
టాలీవుడ్ స్టార్ అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు నటించిన ‘ఘాటి’ సినిమా తాజా అప్డేట్స్‌తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మూవీ మేకర్స్ ఊహించని విధంగా పోస్టర్ విడుదల చేసి ఆసక్తిని రేకెత్తించారు.
Key Points
‘ఘాటి’ సినిమా నుండి మొదటి పాట ‘సైలోర్’ జూన్ 21న విడుదల.
అనుష్క శెట్టి పెళ్లి కూతురి వేషంలో కనిపించే ఊహించని పోస్టర్ విడుదల.
విక్రమ్ ప్రభుతో కలిసి అనుష్క శెట్టి నటించిన ఈ చిత్రం జూలై 11న విడుదల కానుంది.
మూవీ మేకర్స్ వరుస అప్డేట్లతో సినిమాపై హైప్ పెంచుతున్నారు.
‘ఘాటి’ సినిమా నుండి తాజా అప్డేట్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి(Anushka Shetty) ‘సూపర్’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్స్‌ను సొంతం చేసుకుని స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఒకప్పుడు వరుస చిత్రాల్లో నటించిన అనుష్కఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోలతో నటించిన స్వీటీ సడెన్‌గా ‘సైజ్ జీరో’ మూవీతో బరువు అమాంతం పెరిగిపోయింది. ‘బాహుబలి’లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను మంత్రముగ్దులను చేసింది. చివరగా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ తో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం అనుష్క శెట్టి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఘాటి’(Ghati). క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తమిళ హీరో విక్రమ్ ప్రభు(Vikram Prabhu) కీలక పాత్రలో కనిపించనున్నాడు.
యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ కలిసి నిర్మిస్తున్నాయి. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా జూలై 11న థియేటర్స్‌లో రాబోతుంది. దీంతో మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ రిలీజ్ చేస్తూ హైప్ పెంచుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సాంగ్ రాబోతున్నట్లు వెల్లడించారు. సైలోర్ అని సాగే ఈ పాట జూన్ 21న శనివారం నాడు రాబోతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఊహించని పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. ఇక ఇందులో అనుష్క పెళ్లి కూతురి గెటప్‌లో బుగ్గ చుక్కతో కనిపించగా.. విక్రమ్ భుజంపై చేతివేసి మరీ ఫొటో దిగింది. ఇక ఈ పోస్టర్ చూసిన నెటిజన్లలో అంచనాలు మరింత పెరిగాయి.
అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు కలిసి నటించిన సినిమా
జూలై 11న థియేటర్లలో విడుదల
‘ఘాటి’ సినిమాకు సంబంధించిన అప్డేట్లు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. జూలై 11న విడుదలయ్యే ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.


