|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఓటీటీలోకి ఇవాళ సడెన్‌గా వచ్చేసిన తెలుగు సైకలాజికల్ హారర్ థ్రిల్లర్- 8 రేటింగ్- యాదార్థ ఘటనలతో- 20 రోజుల్లోనే ఓటీటీకి!

Published: 20-06-2025, 6:43 AM
ఓటీటీలోకి ఇవాళ సడెన్‌గా వచ్చేసిన తెలుగు సైకలాజికల్ హారర్ థ్రిల్లర్- 8 రేటింగ్- యాదార్థ ఘటనలతో- 20 రోజుల్లోనే ఓటీటీకి!

నిఖిల్ దేవాదుల హీరోగా నటించిన ఘటికాచలం సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టింది. నిజ జీవిత ఘటనలతో రూపొందిన ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా 8.0 IMDb రేటింగ్‌ను సాధించింది. థియేటర్ రిలీజ్ తర్వాత 20 రోజుల్లోనే ఓటీటీలో విడుదలైంది.

Key Points

1

8.0 IMDb రేటింగ్‌తో ఘటికాచలం సినిమా ఓటీటీలోకి ఎంట్రీ!

2

నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందిన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్.

4

థియేటర్ రిలీజ్ తర్వాత 20 రోజుల్లోనే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్.

ఘటికాచలం: ఒక సైకలాజికల్ హారర్ అనుభవం

ఓటీటీ హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరే ఉంటుంది. అదనపు అంశాలు జోడించి పర్ఫెక్ట్ ఎంగేజింగ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది. హారర్ మూవీస్‌ను యాక్షన్, కామెడీ, అడ్వెంచర్, సైకలాజికల్ వంటి ఎలిమెంట్స్‌ యాడ్ చేసి చిత్రీకరిస్తుంటారు.

అలా తెలుగులో తెరకెక్కిన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీనే ఘటికాచలం. బాల నటుడిగా పేరు తెచ్చుకున్న నిఖిల్ దేవాదుల హీరోగా మారిన సినిమానే ఘటికాచలం. నిజ జీవితంలో జరిగిన యదార్థ హారర్ ఘటనలతో ఘటికాచలం సినిమాను రూపొందించారు.

అమర్ కామెపల్లి దర్శకత్వం వహించిన ఘటికాచలం సినిమాలో నిఖిల్ దేవాదులతోపాటు బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్, ఆర్వికా గుప్తా, సంజయ్ రాయ్ చుర, జోగి నాయుడు, దుర్గాదేవి, షాన్ కక్కర్, రంగధామ్, అర్జున్ విహాన్, శ్రీనివాస్ కామెపల్లి, సమ్యు రెడ్డి ఇతర కీలక పాత్రలు పోషించారు.

నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందిన కథ

మే 31న థియేటర్లలో విడుదైలన ఘటికాచలం సినిమా పర్వాలేదనిపించుకుంది. అయితే, హారర్ అంశాలు బాగున్నప్పటికీ చిన్న సినిమా కావడంతో పెద్దగా రీచ్ కాలేదు. దాంతో పెద్దగా ఆదరణ పొందలేకపోయింది ఘటికాచలం. అయితే, థియేట్రికల్ రిలీజ్‌ తర్వాత 20 రోజుల్లోనే ఘటికాచలం ఓటీటీ లోకి వచ్చేసింది.

ఇవాళ్టీ (జూన్ 20) నుంచి ఘటికాచలం ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో నేడు ఘటికాచలం ఓటీటీ రిలీజ్ అయింది. ఐఎమ్‌డీబీ సంస్థ నుంచి ఘటికాచలం సినిమా పదికి 8.0 రేటింగ్ సాధించినట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో తన ప్లాట్‌ఫామ్‌లో తెలిపింది.

అంతేకాకుండా భయపెట్టే హారర్ సీన్స్ ఉన్న ఘటికాచలం ఓటీటీలోకి సడెన్‌గా స్ట్రీమింగ్‌కు వచ్చి సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే ఇవాళ ఘటికాచలం డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేసింది. మరి థియేటర్లలో మిస్ అయిన ఈ తెలుగు సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ ఘటికాచలంను ప్రైమ్ వీడియోలో ఎంచక్కా చూసేయండి.

అమెజాన్ ప్రైమ్‌లో ఘటికాచలం ఓటీటీ రిలీజ్

ఇక ఘటికాచలం కథ విషయానికొస్తే.. కౌశిక్ (నిఖిల్ దేవాదుల) తండ్రి కోరిక మేరకు మెడిసిన్ చదువుతాడు. కానీ, కాలేజ్‌లో ఇంట్రావర్ట్ అయిన కౌశిక్‌ను కొంతమంది ఏడిపిస్తుంటారు. హేళన చేస్తుంటారు. ఇదే సమయంలో కౌశిక్‌కు ఒక వాయిస్ భయంకరంగా వినిపిస్తుంటుంది. దాంతో పిచ్చి చేష్టలు చేస్తుంటాడు కౌశిక్.

ఆ తర్వాత ఏమైంది? కౌశిక్ ఎందుకు వింతగా ప్రవర్తిస్తున్నాడు? కౌశిక్‌కు వినిపించే వాయిస్ ఎవరిది? ఎవరిని పడితే వారిని కౌశిక్ ఎందుకు చంపాడు? అనేది తెలిలాయంటే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఘటికాచలం సినిమా చూడాల్సిందే.

8.0 IMDb రేటింగ్‌తో ఘటికాచలం సినిమా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. థియేటర్లలో చూడలేని వారు ఇప్పుడు ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌ను ఆస్వాదించవచ్చు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.