|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘గేదెల రాజు కాకినాడ తాలూకా’ మూవీ నుంచి నటుడి పవర్ పోస్టర్ విడుదల

Published: 13-06-2025, 7:54 AM
‘గేదెల రాజు కాకినాడ తాలూకా’ మూవీ నుంచి నటుడి పవర్ పోస్టర్ విడుదల

ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు రఘు కుంచే ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘గేదెల రాజు: కాకినాడ తాలూకా’ సినిమా నుంచి నటుడి పవర్‌ఫుల్ పోస్టర్ విడుదలైంది. ఈ చిత్రం లవ్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతోంది.

Key Points

1

రఘు కుంచే ప్రధాన పాత్రలో నటిస్తున్న 'గేదెల రాజు: కాకినాడ తాలూకా' సినిమా

2

నటుడి పవర్‌ఫుల్ పోస్టర్ విడుదల

4

కాకినాడ దగ్గరలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా కథ

రఘు కుంచే పోస్టర్ విడుదల

టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్, నటుడు రఘు కుంచే(Raghu Kunche) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. తెలుగు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఏకంగా ఐదు నంది అవార్డులు దక్కించుకున్న ఆయన ‘నాదీ నక్కిలీసు గొలుసు’ అనే ప్రైవేట్ పాటతో ఊహించన విధంగా పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం రఘు కుంచే ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేదెల రాజు: కాకినాడ తాలూకా’(GEDELARAJU kakinada Taluka). ఈ సినిమాతో చైతన్య మోటూరి సినిమా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. అయితే ఈ చిత్రం లవ్ అండ్ క్రైల్ థ్రిల్లర్ నేపథ్యంలో కాకినాడ దగ్గరలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా రాబోతుంది. ఇక ఈ సినిమాను వాణి రవి కుమార్ మోటూరి, రఘు కుంచే నిర్మిస్తున్నారు.

అయితే ఇందులో రామచంద్రన్, టీనా, శ్రావ్య, శ్రీదివ్య, మౌనిక(mounika), వికాస్, రవి చిన్న బిల్లి, పుణ్యమంతుల, శ్రీకాంత్ అయ్యంగార్(Srikanth Iyengar), మెహబూబ్ భాషా కీలక పాత్రలో కనపించనున్నారు. గత ఏడాది ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలవగా.. పలు పోస్టర్లు విడుదలై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచాయి. నేడు రఘు కుంచెే పుట్టినరోజు కావడంతో విష్ చేస్తూ చిత్రబృందం ఆయన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఇక ఇందులో మెరున్ కలర్ షర్ట్, లుంగీ కట్టుకుని ఉన్న ఆయన పవర్ ఫుల్ లుక్‌లో కనిపించారు. ఏదో సముద్రం నేపథ్యంలో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ పోస్టర్‌లో చూస్తే ఒకటే నిజం చూడకపోతే వంద అనుమానాలు అని ఉన్న కొటేషన్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతున్నాయి.

లవ్ అండ్ క్రైమ్ థ్రిల్లర్

యదార్థ సంఘటనల ఆధారంగా

రఘు కుంచే పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచింది. సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.