|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఘట్టమనేని వారసుడిపై ట్రోల్స్.. అమ్మాయిలను ఏడిపించే విలన్ బ్యాచ్ అంటూ

Published: 01-06-2025, 5:58 AM
ఘట్టమనేని వారసుడిపై ట్రోల్స్.. అమ్మాయిలను ఏడిపించే విలన్ బ్యాచ్ అంటూ

సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా, ఆయన మనవడు ఘట్టమనేని జయ కృష్ణ సినీ ప్రవేశంపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఆయన ఫొటోలను ట్రోల్ చేస్తుండగా, మరికొందరు మద్దతు తెలుపుతున్నారు.

Key Points

1

ఘట్టమనేని జయ కృష్ణ సినీ ప్రవేశంపై చర్చ జరుగుతోంది.

2

ఆయన ఫొటోలను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

4

మంచి కంటెంట్ తో ఎంట్రీ ఇవ్వాలని సూచిస్తున్నారు.

ఘట్టమనేని జయ కృష్ణ సినీ అరంగేట్రం

సూపర్ స్టార్ కృష్ణ జయంతి వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ఫ్యామిలీ నుంచి మరో హీరో రాబోతున్నాడని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు తనయుడు ఘట్టమనేని జయ కృష్ణ వెండితెరపై అరంగేట్రం చేయబోతున్నాడని తెలుస్తోంది. అయితే ఆయన ఫొటోలు చూసిన ఘట్టమనేని అభిమానులు మురిసిపోతుంటే.. నెటిజన్లు మాత్రం ట్రోల్ చేస్తున్నారు.

అమ్మాయిలను ఏడిపించే విలన్ బ్యాచ్ లుక్స్ ఉన్నాయంటూ విమర్శిస్తున్నారు. కలర్ ఉన్నా కళ లేదని కొందరు అంటుంటే.. మీకు టాలీవుడ్ సెట్ కాదు కానీ బాలీవుడ్, హాలీవుడ్‌లో ట్రై చేసుకోమని సూచిస్తున్నారు. ఏ యాంగిల్‌లో హీరోలా లేడు కానీ విలన్‌గా హండ్రెడ్ పర్సెంట్ సెట్ అవుతాడని మరికొందరు విమర్శిస్తుంటే.. లుక్స్‌ది ఏముంది తమిళ్, మలయాళం మూవీస్ హీరోస్ లుక్స్ లేకున్నా యాక్టింగ్‌తో ఇరగ్గొడుతున్నారుగా అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పర్ఫెక్ట్‌గా రెడీ అయ్యాక మంచి కంటెంట్‌తో ఎంట్రీ ఇస్తే సరిపోతుందంటున్నారు.

నెటిజన్ల నుండి మిశ్రమ స్పందనలు

విలన్ పాత్రకు సరిపోతాడా?

ఘట్టమనేని జయ కృష్ణ ఎలాంటి పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తారో చూడాలి. మంచి కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తే విజయం సాధించడం ఖాయం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.