|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

గీత భగత్ సంచలనం: శివాజీ కామెంట్స్ వెనుక అసలు నిజాలు బయటపెట్టిన స్టార్ యాంకర్!

Published: 26-02-2026, 12:35 AM
గీత భగత్ సంచలనం: శివాజీ కామెంట్స్ వెనుక అసలు నిజాలు బయటపెట్టిన స్టార్ యాంకర్!
  • గీత భగత్ సంచలన వ్యాఖ్యలు: శివాజీ కామెంట్స్ పై మొదటిసారిగా స్పందన!
  • నిధి అగర్వాల్ ఈవెంట్ లో అసభ్యకర పరిస్థితులు.. స్వయంగా వెల్లడించిన గీత భగత్!
  • డ్రెస్సింగ్ విషయంలో నా ఛాయిస్ నాదే.. ఎవరి అభిప్రాయాలు వారికుంటాయి: గీత భగత్.
  • శివాజీ గారి ఉద్దేశం మంచిదే కానీ.. చెప్పిన విధానంపై గీత భగత్ అసంతృప్తి!

టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన శివాజీ కామెంట్స్ పై స్టార్ యాంకర్ గీత భగత్ రియాక్ట్ అయ్యారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

శివాజీ కామెంట్స్ పై గీత భగత్ రియాక్షన్!

Geetha Bhagat : ఇటీవల శివాజీ హీరోయిన్స్ ని మంచి బట్టలు వేసుకోండి అని మంచి మాటలు చెప్పినా ఓ రెండు అసభ్యకర పదాలు వాడటంతో అది పెద్ద వివాదమే అయింది. ప్రభాస్ రాజాసాబ్ ఈవెంట్లో నిధి అగర్వాల్ డ్రెస్, ఆమెతో అక్కడి జనాలు మిస్ బిహేవ్ చేయడం వల్లే శివాజీ ఈ కామెంట్స్ చేసారు. తాజాగా శివాజీ కామెంట్స్ పై యాంకర్ గీత భగత్ స్పందించింది.

సినిమా ఈవెంట్లను, సెలబ్రిటీ ఇంటర్వ్యూలను హోస్ట్ చేస్తూ స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది యాంకర్ గీతా భగత్. కెరీర్ మొదట్లో సినిమాల్లో కూడా నటించిన గీతా భగత్ ఇప్పుడు నిర్మాతగా కూడా మారింది. డ్రెస్సింగ్ విషయంలో యాంకర్ సుమ లాగే ఎక్కడా హద్దులు దాటకుండా ప్రతి ఈవెంట్, ఇంటర్వ్యూలో పద్దతిగా కనిపిస్తుంది గీత భగత్. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ గీత భగత్ శివాజీ ఇష్యూ పై స్పందించింది.

నిధి అగర్వాల్ ఈవెంట్లో ఏం జరిగిందంటే..

యాంకర్ గీత భగత్ మాట్లాడుతూ.. వేరే వాళ్ళు డ్రెస్ లు అలా వేసుకోవడం వాళ్ళ ఛాయస్ అయితే మంచి బట్టలు వేసుకోవడం నా ఛాయస్. నేను చిన్నప్పనుంచి పంజాబీ డ్రెస్ లే వేసుకున్నాను. అయినా ఇది అంత పెద్ద ఇష్యూ అని కూడా నేను అనుకోవట్లేదు. మన దగ్గర చాలా సమస్యలు ఉన్నాయి. కొంతమందికి ఇది సమస్య అనిపించి వాళ్ళు స్పందిస్తున్నారేమో.

డ్రెస్సింగ్ పై గీత భగత్ వ్యక్తిగత అభిప్రాయం

శివాజీ గారు చెప్పిన మాటలతో ప్రాబ్లమ్ లేదు కానీ చెప్పిన విధానం కరెక్ట్ కాదేమో. అనసూయ గారు ఆలోచించినట్టు వాళ్ళ పేరెంట్స్ ఆలోచించకపోవచ్చు. అసలు ఇదంతా మొదలైంది నిధి అగర్వాల్ ఇష్యూ నుంచే. నిధి అగర్వాల్ వచ్చిన ఆ ఈవెంట్ హోస్ట్ చేసేంది నేనే. ఆ రోజు జనాలు ఎక్కువగా వచ్చారు. నేనే 40 నిముషాలు ఈవెంట్ హోల్డ్ చేయడానికి కష్టపడ్డాను అని తెలిపింది.

గీత భగత్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.