
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నటించిన ‘ఘాటి’ సినిమా నుండి మొదటి పాట ‘సైలోరే’ విడుదలైంది. ఈ పాటలో అనుష్క చీరకట్టులో అందంగా కనిపించడంతో పాటు, విక్రమ్ ప్రభుతో కలిసి రొమాంటిక్ సన్నివేశాల్లో నటించారు.
Key Points
అనుష్క శెట్టి నటించిన 'ఘాటి' సినిమా నుంచి మొదటి పాట విడుదలైంది.
‘సైలోరే’ అనే లిరికల్ వీడియో సాంగ్ లో అనుష్క చీరకట్టులో అందంగా కనిపిస్తున్నారు.
అనుష్క మరియు విక్రమ్ ప్రభు మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయి.
ఈ సినిమాలో అనుష్క, విక్రమ్ ప్రభు లవర్స్ లేదా భార్యాభర్తలుగా కనిపించే అవకాశం ఉంది.
‘ఘాటి’ సినిమా ఫస్ట్ సాంగ్ రిలీజ్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ( Anushka Shetty) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సూపర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనఈ బ్యూటీ.. దాదాపు 20 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఎక్కడ కూడా.. వెనక్కి తగ్గకుండా ఇప్పటివరకు అగ్రశ్రేణి హీరోయిన్ గా అనుష్క శెట్టి ఉన్నారు. అయితే చాలా రోజుల తర్వాత మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు లేడీ ఓరియంటెడ్ సినిమాతో వస్తున్నట్లు తెలుస్తోంది.
అనుష్క శెట్టి క్యూట్ హగ్స్
అనుష్క ప్రస్తుతం చేస్తున్న సినిమా ఘాటి (Ghaati). క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో.. అనుష్క లీడ్ రోల్ లో ఈ సినిమా వస్తోంది. ఇక ఇందులో విక్రమ్ ప్రభు, జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలలో కనిపించనున్నారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ రిలీజ్ చేశారు. సైలోరే అనే లిరికల్ వీడియో సాంగ్ ను తాజాగా రిలీజ్ చేస్తూ చిత్ర బృందం కీలక ప్రకటన చేసింది.
రొమాంటిక్ సన్నివేశాలు
ఇక ఇందులో అనుష్క శర్మ అలాగే… విక్రమ్ ప్రభు మధ్య కొన్ని రొమాంటిక్ సీన్స్ కూడా కనిపించాయి. వీళ్ళిద్దరూ ఈ సినిమాలో లవర్స్ లేదా భార్యాభర్తలు గా కనిపించే అవకాశాలు ఉన్నాయి. అలాగే చాలా రోజుల తర్వాత చీర కట్టులో అనుష్క శెట్టి మెరిసింది. దీంతో ఈ పాట జనాల్లోకి గట్టిగానే వెళ్తుంది.
మొత్తంగా ‘ఘాటి’ సినిమా ఫస్ట్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. అనుష్క శెట్టి చాలా రోజుల తర్వాత తెలుగు తెరకు తిరిగి వస్తున్నందున, ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.


