|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మై విలేజ్ షో నుంచి తొలిసారిగా ఓటీటీ సిరీస్ చేశాం.. విజయ్ దేవరకొండ అన్ననే అలా.. యూట్యూబర్ అనిల్ గీలా కామెంట్స్

Published: 09-07-2025, 8:44 PM
మై విలేజ్ షో నుంచి తొలిసారిగా ఓటీటీ సిరీస్ చేశాం.. విజయ్ దేవరకొండ అన్ననే అలా.. యూట్యూబర్ అనిల్ గీలా కామెంట్స్

యూట్యూబ్ లో ప్రసిద్ధి చెందిన ‘మై విలేజ్ షో’ టీం సభ్యుడు అనిల్ గీలా తన తొలి ఓటీటీ సిరీస్ ‘మోతెవరి లవ్ స్టోరీ’ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండల సహకారం గురించి కూడా ఆయన మాట్లాడారు.

Key Points

1

యూట్యూబర్ అనిల్ గీలా తొలి ఓటీటీ సిరీస్ 'మోతెవరి లవ్ స్టోరీ'

2

జీ5 లో ఆగస్ట్ 8న సిరీస్ స్ట్రీమింగ్ ప్రారంభం

4

విజయ్ దేవరకొండ సహకారం గురించి అనిల్ గీలా కృతజ్ఞతలు తెలిపారు

మోతెవరి లవ్ స్టోరీ విడుదల తేదీ

యూట్యూబ్‌లో చాలా పాపులర్ అయిన సిరీస్‌లలో మై విలేజ్ షో ఒకటి. ఈ సిరీస్‌తో బిగ్ బాస్ గంగవ్వ , యూట్యూబర్ అనిల్ గీలా మంచి పాపులారిటి కూడా తెచ్చుకున్నారు. వరల్డ్ ఫేమస్ లవర్ మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనిల్ జీలా ఇప్పుడు ఓటీటీ సిరీస్‌తో అలరించనున్నాడు.

అనిల్ గీలా ఓటీటీ ఎంట్రీ ఇస్తున్న వెబ్ సిరీస్ మోతెవరి లవ్ స్టోరీ. తెలంగాణ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో లవ్, కామెడీ ప్రధాన అంశాలుగా తెరకెక్కింది మోతెవరి లవ్ స్టోరీ. అనిల్ జీలా, వర్షిణి రెడ్డి జున్నుతుల ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరీస్‌కు శివకృష్ణ బుర్రా దర్శకత్వం వహించారు.

తాజాగా మోతెవరి ఓటీటీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. జీ5లో ఆగస్ట్ 8 మోతెవరి లవ్ స్టోరీ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో జూలై 9న మోతెవరి టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హీరో, యూట్యూబర్ అనిల్ గీలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

అనిల్ గీలా కామెంట్స్

అనిల్ గీలా మాట్లాడుతూ .. “మా ‘మై విలేజ్ షో’ టీం నుంచి మొదటి సారిగా ఇలా సిరీస్ చేశాం. మధుర శ్రీధర్ గారు మొదటి సిట్టింగ్‌కే కథను ఓకే చేశారు. జీ5 టీం వల్లే ఈ సిరీస్ ఇంత బాగా వచ్చింది. అనురాధ మేడం ఎప్పుడూ మా వెన్నంటే ఉండి సపోర్ట్ చేశారు. ఆమె ఇచ్చిన ధైర్యం వల్లే ఈ సిరీస్‌ ఇక్కడి వరకు వచ్చింది” అని అన్నాడు.

“మేం ఈ ప్రయాణంలో చాలా కష్టాల్ని ఎదుర్కొంటూనే ఎంతో నేర్చుకున్నాం. చివరకు ఓ అద్భుతమైన సిరీస్ ఆడియెన్స్‌కు అందివ్వబోతోన్నాం. మేం ఇప్పటి వరకు ఎన్నో సార్లు చూశాం. ఆద్యంతం నవ్వుకుంటూనే ఉన్నాం” అని అనిల్ గీలా తెలిపాడు.

“నన్ను విజయ్ దేవరకొండ అన్ననే సినిమాల్లోకి తీసుకువచ్చారు. ఇప్పుడు నా కోసం వచ్చిన ఆనంద్ అన్నకి థాంక్స్. మా ఓటీటీ సిరీస్ మోతెవరి లవ్ స్టోరీ ఆగస్ట్ 8న రాబోతోంది. అందరూ చూడండి” అని యూట్యూబర్, హీరో అనిల్ గీలా కోరాడు.

‘మై విలేజ్ షో’ ప్రభావం

ఇదే ఈవెంట్‌లో జీ5 తెలుగు బిజినెస్ హెడ్ అనురాధ గూడూర్ మాట్లాడుతూ .. “కరోనా టైంలో మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా చూసి ఆశ్చర్యపోయాను. ఆ చిత్రం నాకు చాలా ఇష్టం. వెంటనే ఆ మూవీ రైట్స్‌ను మేం కొనేశాం” అని ఆనంద్ దేవరకొండ మూవీ గురించి చెప్పారు.

“ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీతో సంగీత్ శోభన్‌ (మ్యాడ్ ఫేమ్)కు స్టార్‌డమ్ వచ్చింది. ఇప్పుడు ఈ సిరీస్‌తో అనిల్ గీలాకు స్టార్‌డమ్ వస్తుంది. మై విలేజ్ షో టీంతో అసోసియేట్ అవ్వడం, మధుర శ్రీధర్ గారితో పని చేయడం ఆనందంగా ఉంది. గ్రామీణ రొమాంటిక్-కామెడీగా తెరకెక్కిన ఈ సిరీస్ అందరినీ మెప్పిస్తుంది” జీ5 ఓటీటీ బిజినెస్ హెడ్ అనురాధ గూడూర్ తెలిపారు.

మొత్తం మీద, ‘మోతెవరి లవ్ స్టోరీ’ అనిల్ గీలా కెరీర్ లో ఒక కీలకమైన మలుపు. జీ5 లో ఈ సిరీస్ ప్రేక్షకులను అలరించనుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.