|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గీతా ఆర్ట్స్ పగ్గాలు మార్పు! అల్లు అర్జున్ చేతికి బాధ్యతలు!! సంచలన నిర్ణయాలు?

Published: 10-02-2026, 12:35 AM
గీతా ఆర్ట్స్ పగ్గాలు మార్పు! అల్లు అర్జున్ చేతికి బాధ్యతలు!! సంచలన నిర్ణయాలు?
  • గీతా ఆర్ట్స్ 1972లో అల్లు రామలింగయ్య చే స్థాపించబడింది.
  • ఈ సంస్థ సినిమా, రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ రంగాలలో విస్తరించింది.
  • అల్లు అరవింద్ గారు 50 ఏళ్లుగా సంస్థను విజయవంతంగా నడిపించారు.
  • అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ బాధ్యతలు స్వీకరించి కొన్ని మార్పులు చేశారు.

టాలీవుడ్ లో అగ్ర నిర్మాణ సంస్థగా పేరుగాంచిన గీతా ఆర్ట్స్ ఇప్పుడు కొత్త మార్పులకు సిద్ధమవుతోంది. అల్లు అరవింద్ గారి వారసుడిగా అల్లు అర్జున్ సంస్థ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో సంస్థలో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.

గీతా ఆర్ట్స్ ప్రస్థానం, అల్లు రామలింగయ్య గారి కృషి

Geetha Arts:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అగ్ర నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకున్న వాటిల్లో గీత ఆర్ట్స్ (Geetha arts) కూడా ఒకటి. 1972లో దివంగత హాస్యనటులు అల్లు రామలింగయ్య(Allu Ramalingam) వారసుడు అల్లు అరవింద్ (Allu Arvindh) స్థాపించిన ఈ అగ్రశ్రేణి చలనచిత్ర నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్. ఈ సంస్థ పేరు వెనుక మహానటుడు అల్లు రామలింగయ్య ఉన్న విషయం అందరికీ తెలిసిందే. భగవద్గీత సారాంశం నచ్చి అల్లు రామలింగయ్య ఈ పేరు పెట్టారు. గత ఐదు దశాబ్దాలుగా పదుల సంఖ్యలో సినిమాలను రూపొందిస్తూ.. అటు ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందించడమే కాకుండా.. ఈ బ్యానర్ లో వందల మంది ఉపాధి పొందుతున్నారు కూడా.. ఈ బ్రాండ్ కేవలం సినిమా రంగానికే పరిమితం కాకుండా రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ , థియేటర్లు, పంపిణీ రంగాలలోకి కూడా విస్తరించి ఆదాయాన్ని పెంపొందించుకుంటుంది.

ముఖ్యంగా గీత ఆర్ట్స్ సంస్థ నేడు ఒక బ్రాండ్ గా మారింది అంటే దానికి కారణం అల్లు అరవింద్ అనే చెప్పాలి ..గత 50 సంవత్సరాలుగా ఆయన కష్టపడి నిర్మించుకున్న ఈ గొప్ప నిర్మాణం ఇప్పుడు చేతులు మారింది అనే వార్తలు వ్యక్తం అవుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే గీత ఆర్ట్స్ విస్తృత శ్రేణి గుర్తింపును సొంతం చేసుకోవడానికి అల్లు అరవింద్ ప్రధాన కారణం. అయితే ఆయన తదనంతరం ఈ బాధ్యతలను ఎవరు తీసుకుంటారనే వార్తలు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. ఆయన ముగ్గురు వారసులైన అల్లు బాబి, అల్లు అర్జున్, అల్లు శిరీష్ ఇలా ముగ్గురు కొడుకులు ఉన్నప్పటికీ మొన్నటి వరకూ.. ఏ ఒక్కరు కూడా గతంలో రోజువారి నిర్వహణలో చురుగ్గా పాల్గొనలేదు.

అల్లు అరవింద్ గారి నాయకత్వంలో గీతా ఆర్ట్స్

దీంతో స్వయంగా వ్యాపార పనులన్నీ కూడా అల్లు అరవింద్ చూసుకునేవారు. అటు గీత ఆర్ట్స్ కు సంబంధించిన ప్రతి విభాగంలో కూడా సమర్ధులైన వ్యక్తులను అల్లు అరవింద్ నియమించుకొని మరీ సక్సెస్ సొంతం చేసుకున్నారు. దీంతో వ్యక్తిగతంగా ప్రతి పనిలో వారి అవసరం అంతగా కనిపించలేదని చెప్పాలి. దీనికి తోడు వారి ఫ్యామిలీ మెంబర్ చిరంజీవి తోడల్లుడి కుమార్తె విద్య ఈ నిర్మాణ సంస్థలో కీలక పాత్ర పోషించడంతోనే అల్లు అరవింద్ కి ఎటువంటి ఇబ్బంది కలగలేదు.

అయితే ఇప్పుడు అల్లు అరవింద్ స్థాపించిన వ్యాపార కార్యకలాపాలు అన్నింటిని కూడా అల్లు అర్జున్ పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికీ ఈ సంస్థకు సంబంధించిన పలు నిర్ణయాలను కూడా ఆయన తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పైగా అల్లు అర్జున్ ఇందులోకి ప్రవేశించిన తర్వాత కొన్ని మార్పులు కూడా జరిగాయట. అందులో భాగంగానే పూర్తిస్థాయిలో సంస్థను పర్యవేక్షించడమే కాకుండా రోజువారి చర్చలకు బదులుగా తరచూ సమీక్ష సమావేశాలు, ప్రణాళికలతో పాటు వ్యాపార అభివృద్ధికి సంబంధించిన ప్రధాన నిర్ణయాలను కూడా అల్లు అర్జున్ తీసుకుంటున్నట్లు సమాచారం. పైగా తమ సంస్థలో ఎంతో కాలంగా పనిచేస్తున్న సహచరులకు సరైన గౌరవం ఇస్తూనే .. యువ టాలెంట్ ను కూడా సంస్థలోకి తీసుకుంటున్నారు.

అల్లు అర్జున్ చేతికి గీతా ఆర్ట్స్ భవిష్యత్తు

ఇక అల్లు అర్జున్ ఎంట్రీ ఇప్పటికే ఆలస్యమైనప్పటికీ తన తండ్రి నిర్మించిన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆయన బలమైన నిర్ణయాలు తీసుకుంటూ ఆ సంస్థకు ఊహించని క్రేజ్ అందించడానికి బన్నీ పాటుపడుతున్నట్లు సమాచారం. మొత్తానికైతే తన తండ్రి అల్లు అరవింద్ తదనంతరం ఆ బాధ్యతలను అల్లు అర్జున్ తీసుకోబోతున్నారు అనడంలో సందేహం లేదు. ఏది ఏమైనా యువ టాలెంట్ తో అడుగులు వేస్తున్న అల్లు అర్జున్.. ఈ సంస్థకు గ్లోబల్ స్థాయి మార్కెట్ ను అందిస్తారని చెప్పడంలో సందేహం లేదు

గీతా ఆర్ట్స్ సంస్థ బాధ్యతలు అల్లు అర్జున్ తీసుకోవడం ఒక ముఖ్యమైన పరిణామం. రాబోయే రోజుల్లో ఆయన ఎలాంటి మార్పులు చేస్తారో చూడాలి. భవిష్యత్తులో సంస్థ మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.