
అనుష్క శెట్టి నటించిన ఘాటి సినిమా ఇవాళ విడుదలైంది. సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా పంచుకుంటున్నారు. ఈ రివ్యూల ఆధారంగా సినిమా ఎలా ఉందో చూద్దాం.
Key Points
ఘాటి సినిమా ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
అనుష్క శెట్టి నటనకు ప్రశంసలు కురిస్తున్నారు.
బీజీఎం, ఫైట్ సీన్స్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ అదిరిపోయాయని అభిమానులు చెబుతున్నారు.
కొందరు సినిమాను సగటునగా అభివర్ణించారు.
ట్విట్టర్‌లో ఘాటి సినిమాకు ప్రేక్షకుల స్పందన
అనుష్క ( Anushka Shetty) నటించిన లేటేస్ట్ యాక్షన్ డ్రామా ఘాటి . క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి . చాలా రోజుల తర్వాత అనుష్క లీడ్ రోల్లో వచ్చిన ఈ మూవీ ఇవాళే థియేటర్లలో విడుదలైంది .
అనుష్క శెట్టి నటనపై అభిమానుల అభిప్రాయాలు
ఇప్పటికే కొన్ని చోట్ల మార్నింగ్ షోలు పడగా .. ఈ మూవీ చూసిన ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు . ఘాటి ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉందని .. శీలావతిగా అనుష్క అదరగొట్టేసిందని ట్వీట్స్ చేస్తున్నారు . ఈ సినిమాతో క్రిష్ మంచి కమ్ బ్యాక్ ఇచ్చారని అంటున్నారు . బీజీఎం సూపర్‌గా ఉందని.. ఫైట్ సీన్స్‌లో అదరగొట్టేశారని చెబుతున్నారు.
సినిమా హైలెట్స్ మరియు విమర్శలు
అలాగే ప్రీ క్లైమాక్స్ తో పాటు క్లైమాక్స్ అదిరిపోయిందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు . ఫర్ ఫెక్ట్ రివేంజ్ డ్రామా అని .. ట్రైన్ సీక్వెన్స్ వేరే లెవెల్ అని కామెంట్ చేస్తున్నారు . సెకండాఫ్ లో ఫుల్ మీల్స్ ఖాయమని .. రెబల్ క్వీన్ అనుష్క క్లైమాక్స్ లో అదరగొట్టేసిందని అంటున్నారు . విక్రమ్ ప్రభు తన పాత్ర హైలెట్‌గా ఉందంటూ ట్వీట్ చేస్తున్నారు. ఈ సినిమాలో అనుష్కను కాటేరమ్మతో పోలుస్తున్నారు. మరికొందరైతే యావరేజ్‌గా ఉందని పోస్టులు పెడుతున్నారు. అయితే ఇది కేవలం ఆడియన్స్ అభిప్రాయం మాత్రమే . వీటితో సాక్షికి ఎలాంటి సంబంధం ఉండదు .
మొత్తంమీద, ఘాటి సినిమాపై ప్రేక్షకుల అభిప్రాయాలు మిశ్రమంగా ఉన్నాయి. కొందరు ప్రశంసించగా, మరికొందరు సగటునగా భావించారు. చివరి నిర్ణయం ప్రేక్షకులదే.


