప్రమోషన్ కోసం ఈ ట్యాగ్ సహాయపడుతుందో లేదో వేచి చూడాలి.


